Kohli’s son: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆయన సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ప్రస్తుతం లండన్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ జంటకి రెండవ సంతానం అకాయ్ పుట్టిన తర్వాత వీరిద్దరూ అక్కడికే మఖాం మార్చారు. ఇక ఇటీవల వీరిద్దరూ లండన్ వీధుల్లో సాధారణ పౌరుల్లా తిరుగుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భారతదేశంలో వారికి ఉండే భారీ సెక్యూరిటీ, అభిమానుల కోలాహలం లేకుండా చాలా ప్రశాంతంగా కనిపించారు. లండన్ లోని స్థానికులతో సరదాగా నవ్వుతూ మాట్లాడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Also Read: Ashwin: శ్రేయాస్ అయ్యర్, జైస్వాల్ కారణంగానే ముంబైలో వరదలు… అశ్విన్ సంచలనం
అయితే ఈ జంటకి రెండవ సంతానం 2024 ఫిబ్రవరి 15న పండంటి మగ బిడ్డ జన్మించాడు. ఆ రెండవ సంతానమైన అకాయ్ పుట్టిన గడియపై ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. అదేంటంటే.. ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు {ఆర్.సి.బి} ప్లేయర్ల జట్లే ప్రస్తుతం ఛాంపియన్స్ అవుతున్నాయి. అదెలా అంటే.. విరాట్ కోహ్లీ కుమారుడు అకాయ్ జన్మించిన అనంతరం.. 2024 జూన్ నెల నుండి ఐసీసీ పురుషుల టీ-20 ప్రపంచ కప్ జరిగింది. ఈ టి-20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా పై భారత జట్టు ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ జట్టులో భాగస్వామ్యం వహించాడు ఆర్సీబీకి చెందిన విరాట్ కోహ్లీ.
ఇక ఈ ఫైనల్ మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ టి-20 ఫార్మాట్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు. దీని తర్వాత 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది. మార్చ్ 9న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ ఫైనల్ భారత్ – న్యూజిలాండ్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ని ఓడించింది. ఆ తర్వాత ఐపీఎల్ 2025లో ఆర్సిబి 18 ఏళ్లుగా కొనసాగుతున్న నిరీక్షణకు తెరదించింది. ఇప్పటివరకు ఆర్సిబి కి కప్ లేదనే విమర్శలకు చెక్ పెడుతూ.. ఫైనల్ లో పంజాబ్ కింగ్స్ ని ఓడించింది. ఇక ఏ.బి డివిలియర్స్ కూడా ఆర్సిబి జట్టులో ఓ కీలక ప్లేయర్.
Also Read: Hardik Pandya: SRH కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా…? లక్ష్మణ్ చేసిన ఆ ఒక్క తప్పిదంతో
అందువల్ల ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో సౌత్ ఆఫ్రికా విజయం సాధించిందని, ఇక తాజాగా వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 లో కప్ సాధించిన ఎబి డివిలియర్స్.. ఎట్టకేలకు తన కలను నెరవేర్చుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్ లో టైటిల్ కోసం ఎంతో శ్రమించినా అతడికి టైటిల్ మాత్రం దక్కలేదు. కానీ డబ్ల్యూసిఎల్ కప్ ద్వారా తన కెరీర్ లో తొలి టైటిల్ అందుకున్నాడు. ఫైనల్ లో ఏబీడీ సెంచరీతో సౌత్ఆఫ్రికా విజేతగా నిలిచింది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ కుమారుడు ఆకాయ్ జన్మించిన సమయం చాలా అదృష్టవంతమైనదని.. అందువల్లే విరాట్ కోహ్లీతో సహా జట్టులో ఉన్న ప్లేయర్లకు సంబంధించిన జట్లే ప్రస్తుతం చాంపియన్స్ అవుతున్నానని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.