E-Paper
Advertisement

T20 World Cup : T20 వరల్డ్ కప్ లో మళ్లీ భారత్ Vs పాక్?

T20 World Cup : T20 వరల్డ్ కప్ లో మళ్లీ భారత్ Vs పాక్?
Advertisement

T20 World Cup : T20 వరల్డ్ కప్ సూపర్-12లో పాకిస్థాన్ పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీకి కోట్లాది ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. మ్యాచ్ చూసిన వాళ్లకి… కోహ్లీ, పాండ్యా బ్యాటింగ్.. చివరి మూడు ఓవర్లు.. ముఖ్యంగా ఆఖరి 8 బంతులు… అలా మైండ్ లో ఫిక్సైపోయాయి. దాయాదుల మధ్య హైఓల్టేజ్ ఫైట్ ఏ రేంజ్ లో ఉంటుందో… క్రికెట్ ఆడే అన్ని దేశాల ఆటగాళ్లకు, అభిమానులకు తెలిసొచ్చింది. అందుకే… T20 వరల్డ్ కప్ మొత్తానికే హైలెట్ గా నిలిచిన ఆ మ్యాచ్ తర్వాత… ఇక పొట్టి ప్రపంచకప్ లో చూడ్డానికి ఏం మిగిలిందని… వరల్డ్ కప్ ను ఆపేస్తే సరి! అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో… T20 వరల్డ్ కప్ లో మరోసారి భారత్-పాక్ తలపడే అవకాశాలు ఉన్నాయా? అని ఫ్యాన్స్ లెక్కలేసుకుంటున్నారు. రకరకాల ఈక్వేషన్స్ తో కుస్తీ పడుతున్నారు.

అన్నీ కుదిరితే దాయాది జట్లు మళ్లీ ఫైనల్లో తలపడే ఛాన్స్ కనిపిస్తోంది. అనేక సమీకరణాలు వర్కౌట్ అయితే… T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ను భారత్-పాక్ మధ్య చూడగలం. దీని కోసం మొదట జరగాల్సింది… గ్రూప్-బిలో ఉన్న భారత్- పాకిస్థాన్… సూపర్ 12 మ్యాచ్ లు ముగిసే సరికి తొలి రెండు స్థానాల్లో ఉండాలి. ఆ తర్వాత… రెండు జట్లు సెమీఫైనల్లో తమతమ ప్రత్యర్థుల్ని ఓడిస్తే… రెండు దేశాలు ఫైనల్ చేరతాయని ఫ్యాన్స్ లెక్కలేస్తున్నారు.

Advertisement

గ్రూప్-బిలో ఉన్న భారత్, పాక్… మిగతా జట్లైన దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వే, నెదర్లాండ్స్‌ను ఓడించాల్సి ఉంటుంది. 3 లేదా 4 మ్యాచ్‌లు గెలిచి గ్రూప్-బిలో మొదటి రెండు స్థానాల్లో నిలిస్తే… భారత్, పాక్ సెమీస్‌ చేరతాయి. గ్రూప్‌-ఎ నుంచి సెమీస్ చేరిన జట్లతో తలపడతాయి. గ్రూప్‌-ఏలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ లాంటి బలమైన జట్లు ఉన్నాయి. వీటి నుంచి సెమీస్‌కు వచ్చిన రెండు జట్లను భారత్, పాక్‌ ఓడిస్తే… దాయాదుల సమరాన్ని ఫైనల్లో చూడొచ్చని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. ఇవన్నీ జరుగుతాయో లేదో చూడాలంటే… నవంబర్ 13 వరకు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే… ఆ రోజే T20 వరల్డ్ కప్ ఫైనల్ మరి!

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×