Ind vs Sa final: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ తుది ఘట్టానికి చేరుకుంది. నవంబర్ 2 {నేడు} ఢిల్లీలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగే ఫైనల్ లో సౌత్ ఆఫ్రికాతో తలపడబోతోంది భారత జట్టు. ఈ ఇరుజట్లు లీగ్ దశలో పోటీ పడగా.. సౌత్ ఆఫ్రికా గెలుపొందింది. ఈ క్రమంలో నేడు ప్రతీకారం తీర్చుకునేందుకు భారత జట్టు సిద్ధమైంది. ఈ ఇరుజట్లు సెమీఫైనల్ లో అద్భుత విజయాలతో ఫైనల్ కి అర్హత సాధించాయి.
Also Read: Rohit Sharma: Uber టాక్సీలో రోహిత్ శర్మ.. వీడియో వైరల్
అయితే ఇప్పటివరకు ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవని భారత్.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు సౌత్ ఆఫ్రికా కూడా ఫైనల్ లో గెలిచి కప్ కొట్టాలని భావిస్తోంది. ఆదివారం రోజు మధ్యాహ్నం 3:00 నుండి ఈ రసవత్తర పోరు ప్రారంభం కాబోతోంది. ఈ విజయం భారత మహిళల క్రికెట్ పై దేశవ్యాప్తంగా కొత్త ఉత్సాహాన్ని రగిలించనుంది. మరోవైపు ఈ ఫైనల్ మ్యాచ్ ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశాలు ఉన్నాయి.
మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కాబోతున్న సమయంలో దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. ఫైనల్ కి ముందు జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన సౌత్ ఆఫ్రికా కెప్టెన్ లారా.. సొంత మైదానంలో ఆడడం వల్ల భారత జట్టుపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుందని వ్యాఖ్యానించింది. “ఇది చాలా మంచి అవకాశం. కానీ ఇదే సమయంలో భారత జట్టుపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దేశమంతా వారి వెంటే ఉంది. భారత జట్టు గెలవాలని దేశం ఆశిస్తుంది.
Also Read: IPL 2026: ఐపీఎల్ లో సంచలనం… ఢిల్లీకి సంజూ.. రాజస్థాన్‌కు స్టబ్స్?
కానీ ఇవి కేవలం అంచనాలు మాత్రమే కదా. ఈ ఒత్తిడి మాకు అనుకూలంగా మారుతుందని నేను భావిస్తున్నాను. నేను ఈ మ్యాచ్ కోసం చాలా ఉత్సాహంగా ఉన్నాం. భారత్ చాలా మంచి టీం. వారిని ఓడించాలంటే మేము చాలా బాగా ఆడాలి. కానీ ఈ గొప్ప అవకాశం కోసం మేము సిద్ధంగా ఉన్నాం. ఈ ఫైనల్ లో హార్మన్ సేనను ఓడించి భారత అభిమానులను సైలెంట్ చేస్తాం. గత రికార్డులను పరిగణలోకి తీసుకోకుండా మ్యాచ్ ని ఫ్రెష్ గా ప్రారంభిస్తాం. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండే వారే ఫైనల్ లో ముందంజ వేస్తారు” అని పేర్కొంది.
గత వరల్డ్ కప్ ఫైనల్, సెమీఫైనల్స్ లో తమ జట్టు ఓటమి నుంచి ఏర్పడ్డ అనుభవాల గురించి, నేర్చుకున్న పాఠాలను గుర్తు చేసుకుంది దక్షిణాఫ్రికా కెప్టెన్. ” మేము ఫైనల్ కి చేరిన మొదటిసారి మా మనసులో ట్రోఫీ గురించి, గెలవాలనే ఉత్సాహం గురించే ఆలోచన ఉండేది. కానీ ఇప్పుడు మేం ఓ నాణ్యత గల జట్టుతో ఆడబోతున్నాం. దీంట్లో నేను చాలా దూరం ఆలోచించకుండా ఈరోజు మ్యాచ్ లో ఏం చేయాలనే దానిపై దృష్టి పెట్టాను. ఏం చేసినా అంతా నెమ్మదిగా చేయాలనుకుంటున్నాను” అంటూ సౌతాఫ్రికా కెప్టెన్ చేసిన వ్యాఖ్యలతో నేడు జరగబోయే ఫైనల్ మ్యాచ్ పై అంచనాలు మరింత పెరిగాయి.