Ind vs Sa Final: వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ (ICC Womens World Cup 2025) నేపథ్యంలో ఇవాళ టీమ్ ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India Women vs South Africa Women, Final) మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. నవీ ముంబైలోని డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో (Dr DY Patil Sports Academy, Navi Mumbai) జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 298 పరుగులు చేసి దుమ్ము లేపింది. దక్షిణాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించిన లేడీ సెహ్వాగ్ గా పేరుగాంచిన షఫాలీ వర్మ ( Shafali Verma ) 78 బంతుల్లోనే 87 పరుగులు చేసి రఫ్ ఆడించింది. ఆమెతో పాటు ఆల్ రౌండర్ దీప్తి శర్మ అర్ధ సెంచరీతో రెచ్చిపోయింది. ఈ నేపథ్యంలోనే 7 వికెట్లు నష్టపోయిన టీమిండియా, 298 పరుగులు చేసి, దక్షిణాఫ్రికా ముందు భారీ టార్గెట్ పెట్టింది. ఇక ఈ ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా గెలవాలంటే, నిర్ణీత 50 ఓవర్లలో 299 పరుగులు చేయాల్సి ఉంటుంది.
Also Read: Smriti mandhana: జమీమా సక్సెస్ చూసి కుళ్ళుకుంటున్న స్మృతి మందాన.. టీమిండియాలో అంతర్యుద్ధం ?
టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India Women vs South Africa Women ) మధ్య జరిగిన ఇవాళ్టి ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. మన సెమీ ఫైనల్ లో జమీమా అద్భుతంగా బ్యాటింగ్ చేయగా, ఇవాళ షఫాలీ వర్మ దుమ్ము లేపింది. లేడీస్ రూపంలో దక్షిణాఫ్రికాకు చుక్కలు చూపించింది. 78 బంతుల్లోనే 87 పరుగులు చేసింది. రెండు సిక్సర్లు అలాగే ఏడు బౌండరీలు సాధించింది. 111 స్ట్రైక్ రేటుతో రఫ్ ఆడించింది. అలాగే మరో ఓపిన స్మృతి మందాన ( Smriti Mandana ) 58 బంతుల్లో 45 పరుగులు సాధించింది. ఇందులో ఎనిమిది బౌండరీలు ఉన్నాయి. మొన్న సెమీ ఫైనల్ లో దుమ్ము లేపిన జమీమా 24 పరుగులకే వెను జరిగింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ( Harman preet Kaur ) 20 పరుగులు సాధించారు. దీప్తి శర్మ 58 బంతుల్లో 58 పరుగులు చేసి ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. రీఛార్జ్ ఘోష్ 24 బంతుల్లో 34 పరుగులు సాధించింది.
ఇక టీమిండియాను కట్టడి చేసేందుకు దక్షిణాఫ్రికా ప్లేయర్లు చాలా కష్టపడాల్సి వచ్చింది. ముఖ్యంగా అయబొంగా ఖాకా ( Ayabonga Khaka) 9 ఓవర్స్ లో మూడు వికెట్లు పడగొట్టింది. 58 పరుగులు కూడా ఇచ్చింది. మరో బౌలర్ నాన్కులులేకో మ్లాబా ( Nonkululeko Mlaba ) 10 ఓవర్స్ సంధించి ఒక వికెట్ పడగొట్టింది. 47 పరుగులు ఇచ్చింది. నాడిన్ డి క్లెర్క్ ( Nadine de Klerk) 9 ఓవర్స్ లో 52 పరుగులు ఇచ్చి ఒక వికెట్ సాధించింది. ఇక మిగిలిన బౌలర్లు ఎవరు రాణించలేదు. దానికి తగ్గట్టుగానే లేడీ సెహ్వాగ్ షఫాలీ వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. చివరలో దీప్తి శర్మ మెరుపులు మెరూపించారు. రీచా ఘోష్ కూడా తన పాత్ర పోషించింది. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో చూడాలి.
Also Read: Womens World Cup 2025: టీమిండియాకు రూ.125 కోట్ల ఆఫర్..?ఐసీసీ కంటే 3 రేట్లు ఎక్కువే
Deepti Sharma rises to the ocassion with her 18th ODI fifty 🙌 #INDvSA LIVE ⏩ https://t.co/30mqjJb2dn pic.twitter.com/y6HkWZAadb
— ESPNcricinfo (@ESPNcricinfo) November 2, 2025