Lara: భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరిగిన 3 వన్డేల సిరీస్ లో భారత జట్టు కేవలం మూడవ వన్డేలో మాత్రమే గెలిచి సిరీస్ ని కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఈ మూడు వన్డేలలో ఓ భారత క్రికెటర్ ఎప్పటిలాగే అట్టర్ ప్లాప్ అయ్యాడు. దీంతో అతనిపై అభిమానులు తీవ్ర విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అతడు మరెవరో కాదు కెప్టెన్ గిల్. ముఖ్యంగా మూడవ వన్డేలో బంతి బ్యాట్ మీదికి చక్కగా వస్తున్న సమయంలో కూడా తన వికెట్ ని పారేసుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో అతడి ఆట చాలా చండాలంగా తయారైందని మండిపడుతున్నారు క్రీడాభిమానులు.
టెస్ట్ లలో మాత్రమే పరవాలేదనిపిస్తున్నాడని.. వన్డే, టి-20 లలో అట్టర్ ప్లాప్ అవుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసియా కప్ లో ఏడు మ్యాచ్ లు ఆడిన గిల్ కేవలం 123 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో కేవలం 42 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టి-20 సిరీస్ లో యశస్వి జైష్వాల్ లాంటి ఆటగాడిని జట్టులో పెట్టుకుని.. గిల్ కి అవకాశాలు ఇవ్వడం ఏంటో అర్థం కావడం లేదని అంటున్నారు క్రీడాభిమానులు. జైష్వాల్ లాంటి డైనమిక్ ఓపెనర్ ని జట్టులో పెట్టుకుని.. ప్లేయింగ్ ఎలివేన్ లో ఆడించకుండా ఉంటారా..? హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కి అసలు బుద్ధి ఉందా..? అని ప్రశ్నిస్తున్నారు.
అద్భుతమైన టాలెంట్ ఉన్న జైష్వాల్ కేవలం ఒక్క ఫార్మాట్ లో మాత్రమే ఆడుతున్నాడు. టాలెంట్ లేని గిల్ మూడు ఫార్మాట్లు ఆడుతున్నాడు. అతడు అట్టర్ ప్లాప్ అవుతున్నప్పటికీ ప్రమోషన్స్ దక్కుతూనే ఉన్నాయి. వన్డే, టెస్ట్ లకు కెప్టెన్ గా కూడా మారిపోయాడు. ఇక రేపో, మాపో టి-20 కెప్టెన్ కూడా అవుతాడు. ఇప్పటికైనా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కళ్ళు తెరిచి యశస్వి జైష్వాల్ ని ఆల్ ఫార్మాట్ ప్లేయర్ ని చేయాలని డిమాండ్ చేస్తున్నారు మాజీ క్రికెటర్స్ అలాగే క్రీడాభిమానులు.
యశస్వి జైష్వాల్ ని టీ-20 ఫార్మాట్ నుండి మినహాయించడం దారుణమని అన్నారు మాజీ క్రికెటర్ బ్రియాన్ లారా {BRIAN LARA}. ఈ విషయంలో ఘోరమైన తప్పు చేశారని అన్నారు. యశస్వి జైశ్వాల్ ఒక నిర్భయమైన టి-20 ఆటగాడని.. అతడిని పక్కన పెట్టి ఇలాగే కొనసాగితే ఒక స్టార్ క్రికెటర్ ప్రకాశించక ముందే అదృశ్యం కావడం మనం చూస్తామని వ్యాఖ్యానించాడు. అతడిని జట్టులోంచి తప్పించడం సరైన నిర్ణయం కాదని పేర్కొన్నాడు బ్రియాన్ లారా.