BigTV English
Advertisement

Ind vs NZ Test Series: టీమిండియాకు తిరుగులేని రికార్డు… 24 ఏళ్లలో న్యూజిలాండ్‌ ఒక్కసారి గెలవలేదు !

Ind vs NZ Test Series: టీమిండియాకు తిరుగులేని రికార్డు… 24 ఏళ్లలో న్యూజిలాండ్‌ ఒక్కసారి గెలవలేదు !

Ind vs NZ Test Series:  2024 సంవత్సరంలో టీమిండియా (India) మంచి దూకుడు లో కనిపిస్తోంది. అన్ని ఫార్మేట్ లలో వరుసగా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తోంది. లేటెస్ట్ గా బంగ్లాదేశ్ జట్టు పైన టెస్ట్ సిరీస్, టి20 సిరీస్ గెలిచిన టీమిండియా ఇప్పుడు మళ్లీ న్యూజిలాండ్ తో (New Zealand) పోరుకు రెడీ అవుతోంది. బెంగళూరు వేదికగా… టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య బెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్ట్ బుధవారం నుంచి బెంగళూరు వేదికగా ప్రారంభమవుతుంది.


ఈ మేరకు ఇప్పటికే బెంగళూరు చేరుకున్న న్యూజిలాండ్  (New Zealand) అలాగే టీమిండియా జట్లు.. ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో నిలవాలంటే ఖచ్చితంగా న్యూజిలాండ్తో జరిగే మూడు టెస్టులు టీమ్ ఇండియా గెలవాలి. ఇప్పటికే… ఈ లిస్టులో నెంబర్ వన్ పొజిషన్లో టీం ఇండియా ఉంది. న్యూజిలాండ్ పైన గెలిచి ఆ తర్వాత ఆస్ట్రేలియా తో… విక్టరీ కొట్టాలని టీమిండియా భావిస్తోంది.

India unbeaten at home since 24 years against New Zealand

అయితే ఇలాంటి నేపథ్యంలో టీమిండియా కు మంచి ఊపు లాంటి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత 24 సంవత్సరాలుగా… టీమిండియా గడ్డపైన న్యూజిలాండ్ ఒక్క టెస్ట్ సిరీస్ కూడా గెలవలేకపోయింది. 1988లో గెలిచిన న్యూజిలాండ్ ఇప్పటివరకు ఒక సిరీస్ గెలవలేదు. 2003 సంవత్సరం నుంచి 2024 వరకు… రికార్డులు ఒకసారి పరిశీలిస్తే… 2003 సంవత్సరంలో జరిగిన ఇండియా (India) వర్సెస్ టీమ్ ఇండియా టెస్ట్ సిరీస్ 0-0 గా డ్రా అయింది.


Also Read: IPL 2025: అంబానీ బిగ్‌ స్కెచ్‌.. ముంబై ఇండియన్స్‌‌‌కు కొత్త కోచ్ నియామకం.!

ఇక 2010 సంవత్సరంలో కూడా టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (New Zealand) మధ్య భారత్ గడ్డపైన మరో టెస్ట్ సిరీస్ జరిగింది. ఆ సమయంలో 1-0 తేడాతో టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది. అనంతరం 2012లో కూడా న్యూజిలాండ్ జట్టు భారత్ గడ్డ పైన అడుగు పెట్టింది. ఆ సమయంలో జరిగిన టెస్ట్ సిరీస్ లో…2-0 తేడాతో టీమిండియా విజయం సాధించడం జరిగింది. ఇక 2016 సంవత్సరంలో… భారత్ గడ్డపై జరిగిన మరో టెస్ట్ సిరీస్ లో టీమిండియా అఖండ విజయాన్ని అందుకుంది.

Also Read: IND vs NZ 2024 Test Series: రేపటి నుంచే టెస్టు సిరీస్… హాట్‌స్టార్‌లో రాదు! ఫ్రీగా ఎలా చూడాలంటే..?

3-0 తేడాతో న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం సాధించింది. ఇక చివరిగా 2021 సంవత్సరంలో కూడా టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య భారత్ గడ్డ పైన టెస్ట్ సిరీస్ జరిగింది. ఆ సమయంలో…1-0 తేడాతో న్యూజిలాండ్ పై (New Zealand) టెస్ట్ సిరీస్ గెలిచింది టీమిండియా. ఇక ఇప్పుడు మూడు టెస్టుల సిరీస్ టీమ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరగనుంది. మరి 24 సంవత్సరాలుగా ఒక్క సిరీస్ గెలువని న్యూజిలాండ్ జట్టు ఈసారైనా గెలుస్తుందా…? లేక టీమిండియా మరోసారి గెలిచి రికార్డు సృష్టిస్తుందా అనేది చూడాలి.

 

 

Related News

Womens World Cup 2025: క‌న్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శ‌ర్మ‌, ప‌డుకుని జెమిమా సెల్ఫీ, BCCI భారీ నజరానా

ICC Women’s World Cup 2025: చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు.. PM నుంచి CM వరకు అభినందనలు

Ind vs SA, Final: వ‌ర‌ల్డ్ క‌ప్ 2025 ఛాంపియ‌న్ గా టీమిండియా.. ప్రైజ్ మనీ ఎంతంటే, రూ.100 కోట్ల‌కు పైగానే ?

Ind vs Sa Final: రెచ్చిపోయిన లేడీ సెహ్వాగ్‌…భారీ స్కోర్ చేసిన టీమిండియా, ద‌క్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే

Ind vs Aus: వాషింగ్టన్ సుందర్ విధ్వంసం.. భారత్ ఘనవిజయం

Ind vs sa final: టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా.. మొదట బ్యాటింగ్ ఎవరిదంటే..?

Ind vs Aus: మెరిసిన టిమ్ డేవిడ్, స్టోయినిస్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే

Ind vs Aus: టాస్ గెలిచిన టీమిండియా.. డేంజర్ ఆల్ రౌండర్ హర్షిత్ రాణా ఔట్, ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే

Big Stories

×