Ind vs Aus: ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5 టీ-20 ల సిరీస్ లో భాగంగా నేడు హోబర్ట్ లోని బెల్లరివ్ ఓవల్ మైదానం వేదికగా జరుగుతున్న మూడవ టి-20 లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ {Surya kumar yadav} మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు మొదట బ్యాటింగ్ ప్రారంభించింది. ఈ పర్యటనలో ఐదు మ్యాచ్ ల తర్వాత భారత జట్టు టాస్ గెలవడం ఇదే మొదటిసారి. గిల్ కెప్టెన్సీలో 3 వన్డేల సిరీస్ లో.. 3 వన్డేలలో టాస్ ఓడిపోయిన భారత జట్టు.. సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలోని తొలి రెండు టీ-20లలో కూడా టాస్ ఓడిపోయింది. ఇక మూడవ టి-20లో టాస్ గెలిచి కాస్త ఊపిరి పీల్చుకుంది.
Also Read: Ind vs Aus: టాస్ గెలిచిన టీమిండియా.. డేంజర్ ఆల్ రౌండర్ హర్షిత్ రాణా ఔట్, ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే
ఈ మూడవ టి-20కి జట్టులో మూడు మార్పులతో బరిలోకి దిగింది టీమిండియా. అర్షదీప్ సింగ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్ లను తుది జట్టులోకి తీసుకువచ్చారు. ఈ మార్పుల కారణంగా కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్, హర్షిత్ రానాకి ఉద్వాసన పలికారు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కి దిగిన ఆస్ట్రేలియా జట్టుకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. అర్షదీప్ సింగ్ బౌలింగ్ లో ఆస్ట్రేలియా డేంజరస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ {6} భారీ షాట్ కి ప్రయత్నించి తొలి ఓవర్ 4వ బంతికి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత అర్షదీప్ సింగ్ బౌలింగ్ లోనే మూడవ ఓవర్ లో ఇంగ్లిస్ {1} పెవిలియన్ చేరాడు.
Also Read: Lara: గంభీర్ ఘోరమైన తప్పు చేస్తున్నాడు… టీమిండియాను దేవుడు కూడా కాపాడలేడు
అయితే ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికీ టిమ్ డేవిడ్, స్టోయినీస్ మాత్రం విధ్వంసం సృష్టించారు. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో టీమ్ డేవిడ్ {74}, స్టోయినిస్ {64 } పరుగులు చేశారు. టీమ్ డేవిడ్ 8 ఫోర్లు, ఐదు సిక్సర్లు బాదాడు. చివర్లో మాథ్యూ షాట్ {26} అద్భుతంగా రాణించాడు. ఇక కెప్టెన్ మిచెల్ మార్ష్ {11} పరుగులు చేశారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3, వరుణ్ చక్రవర్తి 2, దూబే 1 వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ లో భారత్ గెలుపొందాలంటే 187 పరుగులు చేయాలి.
ఈ మ్యాచ్ లో గెలవాలంటే మంచి ఫామ్ లో ఉన్న అభిషేక్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ వారి బ్యాట్లకు పని చెప్పాల్సిన సమయం వచ్చింది. ఇదే మైదానంలో 2012లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ లో 321 పరుగుల లక్ష్య చేదనలో విరాట్ కోహ్లీ 86 బంతుల్లో అజయంగా 133 పరుగులు చేశాడు. కాబట్టి బ్యాటర్లు కాస్త నిలకడను చూపితే పరుగుల వర్షం కురవడం ఖాయం.