BigTV English

Indian Cricket Team Wear Black Armbands: ఆఫ్గాన్ మ్యాచ్ లో.. నల్లబ్యాడ్జీలతో టీమ్ ఇండియా

Indian Cricket Team Wear Black Armbands: ఆఫ్గాన్ మ్యాచ్ లో.. నల్లబ్యాడ్జీలతో టీమ్ ఇండియా

Indian Cricket Team Wear Black Armbands in Honour of Late David Johnson: టీ 20 ప్రపంచకప్.. తొలి సూపర్ 8 మ్యాచ్ లో టీమ్ ఇండియా ఆటగాళ్లు నల్ల బ్యాడ్జీలు ధరించి గ్రౌండులోకి వచ్చారు. కంగారుపడకండి. ఇది ఎవరిపైనా నిరసన తెలియజేయడానికి కాదు.. టీమిండియా మాజీ పేస్ బౌలర్ డేవిడ్ జాన్సన్ మృతికి సంతాపంగా భారత ఆటగాళ్లు ఇలా నల్ల బ్యాడ్జీలు ధరించారు.


అది కూడా ఆఫ్గనిస్తాన్ తో  మ్యాచ్ ప్రారంభానికి ముందు.. రెండు దేశాల జట్లు జాతీయ గీతాలు ఆలపించే సమయంలో మాత్రమే వీటిని ధరించారు. అందరూ కంగారుపడకుండా.. ఈ విషయాన్ని ముందుగానే బీసీసీఐ ఎక్స్ వేదికగా తెలియజేసింది. దీంతో సామాజిక మాధ్యమాల్లో గందరగోళం తలెత్తకుండా అప్రమత్తమైంది. లేదంటే ఈపాటికి చిలవలు, పలవలు చేసి.. ఎందుకు నిరసన? ఏమిటి నిరసన? ఎవరిపై నిరసన? ఇలా ఎలా తెలియచేస్తారు? ఇలా ఏవేవో కథలు, ఎవరికి తోచినవి వారు అల్లేసేవారని అంటున్నారు.

ఇంతకీ 52 ఏళ్ల డేవిడ్ జాన్సన్ ఎవరంటే.. కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు. భారత్ తరఫున రెండు టెస్టు మ్యాచ్ లు ఆడిన జాన్సన్, కర్ణాటక తరఫున 39 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడాడు. ఇదే రాష్ట్రానికి చెందిన భారత మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, జవగళ్ శ్రీనాథ్, వెంకటేశ్ ప్రసాద్, దొడ్డ గణేశ్ వీరందరి సమకాలీకుడు. వారితో కలిసి క్రికెట్ ఆడాడు.


Also Read: గెలిపించిన సూర్యా, బుమ్రా.. ఆఫ్గాన్ పై టీమ్ ఇండియా ఘన విజయం

అయితే కర్ణాటకలో తాను నివాసం ఉండే ప్రాంతంలో క్రికెట్ కోచింగ్ అకాడమీ పెట్టాడు. ఆర్థికంగా నష్టపోవడంతో, అప్పులపాలైనట్టు సమాచారం. దానికితోడు ఆరోగ్య సమస్యలు కూడా వెంటాడటంతో అతను ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకంటే ఆయన తన ఇంటి బాల్కనీ పై నుంచి కిందకు పడిపోయాడు. తనే కావాలని పడిపోయాడని, ఈ కష్టాలు పడలేక, ఎదుర్కోలేక ఆత్మహత్య చేసుకున్నాడని అనుకుంటున్నారు. దీంతో అనుమానస్పద మృతి గా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కిందపడిన వెంటనే బంధువులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మరణించారని కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.

Tags

Related News

Virender Sehwag: డైపర్ వేసుకొని సచిన్ సెంచరీ కొట్టాడు.. సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్

Watch Video : ఇదెక్కడి క్రికెట్ రా.. ఇలా ఆడితే అస్సలు రన్ అవుట్ కాబోరు

Sanju Samson : సంజూ అరాచకం.. వరుసగా 6,6,6,6,6,6

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Big Stories

×