ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ అతి త్వరలోనే ప్రారంభం కానున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ తరుణంలో మెగా వేలం కూడా డిసెంబర్ మొదటి వారంలో లేదా నవంబర్ చివర్లో జరగనుంది. దీనికోసం పది చెట్ల యాజమాన్యాలు ఎంతో ఎదురుచూస్తున్నాయి. ఈసారి మెగా వేలం దుబాయ్ లో జరగనున్నట్లు సమాచారం అందుతోంది.
ఇప్పటికే రిటెన్షన్ రూల్స్ కూడా ప్రకటించేసింది బీసీసీఐ పాలక మండలి. ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆరుగురుని రిటెన్షన్ చేసుకుని అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఫ్రాంచైజీలకు మంచి లాభం జరుగుతుంది. ఎప్పటిలాగే ఇంపాక్ట్ ప్లేయర్ కొనసాగిస్తోంది బీసీసీఐ. అయితే అక్టోబర్ 31వ తేదీలోపు ప్లేయర్లను ఫైనల్ చేయాలని ఇప్పటికే అన్ని జట్లకు ఆదేశాలు వెళ్లాయి. ఇలాంటి నేపథ్యంలో ఐపీఎల్ 2025 టోర్నమెంట్ కోసం ప్లాన్ వేసింది అంబానీ టీం.
తాజాగా ముంబై ఇండియన్స్ జట్టు కోచుగా కొత్త వ్యక్తిని నియామకం చేసింది అంబానీ టీం. శ్రీలంక జట్టుకు సంబంధించిన మాజీ ప్లేయర్ మహిళా జయవర్ధనేను ముంబై ఇండియన్స్ కోచ్గా నియామకం చేశారు. ఈ మేరకు ఆదివారం అధికారిక ప్రకటన కూడా రిలీజ్ అయింది. మార్క్ బౌచర్ స్థానంలో ముంబై ఇండియన్స్ కోచ్గా మహిళా జయవర్ధనే రావడం జరిగింది. ఈయన రెండు సంవత్సరాల పాటు ముంబై కోచ్ గా ఉండే ఛాన్స్ ఉంది.
Also Read: Ind Vs Nz: న్యూజిలాండ్ సిరీస్ కోసం టీమిండియా జట్టు ప్రకటన.. వైస్ కెప్టెన్ గా అతడికి చాన్స్!
2017-2022 వరకు శ్రీలంక మాజీ కెప్టెన్ జయవర్ధనే ప్రధాన కోచ్‌గా ముంబైకి పనిచేశారు. ఇక మళ్లీ అదే బాధ్యతలు అప్పగించారు. ఇక ఈ నియామకంపై జయవర్ధనే మాట్లాడుతూ… “MI కుటుంబంలో నా ప్రయాణం ఎప్పుడూ స్పెషల్ గా ఉంటుంది. ముంబై గెలించేందుకు కృష్టిచేస్తాను” అని జయవర్ధనే తెలిపారు.
అటు ఈ సారి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ కూడా తొలగించే ఛాన్స్ ఉందట. అతని స్థానంలో మళ్ళీ రోహిత్ శర్మ లేదా సూర్య కుమార్ యాదవ్ కు ఛాన్స్ ఇవ్వనున్నారట. కాగా గత ఏడాది ఐపీఎల్ సమయంలో.. ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మను తప్పించి.. హర్ధిక్ పాండ్యాను చేశారు. కానీ దారుణంగా ఆ ప్లాన్ విఫలమైంది. ఈ సారి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ కూడా తొలగించే ఛాన్స్ ఉందట.