Ind vs sa final: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో చివరి ఘట్టమైన ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. ఢిల్లీలోని డీవై పాటిల్ మైదానంలో నేడు సౌత్ ఆఫ్రికాతో తలపడుతోంది టీమిండియా. లీగ్ దశలో సౌత్ ఆఫ్రికాపై ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైంది భారత జట్టు. ఇప్పటివరకు ఐసీసీ టోర్నీ గెలవని భారత మహిళా జట్టు.. ఈ ఫైనల్ లో గెలిచి కప్ సాధించాలని పట్టుదలతో ఉంది.
Also Read: Ind vs Aus: మెరిసిన టిమ్ డేవిడ్, స్టోయినిస్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే
ఇక ఈ ఫైనల్ మ్యాచ్ ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు పెద్ద ఎత్తున మైదానానికి తరలివచ్చారు. అయితే అవుట్ ఫీల్డ్ తడిగా ఉన్న కారణంగా టాస్ ప్రక్రియను కాస్త ఆలస్యంగా ప్రారంభిస్తామని ప్రకటించారు. కానీ ఆ తర్వాత చిన్నపాటి వర్షం కారణంగా టాస్ ప్రక్రియని 3:00 గంటలకు ప్రారంభించాలనుకున్నారు అంపైర్లు. ఈ క్రమంలో మరోసారి వర్షం ఆటంకం కలిగించడంతో టాస్ ప్రక్రియని 4:30 గంటలకు నిర్వహించారు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయబోతోంది.
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): లారా వోల్వార్డ్ట్(సి), తజ్మిన్ బ్రిట్స్, అన్నేకే బాష్, సునే లూస్, మారిజానే కాప్, సినాలో జాఫ్తా(w), అన్నరీ డెర్క్‌సెన్, క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్, అయాబొంగా ఖాకా, నాన్‌కులులేకో మ్లాబా.
టీమిండియా (ప్లేయింగ్ XI): షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), దీప్తి శర్మ, రిచా ఘోష్ (w), అమంజోత్ కౌర్, రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్.
ఇక ఐసీసీ ఈసారి ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ ట్రోఫీకి రికార్డ్ స్థాయిలో ప్రైజ్ మనీని ప్రకటించింది. పురుషుల టోర్నీకి సమానంగా మొదటిసారి మహిళల టోర్నీకి ప్రైజ్ మనీని ఇవ్వబోతున్నట్లు వెల్లడించింది. ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నీకి ఐసీసీ మొత్తం రూ. 122 కోట్లు కేటాయించినట్లు సమాచారం. ఇందులో ఫైనల్ మ్యాచ్ లో గెలుపొందిన జట్టుకు సుమారు 40 కోట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే రన్నరప్ జట్టుకు 20 కోట్లు ఇవ్వనున్నట్లు సమాచారం. మరోవైపు హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు సౌత్ ఆఫ్రికాను ఓడించి ప్రపంచ ఛాంపియన్ గా నిలిచినట్లయితే బీసీసీఐ కూడా భారీ నజరానా ప్రకటించింది.
Also Read: Lara: గంభీర్ ఘోరమైన తప్పు చేస్తున్నాడు… టీమిండియాను దేవుడు కూడా కాపాడలేడు
ఈ ఫైనల్ మ్యాచ్ లో భారత్ ప్రపంచ కప్ గెలిస్తే మహిళా జట్టుకు బీసీసీఐ కోట్ల విలువైన బహుమతి అందించే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత సంవత్సరం టి-20 ప్రపంచ కప్ గెలిచిన భారత పురుషుల జట్టుకు అందుకున్న అదే ప్రైజ్ మనీని మహిళా జట్టుకు కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 2024 టి-20 ప్రపంచ కప్ గెలిచిన టీమిండియా పురుషుల జట్టుకు బిసిసిఐ 125 కోట్ల భారీ ప్రైజ్ మనీ అందించింది. ఇప్పుడు అదే తరహాలో భారత మహిళా జట్టుకు కూడా 125 కోట్ల ప్రైజ్ మనీ దక్కనుంది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
మహిళల వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో తలపడుతున్న భారత్, దక్షిణాఫ్రికా జట్లు
వర్షం కారణంగా టాస్ ఆలస్యం
మొదట బ్యాటింగ్ చేయనున్న టీమిండియా#INDwvsSAw https://t.co/VS1jZ9smq4 pic.twitter.com/KIIlR8UCH8
— BIG TV Breaking News (@bigtvtelugu) November 2, 2025