Shoaib Akhtar : ఆసియా కప్ 2025లో భాగంగా కొద్ది గంటల్లోనే టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అయితే చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రాత్రి 8గంటలకు ప్రారంభం కానుంది. పహల్గామ్ ఉగ్రదాడి తరువాత జరుగుతున్న తొలి పోరు కావడంతో వరల్డ్ వైడ్ గా ఈ మ్యాచ్ పై ఆసక్తి నెలకొంది. ఇరు జట్ల మధ్య మ్యాచ్ లో ఎప్పుడూ భారతే హాట్ ఫేవరేట్ గా నిలుస్తోంది. తాజాగా ఈ మ్యాచ్ పై పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు పై ప్రశంసలు కురిపిస్తూనే పాకిస్తాన్ కి వార్నింగ్ ఇచ్చాడు.
Also Read : IND Vs PAK : పాకిస్థాన్ ను దెబ్బకొట్టేందుకు తెలుగోడి స్కెచ్..కొత్త టెక్నిక్ తో బరిలోకి
భారత జట్టు పాకిస్తాన్ ను అధిగమిస్తుందనే విషయం చాలా స్పష్టంగా ఉందని.. ఘోరంగా ఓడించాలని చూస్తారు. ఇది చాలా సులభమేనని వ్యాఖ్యానించాడు. ముఖ్యంగా టీ-20ల్లో భారత జట్టు చాలా అద్భుతంగా ఆడుతుందని.. అలాగే ఈ జట్టుతో చాలా అప్రమత్తంగా ఉండాలని పాకిస్తాన్ జట్టు సభ్యులకు సూచించారు. వారు మీపై ఆధిపత్యం చెలాయిస్తారని క్లియర్ గా తెలుస్తోంది. గతంలో విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్న జట్టు కాదని.. అప్పుడు మిడిల్ ఆర్డర్ సరిగ్గా ఉండేది కాదని.. కానీ ప్రస్తుతం భారత జట్టులో 5 బ్యాటర్లు, ముగ్గురు ఆల్ రౌండర్లు.. అంటే దాదాపు 8 మంది బ్యాటర్లు ఉన్నారు. అలాగే బౌలింగ్ కూడా బాగుందని తెలిపాడు. ఫైనల్ లో పాక్ తో కాదు.. అప్గానిస్తాన్ తో ఆడటానికి వారు ఇష్టపడతారని అక్తర్ పేర్కొన్నాడు. మరోవైపు భారత జట్టులో విరాట్ కోహ్లీ లాంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు లేడని.. ఆ జట్టును ఓడించేందుకు పాకిస్తాన్ కి ఇది మంచి ఛాన్స్ పేర్కొన్నాడు.
మరోవైపు షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలను కూడా మిస్బా ఉల్ హక్ ఖండించాడు. టీమిండియా బ్యాటింగ్ చాలా భిన్నంగా ఉందని.. కొత్త ప్లేయర్స్ మన బౌలర్లను ఇప్పటివరకు ఎదుర్కోలేదన్నాడు. పాక్ బౌలర్లు టాప్ ఆర్డర్ ను కూల్చితే ఇదే మంచి అవకాశం ఉంటుందని తెలిపాడు. కానీ టీమిండియా ప్రస్తుతం మిడిలార్డర్ చాలా స్ట్రాంగ్ గా ఉందని మిస్బా కు మళ్లీ షోయబ్ కౌంటర్ ఇచ్చాడు. భారత జట్టులో సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేయగలరని.. 2 వికెట్లు పడితే కుప్పకూలే జట్టు కాదని.. విరాట్ కాలం నాటి జట్టు అసలే కాదు అన్నాడు. బారత్ పై గెలవడం అంత సులభమైన పని కాదని తెలిపారు. అందరికంటే ఓపెనర్ అభిషేక్ శర్మ చాలా డేంజరస్ ఆటగాడని.. పాక్ జట్టు గుర్తుంచుకోవాలని తెలిపారు షోయబ్ అక్తర్. ప్రస్తుతం అక్తర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.