BigTV English

India vs South Africa : ఆ ముగ్గురిని ఎందుకు ఆడించలేదు ? సూర్యాపై సీనియర్ల గుర్రు..

India vs South Africa : ఆ ముగ్గురిని ఎందుకు ఆడించలేదు ? సూర్యాపై సీనియర్ల గుర్రు..
India vs South Africa

India vs South Africa : సౌతాఫ్రికా గడ్డపై టీమ్ ఇండియా టీ 20 మ్యాచ్ ఓడిపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. నెంబర్ వన్ బౌలర్ ని కాదని ఇవేం ప్రయోగాలు అంటూ సీనియర్లు గుస్సా అవుతున్నారు. మరి కెప్టెన్ సూర్య కుమార్ ఏం నోరు విప్పి, టీమ్ మేనేజ్మెంట్ కి చెప్పడం లేదా? అని అడుగుతున్నారు.


ముఖ్యంగా ఆ ముగ్గురిని ఎందుకు ఆడించలేదని కోప్పడుతున్నారు. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరంటే శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, రుతురాజ్ గైక్వాడ్ వీరిని ఆడించకపోవడం ఆత్మహత్యా సదృశ్యమే అంటున్నారు. టీ 20 వరల్డ్ కప్ ముందు టీమ్ ఇండియా కేవలం 5 మాత్రమే టీ 20 మ్యాచ్ లు ఆడనుంది.

ఇప్పుడు ఆల్రెడీ ఒకటి అయిపోయింది. ఇంక నాలుగే ఉన్నాయని అంటున్నారు.  అంత మెగా టోర్నమెంట్ ముందు అంతర్జాతీయ పిచ్ లపై ఇవేం ప్రయాగాలని మండిపడుతున్నారు.


ముఖ్యంగా గౌతమ్ గంభీర్ అయితే, శ్రేయస్ ను పక్కన పెట్టడం అర్థం కాలేదని అన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టీ20లో అతడు హాఫ్ సెంచరీ చేయడం వల్లనే కదా, మ్యాచ్ గెలిచిందని గుర్తు చేశాడు.

లెఫ్ట్ హ్యాండర్ కోసమని తప్పించారా? లేక శ్రేయాస్ కు గాయమైందా?  ఏం జరిగిందనేది ప్రపంచానికి తెలియాలి. లేకపోతే రకరకాలుగా మాట్లాడతారని అన్నాడు. ఇక నంబర్ వన్ బౌలర్ రవి బిష్ణోయ్ ను తుదిజట్టు నుంచి తప్పించారు. ఎందుకో తెలీదని అన్నాడు.

ఇక సంజయ్ మంజ్రేకర్ మాట్లాడాడు.. ”ఫస్ట్ డౌన్ లో శ్రేయస్ బదులుగా తిలక్ వర్మ వచ్చాడు. వన్డే వరల్డ్ కప్ లో టీమిండియాలో ఆరుగురు కుడిచేతి వాటం బ్యాట్స్ మెన్ ఉన్నారు. కానీ సౌతాఫ్రికా రెండో టీ20 మ్యాచ్ లో ఒకరు లెఫ్ట్, మరొకరు రైట్ ఇలా చూసుకున్నారు.

ఇదే భారత్ బ్యాటింగ్ టైనప్ లో లోపించిందని అన్నాడు.  అన్ని ఫార్మాట్లలో మార్పు కోసం ప్రయత్నించడం తప్పులేదని అన్నాడు. కానీ శ్రేయస్, రుతురాజ్ జట్టులో లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది” అని మంజ్రేకర్ వివరించాడు.

పీయుష్ చావ్లా మాట్లాడుతూ.. ”ఆస్ట్రేలియా సిరీస్ లో రవి బిష్ణోయ్ ఐసీసీ ర్యాంకింగ్స్ లో టాప్ లో నిలిచాడు. అతడిని ఎంపిక చేయకుండా బెంచ్ మీద కూర్చోబెట్టడం సరైనది కాదని అన్నాడు.  ఇది జట్టుపై కచ్చితంగా ప్రభావం చూపిస్తుందని అన్నాడు.

ఇలా జట్టు కూర్పుపై సీనియర్లు విమర్శించారు. మ్యాచ్ ఓడిపోయింది కేవలం, ఆటగాళ్ల ఎంపిక వల్ల, సమతూకం లేకపోవడం వల్లనేనని అంతా అనుకుంటున్నారు. కాకపోతే శ్రేయాస్, రుతురాజ్, రవి బిష్ణోయ్ వీరందరూ ప్రూవ్ చేసుకున్నారు.

ఇక మిగిలిన వారిని చూడాలి. అలాగే ఎక్కువ టీ20 మ్యాచ్ లు లేవని, అందుకే మిగిలిన వారిని టెస్ట్ చేస్తున్నారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×