IND Vs PAK : ఆసియా కప్ 2025లో భాగంగా కొద్ది గంటల్లోనే టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ఉత్కంఠ వాతావరణం నెలకొంది. పహల్గామ్ ఉగ్రదాడి తరువాత జరుగుతున్న తొలి పోరు కావడంతో వరల్డ్ వైడ్ గా ఈ మ్యాచ్ పై ఆసక్తి నెలకొంది. మరోవైఉ కొందరూ పాకిస్తాన్ జట్టుతో అస్సలు క్రికెట్ ఆడొద్దనే డిమాండ్లు చేస్తున్నారు. కానీ బీసీసీఐ ఆసియా కప్ లో ఆడేందుకు టీమిండియాకి అనుమతి ఇచ్చింది. ఇవాళ రాత్రి 8 గంటలకు ఇండియా వర్సెస్ పాక్ మధ్య రసవత్తర పోరు జరుగనుంది. పహల్గామ్ దాడి బాధితులు సహా పలువురు భారతీయ అభిమానులు ఇప్పటికీ కూడా పాకిస్తాన్ తో ఇండియా ఆడొద్దని కోరుకుంటున్నారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా బాయ్ కాట్ అంటూ పోస్టులు చేస్తున్నారు.
Also Read : Shoaib Akhtar : రాసి పెట్టుకోండి… పాకిస్థాన్ ను టీమిండియా దారుణంగా ఓడించడం ఖాయం
ఈ నేపథ్యంలోనే కొందరూ టీమిండియా అభిమానులు దొంగచాటుగా పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా మ్యాచ్ లను వీక్షించనున్నట్టు సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇన్ విజిబుల్ బాయ్ కాట్ అంటూ ట్రోలింగ్స్ చేస్తున్నారు. వాస్తవానికి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ని చూడాలని ఎవరైనా భావిస్తారు. ఉగ్రవాదులు దాడి చేస్తున్న కారణంగా ఆదరణ రోజు రోజుకు తగ్గిపోతుంది. మరోవైపు పాకిస్తాన్ తో ఆడొద్దంటే.. టీమిండియా మ్యాచ్ ఆడుతుందని.. ఒకవేళ ఓడిపోతే వాళ్లకు ఉంటదని రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తరువాత మొదటి పాకిస్తాన్ జట్టుతో టీమిండియా ఆసియా కప్ లో తలపడనుంది. క్రికెటర్లనూ బీసీసీఐ ఒత్తిడి చేయవద్దని విజ్ఞప్తి చేశారు. భారత్ తో క్రికెట్ ఆడటం వల్ల పాకిస్తాన్ కి భారీగా ఆదాయం సమకూరుతుందని.. దానిని భారత్ పై యుద్ధం చేసేందుకే వినియోగిస్తున్నారని కొందరి వాదన. ఐసీసీ, ఏసీసీ టోర్నీల్లో పాకిస్తాన్ కి డాలర్ల రూపంలోనే సొమ్ము అందనుంది. దీంతో ఆయుధాలను కొనుగోలు చేసి మనమీదనే ప్రయోగిస్తుందనేది కొందరూ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇండియా గెలవాలని ప్రత్యేక పూజలు..
ఇటీవల వరల్డ్ ఛాంపియన్ షిప్ లెజెండ్స్ క్రికెట్ టోర్నీలో మన మాజీ క్రికెటర్లు పాకిస్తాన్ తో ఆడేందుకు నిరాకరించి వైదొలిగారు. ఇప్పుడు అలాగే చేయవచ్చు కదా అని అభిమానులు పేర్కొంటున్నారు. కానీ అలా టీమిండియా క్రికెట్ లో నెంబర్ వన్ ప్లేస్ లో కొనసాగదని.. ఒకవేళ మ్యాచ్ ని రద్దు చేస్తే.. పాయింట్లలో వెనుకంజలోకి వెళ్తామని కొందరూ తమ అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇవాళ జరిగే మ్యాచ్ చాలా ఉత్కంఠగా ఉండబోనుంది. భారత్-పాక్ మ్యాచ్ అంటే ఉండే ఆ సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇవాళ్టి మ్యాచ్ ని బాయ్ కాట్ చేయాలంటూ డిమాండ్లు వస్తున్నాయి. ఇలాంటి సమయంలోనూ భారత్ గెలవాలంటూ క్రికెట్ అభిమానులు వినూత్నంగా అభిమానం చాటుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ లోని వారణాసి, ప్రయాగ్ రాజ్ లో ప్రత్యేక పూజలు, హోమాలు, జల హారతి వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
Indian fans today 😀 #INDVPAK pic.twitter.com/ARC3VuqSFn
— Nibraz Ramzan (@nibraz88cricket) September 14, 2025