BigTV English
Advertisement

Telangana: గాంధీభవన్‌లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం

Telangana: గాంధీభవన్‌లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం

Telangana: గాంధీభవన్‌లో క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసింది. మశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఈ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో జిల్లాల నుంచి వచ్చిన పలు ఫిర్యాదులపై చర్చించారు. ముఖ్యంగా సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డిపై వచ్చిన ఫిర్యాదుపై ప్రధానంగా చర్చించారు. దళితులను కించపరిచారని ఆయనపై ఫిర్యాదు చేశారు గజ్వేల్ దళిత నేతలు. దీనిపై చర్చించిన కమిటీ..నర్సారెడ్డికి నోటీసులు ఇచ్చింది. వారంలోగా వివరణ ఇవ్వాలని నర్సారెడ్డికి క్రమశిక్షణ కమిటీ ఆదేశించింది.


గజ్వేల్‌లో.. పార్టీ వ్యతిరేక కార్యక్రమాల చేస్తున్నారని హరికృష్ణపై సిద్దపేట లోకల్ నేతలు ఫిర్యాదు..
దాంతో పాటుగా గజ్వేల్‌లో.. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారని పూజల హరికృష్ణ పై ఇటీవల సిద్దిపేట లోకల్ నేతల ఫిర్యాదు చేశారు. దీనిపై కూడా కమటీ చర్చించింది. ఫిర్యాదు ను క్రమశిక్షణ కమిటీకి పంపారు పీసీసీ చీఫ్. దీంతో హరిక్రిష్ణకు షోకాజ్ నోటీస్ పంపింది క్రమశిక్షణ కమిటీ. దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది.

తప్పుడు కేసులతో అట్రాసిటీ కేసు పెట్టారని ఆరోపించిన నర్సారెడ్డి..
తనపై వచ్చిన కంప్లైంట్‌పై స్పందించారు డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి. తానేప్పుడు దళితులకు వ్యతిరేకంగా మాట్లాడులేదన్నారు. తనపై వచ్చినకంప్లైంట్‌పై.. పీపీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు నర్సారెడ్డి. తనపై కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి .. ఏ రోజు కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేయలేదన్నారు నర్సారెడ్డి.


వారంలో వివరణ ఇవ్వాలని నర్సారెడ్డికి క్రమశిక్షణ కమిటీ ఆదేశం
ఇక క్రమశిక్షణ కమిటీలో చర్చించిన అంశాలపై స్పందించారు కమిటీ ఛైర్మన్ మల్లు రవి. సిద్దిపేట డీసీసీ నర్సారెడ్డి పై గజ్వేల్ దలితులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీనిపై నర్సారెడ్డిని వివరణ కోరామన్నారు.

రాజగోపాల్ రెడ్డి అంశం తమ దృష్టికి రాలేదన్న మల్లు రవి
రాజగోపాల్ రెడ్డి అంశంపై కంప్లైంట్ రాలేదని.. వస్తే చర్చిస్తామని మల్లు రవి తెలిపారు. కాంగ్రెస్‌లో చేరికలను ఆహ్వానిస్తున్నామని.. ఇంట్రెస్ట్ ఉన్న వారంతా చేరాలని పిలుపునిచ్చారు. వరంగల్ పంచాయతీ పై పీసీసీ ఛీఫ్‌కు ,సీఎంకు రిపోర్ట్ ఇచ్చామని.. ఫైనల్ నిర్ణయం వారి తీసుకుంటారని తెలిపారు.

Also Read: దారుణం.. కన్న కొడుకును కర్రతో కొట్టి చంపిన తండ్రి..

పార్టీ ఫిరాయింపులపై మట్లాడే అర్హత కేటీఆర్‌కే లేదు- మల్లు
ఈ రోజు పార్టీ ఫిరాయింపులపై మాట్లాడుతున్న కేటీఆర్, హరీష్.. ఆనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్‌లోకి తీసుకున్నప్పుడు వారి బుద్ది ఏమైందని మల్లు రవి ప్రశ్నించారు. కేవలం రాజకీయ లబ్దికోసమే బీఆర్ఎస్ నాటకాలు ఆడుతుందన్నారు.

Related News

Mukunda Jewellery: హైదరాబాద్‌లో ముకుందా జ్యువెలరీ పూర్వి గ్రాండ్ ఓపెనింగ్..

Jubilee Hills: అభివృద్ధికి, సెంటిమెంట్‌కు మధ్య పోటీ.. ‘సెంటిమెంట్’ అడిగే హక్కు బీఆర్ఎస్‌కు లేదన్న సీఎం రేవంత్

Kcr Kavitha: కేసీఆర్ కాదు, ఇక జయశంకరే గాడ్ ఫాదర్

Jubilee Hills: జూబ్లీహిల్స్ గెలుపు వారిదే.. లోక్ పాల్ సంచలన సర్వే.. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్

IAS Transfers: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ.. సీఎస్ ఉత్తర్వులు జారీ

Warangal: పంట నష్టంపై ఎకరానికి రూ. 10 వేలు.. ఇండ్లు డ్యామేజ్ అయిన వాళ్ళకు రూ. 15వేల ఆర్థిక సహాయం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి

Jubilee Hills bypoll: ఇప్పుడు ఏడ చూసినా ఒక్కటే ముచ్చట.. జూబ్లీలో పాగా వేసేదెవరు..? నిజంగా జూబ్లీ కింగ్ ఎవరు?

Hydra: రూ. 30 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా

Big Stories

×