
World Cup 2023 : అయిపోయిందేదో అయిపోయింది..జరగాల్సింది చూడాలి..అని ఒక సందర్భంలో ఎక్కువగా ఈ మాటను ప్రజలు వాడుతుంటారు. వన్డే వరల్డ్ కప్ 2023లో ఆఖరి మెట్టుపై టీమ్ ఇండియా బోల్తా కొట్టింది. కర్ణుడి చావుకి కారణాలనేకం అన్నట్టు..ఓడిపోవడానికి పిచ్ దగ్గర నుంచి మొదలుపెడితే ఎన్నో ఉన్నాయి.
మొదటే టాస్ ఓడిపోవడం, అప్పటికే మ్యాక్స్ వెల్ ఓవర్ లో పది పరుగులు చేసిన రోహిత్ శర్మ వెంటనే షాట్ కి ట్రై చేయడం, యువ క్రికెటర్లు శుభ్ మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ ఒత్తిడిని అధిగమించ లేకపోవడం, కోహ్లీ, రాహుల్ పట్టాలెక్కిస్తారనుకునే టైమ్ లో కోహ్లీ అయిపోవడం, షాట్లు కొట్టే టైమ్ లో రాహుల్ అయిపోవడం, టీ 20 ప్లే చూపిస్తాడనుకుంటే సూర్య చేతులెత్తేయడం, అన్నింటికీ మించి బౌలర్లు ప్రభావం చూపించకపోవడం.. ఒంటి చేత్తో మ్యాచ్ ని గెలిపించిన షమీకి వికెట్లు రాకపోవడం ఇవన్నీ కారణాలుగానే ఉన్నాయి. మరి వీరే టోర్నమెంట్ అంతా అద్భుతాలు సృష్టించారు. కానీ ఆడాల్సిన మ్యాచ్ లో ఓటమి పాలయ్యారు.
అందరూ ఐరన్ లెగ్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో కూడా ఒక కారణమేనని సెంటిమెంట్స్ ని బలంగా నమ్మే భారతీయులు అంటున్నారు. మేం అప్పుడే అనుకున్నాం..మళ్లీ వచ్చాడని, అనుకున్నట్టే అయ్యిందని అంటున్నారు.
అంతవరకు మహ్మద్ షమీ అద్భుతంగా చేశాడు. మరి మనసులో ఏముందో తెలీదు..అతనితో విడిపోయి ఒంటరిగా ఉంటున్న షమీ భార్య హసీన్ జహాన్ మాట్లాడితే పోస్టింగులు పెట్టడం మొదలుపెట్టింది.
అతను మంచి భర్తకాదు, మంచి తండ్రి కాదు, నాకు క్రికెట్ పై ఇంట్రస్ట్ లేదు. అతను బాగుంటే మా ఇద్దరి జీవితాలు బాగుండేవని ఓ సంటడం మొదలుపెట్టింది. ఫైనల్ మ్యాచ్ ముందు కూడా అదే స్టేట్మెంట్. బహుశా అదేమైనా షమీ మీద ప్రభావం చూపించి ఉండవచ్చునని కొందరు అంటున్నారు.
కెప్టెన్ రోహిత్ శర్మ మాటల్లో చూస్తే బ్యాటర్ల వల్లే ఓడిపోయామని చెబుతున్నాడు. ఇక రకరకాల కారణాలతో ఓటమికి పలువురు పలు భాష్యాలు చెబుతున్నారు. ఏదేమైనా ఓడిపోయిన తర్వాత బాధపడుతూ కూర్చోడం కన్నా, జరగాల్సింది చూడటం ఎంతో మేలు కదా..!