Big Stories

Benefits of Shaving : ప్రతి రోజూ షేవింగ్‌ చేసుకోవడం వల్ల లాభాలివే!

Benefits of Shaving : ఈ రోజుల్లో క్లీన్‌ షేవ్‌ చేసుకునేవారి కంటే గుబురుగా గడ్డం పెంచుకునేవారే ఎక్కువయ్యారు. ఎవరిష్టం వారిది. అయితే ప్రతిరోజూ షేవింగ్‌ చేసుకోవడంతో కూడా కొన్ని లాభాలున్నాయంటున్నారు నిపుణులు. ఇంటర్వ్యూలకు వెళ్లేటప్పుడు నీట్‌గా షేవ్‌ చేసుకుని రావాలని చెప్పడం మామూలే. ఆర్మీలో అయితే రెగ్యులర్‌ షేవింగ్‌ తప్పనిసరి. షేవింగ్‌ చేసుకోవడంతో యంగ్‌గా, ఎనర్జిటిక్‌గా కనిస్తారు. ముఖంపై ఉండే జుట్టు శుభ్రం అవుతుంది. ఇది చర్మ సమస్యలను కూడా తగ్గిస్తుంది, చర్మపై ఉండే డెడ్‌ స్కిన్‌ను కూడా తొలగిస్తుంది. ఓ అధ్యయనం ప్రకారం ఉదయం నిద్రలేచి షేవింగ్‌ చేసుకునే వారు చాలా ఉత్సాహంగా ఉంటారని తేలింది. పనులకు వెళ్లే వారు ఉదయాన్నే గడ్డం గీసుకోవడం వల్ల ఆ పనిని సక్రమంగా, మరింత సామర్థ్యంతో చేస్తారని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. గడ్డంలో అనేక రకాల బ్యాక్టీరియా ఉంటుంది. ఇది చర్మాన్ని పాడుచేస్తుంది. దీంతో ముఖంపై మచ్చలు వస్తాఏర్పతాయి. రోజూ షేవింగ్‌ చేయడం వల్ల ఈ బ్యాక్టీరియా తొలగిపోతుంది. షేవింగ్‌ చేసుకునేటప్పుడు వాడే ప్రీషేవ్‌ ఆయిల్, షేవింగ్‌ క్రీమ్, జెల్‌ వంటివి చర్మ పీహెచ్‌ స్థాయిని సమతుల్యం చేస్తాయి. అందుకే మంచి షేవింగ్ క్రీమ్, మంచి రేజర్‌తో క్లీన్ షేవ్ చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల కొత్త హెయిర్ రావడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా షేవింగ్ క్రీమ్‌లు జుట్టును మృదువుగా చేస్తాయి. చర్మాన్ని తేమగా ఉంచుతాయి. కానీ సబ్బులు చర్మాన్ని పొడిగా ఉంచుతాయి. అందుకే షేవ్ చేయడం అంత సులభం కూడా కాదు. సబ్బుతో షేవింగ్ చేయడం వల్ల చర్మంపై చికాకు, ఇతర ప్రభావాలు కూడా కలుగుతాయి. క్లీన్‌షేవ్‌ వల్ల పాత హెయిర్ మరియు రఫ్‌గా ఉన్నహెయిర్ పోయి, కొత్తగా షైనీ హెయిర్ వస్తుంది. మన రేజర్‌ని ఇతరులతో పంచుకోకూడదు. హానికరమైన బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, సూక్ష్మజీవులు కూడా ఆర్‌ఏఎస్‌ ద్వారా మనపై ప్రభావం చూపుతాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News