BigTV English

Rohit Sharma: ఎవరైనా ఇలా కోరుకుంటారా..? రోహిత్ పై ఒక నెటిజన్ తీవ్ర వ్యాఖ్యలు

Rohit Sharma: ఎవరైనా ఇలా కోరుకుంటారా..? రోహిత్ పై ఒక నెటిజన్ తీవ్ర వ్యాఖ్యలు
Rohit Sharma

India vs England 3rd Test – Rohit Sharma : కాలం మారింది… సమాజం మారింది…అని అంటున్నారు గానీ, ఈ ఆధునిక యుగంలో పెరుగుతున్న వేగం ఎక్కడికి పోతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ క్రమంలో  మనుషుల మనస్తత్వాలు తీవ్ర స్థాయికి చేరుకోవడం ఒకింత ఆందోళన కలిగించే అంశమనే చెప్పాలి.


ఇండియా- ఇంగ్లాండ్ మధ్య రాజ్ కోట్ లో జరుగుతున్న మూడో మ్యాచ్ లో రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే అప్పటికే 33 పరుగులకి 3 వికెట్లు పడిపోయి టీమ్ ఇండియా పీకల్లోతు కష్టాల్లో ఉంది.

ఈ దశలో రోహిత్ శర్మ తన సహజశైలికి విరుద్ధంగా బ్యాటింగ్ ఆడటం మొదలెట్టాడు. ఈ క్రమంలో మార్క్ వుడ్ వేసిన బంతిని డిఫెండ్‌ చేయడానికి ట్రై చేశాడు. కానీ అది బలంగా వెళ్లి రోహిత్ తలకు తగిలింది. అయితే ఆ బాల్ హెల్మెట్ గ్రిల్స్ కి తగిలింది. దాంతో తను పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.


రోహిత్ శర్మ పుల్ షాట్లతో  బౌన్సర్లను ఎదుర్కొంటాడు. వాటిని అలవోకగా బౌండరీలు, సిక్సర్లుగా మార్చుతుంటాడు. కానీ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో మూడు వికెట్లు త్వరగా పడటంతో వికెట్‌ను కాపాడుకుంటూ బంతుల్ని డిఫెండ్ చేశాడు. ఈ క్రమంలోనే బాల్ ని తలకి తాకిచ్చుకున్నాడు.

ఇంతవరకు బాగానే ఉంది. అయితే నెట్టింట ఒక ప్రబుద్ధుడు రోహిత్ శర్మకు బాల్ తగిలిన ఫొటోని పెట్టి, దారుణంగా కామెంట్ చేశాడు. రోహిత్ కు హెల్మెట్ లేకపోతే బాగుండేది, అప్పుడు బాల్ వెళ్లి ముఖానికి తగిలేది. అప్పుడు ఫిలిప్ హ్యూస్ సరసన చేరేవాడని రాసుకొచ్చాడు. 

Read more: ధృవ్ జురెల్ కూడా ఆడేస్తున్నాడు..

ఇంతకీ ఫిలిప్ ఎవరంటే, ఆస్ట్రేలియా యువ బ్యాటర్. ఒక లీగ్ మ్యాచ్ ఆడుతుండగా ఇలాగే బాల్ తలకు తగిలి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

ఆ నెటిజన్ తన పేరే మెన్షన్ చేస్తూ, రోహిత్ బతికి పోయాడు, నెక్స్ట్ టైమ్ బెటర్ లక్ అంటూ మార్క్ వుడ్ ని కోట్ చేస్తూ రాశాడు. దీనిపై నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. 

క్రికెటర్లను విమర్శించడంలో తప్పు లేదు గానీ, మరీ ఇంత అసహజమైన రీతిలో రాయడం క్షమించరాని నేరమని అంటున్నారు. ఇలాంటివారిని సోషల్ మీడియా నుంచి వెలివేయాలని రోహిత్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఆ రాసిన వాడిని దుమ్మెత్తి పోస్తున్నారు.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×