Megastar Chiranjeevi: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చేసాయి. కొత్తగా రిలీజ్ అవుతుంది సినిమాలు ఓటీటీలో చూస్తున్నారు. ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాల కోసం థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. ఒకప్పుడు సక్సెస్ కానీ సినిమాలన్నీ కూడా, ఇప్పుడు రీ రిలీజ్ లో సక్సెస్ అవుతున్నాయి.
హీరోతో సంబంధం లేకుండా కేవలం కథ, అలానే సినిమాలోని కొన్ని పాటలు బట్టి రీ రిలీజ్ సినిమాలకు ఆడియన్స్ విపరీతంగా బ్రహ్మరథం పడుతున్నారు. కేవలం స్టార్ హీరోలు సినిమాలు మాత్రమే ఆడాయి అనుకుంటే అది పొరపాటు. డబ్బింగ్ సినిమాలు కూడా అద్భుతమైన రెస్పాన్స్ సాధించాయి. సెవెన్ జి బృందావన్ కాలనీ, రఘువరన్ బీటెక్, త్రీ, సూర్య సన్నాఫ్ కృష్ణన్ వంటి సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
చిరు సినిమాకి ఏంటి పరిస్థితి.?
హీరో పుట్టినరోజుకు వాళ్లు నటించే సినిమాలు రీ రిలీజ్ చేయడం ఆనవాయితీగా మారింది. ఈ తరుణంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమా ఆగస్టు 22న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమాకి భారీ రెస్పాన్స్ వస్తుంది అని అందరూ ఊహించారు. కానీ ఈ సినిమాకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ చాలా పూర్ గా ఉన్నాయి. ఈ బుకింగ్స్ చూస్తుంటే చిరంజీవి సినిమాకు ఏంటి పరిస్థితి అనిపిస్తుంది. ఒకప్పుడు స్టాలిన్ సినిమా రిలీజ్ అయినప్పుడు, టికెట్లు సాధారణంగా దొరికే పరిస్థితి లేదు. అప్పట్లో టికెట్ కోసం ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులు చనిపోయారు కూడా. కానీ ఈ సినిమాకు ఇప్పుడు ఎంతో రెస్పాన్స్ వస్తుంది అని ఊహించారు. కానీ అసలు లేకుండా పోయింది.
అప్పట్లో మిక్స్డ్ టాక్
స్టాలిన్ సినిమాకి సంబంధించి అప్పట్లోనే మిక్స్డ్ టాక్ వచ్చింది. ఠాగూర్ సినిమా అప్పుడే మురగదాస్ తో పనిచేయాలి అని చిరంజీవి నిశ్చయించుకున్నారు. అయితే కొన్ని రోజులు తర్వాత స్టాలిన్ సినిమాతో పనిచేశారు. మురగదాస్ తెలుగులో చేసిన మొదటి సినిమా అది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేదు. ముఖ్యంగా ఈ సినిమా విషయంలో మురగదాస్ చాలా అసంతృప్తిగా ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
చాలామంది తెలుగు దర్శకులు కలిసి ఈ సినిమా క్లైమాక్స్ ను కమర్షియల్ గా మార్చేశారు అని, వాస్తవానికి ఆ క్లైమాక్స్ మురగదాస్ ఇంకోలా డిజైన్ చేశాడు అంటూ అప్పట్లో చాలా కథనాలు వినిపించాయి. ఆ సినిమా తర్వాతే తెలుగులో మురగదాస్ అనే సినిమాలు చేయను అని నిర్ణయించుకున్నట్లు కూడా మాటలు వినిపించాయి. మొత్తానికి కొన్ని సంవత్సరాల తర్వాత స్పైడర్ సినిమాను తెలుగులో చేశాడు మురగదాస్. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది.
Also Read: OTT Movie: ఆ పనికి అడిక్ట్ అయిన అమ్మాయి కథ, ఒక్కడితో ఆపలేదు, నువ్వు ఒక్కడివే చూడు మామ