BigTV English
Advertisement

OTT Movie : మ్యూజిక్ తో దెయ్యాన్ని నిద్రలేపే మెంటల్ పిల్ల… ఇలాంటి హర్రర్ మూవీని ఎక్కడా చూసుండరు భయ్యా

OTT Movie : మ్యూజిక్ తో దెయ్యాన్ని నిద్రలేపే మెంటల్ పిల్ల… ఇలాంటి హర్రర్ మూవీని ఎక్కడా చూసుండరు భయ్యా

OTT Movie : హారర్ జానర్ లో ఆడియన్స్ ని భయపెట్టడానికి రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు మేకర్స్. వీటిలో కొన్ని సినిమాలు సక్సెస్ అవుతుంటాయి. మరికొన్ని ఆ స్థాయికి చేరుకోలేకపోతాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో ఫ్లూట్ వాయిస్తే దెయ్యం వస్తుంటుంది. జాన పద కథల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా భయపెట్టేదానికన్నా, స్టోరీ సస్పెన్స్ గా నడుస్తుంది. ఫ్యామిలీతో కలసి ఎంచక్కా చూసేయచ్చు. ఈ దెయ్యం స్టోరీ ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? దీని పేరు ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..


ఏ ఓటీటీలో ఉందంటే

“ది పైపర్” (The Piper) అనేది 2024లో విడుదలైన హారర్ థ్రిల్లర్ సినిమా. ఎర్లింగూర్ థోరోడ్సెన్ దర్శకత్వంలో షార్లెట్ హోప్, జూలియన్ సాండ్స్, ఆయోబ్ ఒ’ఫ్లానాగన్, ఆలివర్ సావెల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2024 మార్చి 8న థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా prime Video, Airtel Xstream Play, Apple TVలో హిందీ, తమిళం, తెలుగు ఆడియోతో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

మెలానీ అనే ఒక మ్యూజిక్ కంపోజర్, ఫ్లూట్ బాగా వాయిస్తుంది. ఆమె గురువు ఒక పెద్ద క్లాసికల్ మ్యూజిక్ కాన్సర్టో ని మొదలు పెట్టి, చివరి భాగం పూర్తి చేయకుండానే మరణించాడు. ఇప్పుడు ఆమె భర్త ర్యాన్ ఈ మ్యూజిక్ పూర్తి చేస్తే నీ కెరీర్ సూపర్ హిట్ అవుతుందని చెప్పడంతో మెలానీ ఆ షీట్లు తీసుకుని హోమ్ స్టూడియోలో ప్లే చేయడం మొదలు పెడుతుంది. మొదట సౌండ్ అందంగా వినిపిస్తుంది. కానీ రాత్రి సమయంలో ఆమెకు కలలు వస్తాయి. ఒక పాత యూరోపియన్ గ్రామంలో చిన్న పిల్లలు ఏడుస్తూ పరుగెత్తుతున్న దృశ్యాలు కనిపిస్తాయి. ఇంట్లో ఏదో షేడ్ కదులుతున్నట్లు ఉంటుంది. మెలానీ దీని గురించి రీసెర్చ్ చేస్తుంది. ఈ రీసర్చ్ లో గుస్టావ్ మ్యూజిక్ కి, ఆ పాత ఊరికి సంబంధం ఉంటుంది.


Read Also : థియేటర్లలో అట్టర్ ప్లాప్…. ఓటీటీలో తుక్కురేగ్గొడుతున్న ధనుష్ మూవీ… ఇంకా చూడలేదా ?

ఆ కథలో హామెలిన్ అనే ఊరు ఎలుకలతో నిండిపోయి ఉంటుంది. ఒక ఫ్లూట్ ప్లేయర్ వచ్చి సౌండ్‌తో ఎలుకల్ని నదిలో ముంచేస్తాడు. కానీ ఊరు అతనికి ఈ మాత్రం ఆర్థిక సాయం చేయదు. కోపం తెచ్చుకున్న పైపర్ ఫ్లూట్ ప్లే చేస్తూ పిల్లల్ని ఆకర్షించి అడవిలోకి తీసుకెళ్తాడు. ఆ తరువాత పిల్లలు ఎప్పటికీ తిరిగి రారు. ఇప్పుడు ఆ సంగీతాన్ని మెలానీ ప్లే చేస్తుంటే ఆమెకు హాలుసినేషన్స్ వస్తాయి. ఎలుకలు ఇంట్లో పరుగెత్తుతుంటాయి. చిన్న పిల్లల సహాయం చేయమని అరుస్తుంటారు. ఈ మ్యూజిక్ ప్లే చేస్తే ఒక భూతం వస్తుందని తెలుస్తుంది. కానీ మెలానీ ఆ సంగీతాన్ని పూర్తి చేసేందుకే మొగ్గు చూపుతుంది. దీంతో భూతం పూర్తిగా బయటకు వస్తుంది. చివరికి ఆ భూతం ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుంది ? మ్యూజిక్ ప్లే చేస్తే ఎందుకు వస్తుంది ? ఈ కథ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను, ఈ హారర్ సినిమాని చూసి తెలుసుకోండి.

 

Related News

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..

OTT Movie : కాంట్రవర్సీ నుంచి క్రైమ్ దాకా… ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న తమిళ సినిమాలు ఇవే

OTT Movie : కొడుకులను మార్చుకుని ఇదేం పాడు పని… ఈ డైరెక్టర్ కు మైండ్ దొబ్బిందా మావా ?

OTT Movie : ప్లే గ్రౌండ్ లో చెయ్యి లేకుండా అమ్మాయి శవం… చెస్ట్ నట్ బొమ్మతో క్లూ వదిలే సైకో కిల్లర్ కిరాతకం..

OTT Movie : దెయ్యాన్ని వదిలించడానికెళ్లి దానితోనే దబిడి దిబిడి… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు చూడకూడని హర్రర్ మూవీ

OTT Movie : మొదటి రాత్రి కాగానే చనిపోయే అమ్మాయిలు… పోలీస్ ఆఫీసర్ భార్యను కూడా వదలకుండా కిల్లర్ అరాచకం

OTT Movie : గోడ లోపల వింత శబ్దాలు… కట్ చేస్తే ఒళ్ళు జలదరించే ట్విస్ట్… ఇలాంటి పేరెంట్స్ కూడా ఉంటారా భయ్యా

Big Stories

×