E-Paper
Advertisement

Asia Cup : భారత్ దే ఆసియా కప్.. శ్రీలంక చిత్తు..

Asia Cup : భారత్ దే ఆసియా కప్.. శ్రీలంక చిత్తు..
Advertisement

Asia Cup : ఆసియాకప్ ను భారత్ కైవసం చేసుకుంది. కొలంబో వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంకను టీమిండియా చిత్తు చేసింది. 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 50 పరుగులకే కుప్పకూలింది. భారత్ పేసర్లు ఆ జట్టు బ్యాటర్లను వణికించారు. బుమ్రా తొలి వికెట్ తీసి శుభారంభాన్ని అందిస్తే.. మహ్మద్ సిరాజ్ ఒకే ఓవర్ లో 4 వికెట్లు తీసి లంకను కోలుకోలేని దెబ్బతీశాడు. చివరి 3 వికెట్లను హార్థిక్ పాండ్యా పడగొట్టాడు. దీంతో ఆ జట్టు 15.2 ఓవర్లలోనే ఆలౌట్ అయ్యింది. లంక జట్టులో ఐదుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు.

Advertisement

51 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు 6.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (23 నాటౌట్), శుభ్ మన్ గిల్ (27 నాటౌట్ ) అజేయంగా 51 పరుగులు జోడించారు. దీంతో టీమిండియా 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ 21.3 ఓవర్లలోనే ముగియడం విశేషం.

6 వికెట్లు తీసిన సిరాజ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఆసియా కప్ లో 9 వికెట్లు తీసిన కులదీప్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×