Farooqi- Ghazanfar lead Afghanistan to historic first-ever win over South Africa in 1st ODI in Sharjah: వన్డే క్రికెట్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు పెను సంచలనాన్ని నమోదు చేసుకుంది. ఎవరు అందుకొని రికార్డును.. క్రియేట్ చేసింది ఆఫ్గనిస్తాన్ జట్టు. ప్రపంచ క్రికెట్ జట్లలో ఆఫ్ఘనిస్తాన్.. చాలా చిన్నది అన్న సంగతి తెలిసిందే. కానీ మొన్నటి టి20 ప్రపంచ కప్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ జట్టు విజయం నుంచి ఆడుతుంది. ఆల్ రౌండర్లు అలాగే మంచి బ్యాటర్లు ఉన్న ఆఫ్గనిస్తాన్ జట్టు… పెద్ద పెద్ద జట్లకు షాక్ ఇస్తూ వస్తోంది. మొన్నటి ప్రపంచ కప్ టోర్నమెంటులో సెమీస్ వరకు వచ్చింది ఆఫ్గనిస్తాన్ టీం.
అయితే తాజాగా మరో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది ఆఫ్ఘనిస్తాన్ జట్టు. తాజాగా దక్షిణాఫ్రికా జట్టు పైన… ఏకంగా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది ఆఫ్ఘనిస్తాన్. చార్జర్ వేదికగా సెప్టెంబర్ 18వ తేదీన అంటే నిన్న ఈ మ్యాచ్ జరిగింది. ఇందులో ఆరు వికెట్ల తేడా… దక్షిణాఫ్రికా జట్టును చిత్తు చేసింది ఆఫ్గనిస్తాన్. అయితే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే… ఆఫ్ఘనిస్తాన్ చరిత్రలో ఇప్పటివరకు సౌత్ ఆఫ్రికా పై వన్డేల్లో ఒక్క విజయం కూడా నమోదు చేయలేదు ఆఫ్ఘనిస్తాన్. కానీ నిన్న ఆ రికార్డును సొంతం చేసుకుంది.
సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసి తొలి విజయాన్ని నమోదు చేసుకుంది ఆఫ్గనిస్తాన్. ఈ ఒక్క గెలుపుతో సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ అలాగే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లపైన.. విజయం సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది ఆఫ్ఘనిస్తాన్. ఇక ఈ విజయాలన్నీ కూడా.. గత ఏడాది కాలంలోనే సాధించింది. ఇది ఇలా ఉండగా మ్యాచ్ వివరాలు ఒకసారి పరిశీలిస్తే…సౌత్ ఆఫ్రికా.. ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య సార్జ వేదికగా మూడు వన్డే ల సిరీస్ జరుగుతోంది. అయితే.. నిన్న జరిగిన మ్యాచ్లో మాత్రం సౌత్ ఆఫ్రికా పైన ఆఫ్గనిస్తాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Also Read: India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా… 33.3 ఓవర్లలో 106 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఇక ఆ లక్ష్యాన్ని ఆఫ్గనిస్తాన్ జట్టు… అవలీలగా చేదించగలిగింది. ఆడుతూ పాడుతూ ఈ లక్ష్యాన్ని ఆఫ్ఘనిస్తాన్ ఛేదించింది. 26 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయిన ఆప్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు విజయం సాధించింది. ఇక సౌత్ ఆఫ్రికా అలాగే ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య రెండో వన్డే సెప్టెంబర్ 20వ తేదీన జరగనుంది. ఈ మ్యాచ్ మన ఇండియా టైమింగ్స్ ప్రకారం సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రారంభమవుతుంది. మరి రెండో వన్డే లోనే అయినా.. సౌత్ ఆఫ్రికా పుంజుకుంటుందా.. లేక చేతులు ఎత్తేస్తుందా అనేది చూడాల్సి ఉంది.