Illu Illalu Pillalu Today Episode September 19th: పోలీస్ స్టేషన్ కి వెళ్లిన రెండు కుటుంబాలు పాతికేళ్ల నుంచి జరిగిన గొడవల గురించి అన్ని కలిపి కంప్లైంట్ ఇస్తూ ఉంటారు వీళ్ళ గొడవని విన్న ఎస్ఐ కూడా చాలా భయపడిపోతూ షాక్ లో ఉండిపోతాడు. అంత పెద్ద కంప్లైంట్ నా జీవితంలోని చూడలేదు అని ఎస్ఐ కూడా వాటిని చూసి భయపడిపోతాడు. అసలు ఏం జరిగింది మీరు ఎందుకు ఇలాంటి కంప్లైంట్ రాస్తున్నారు అని ఎంతగా అడుగుతున్నా సరే ఎవరు మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. అయితే పోలీస్ స్టేషన్కు వెళ్లిన విషయాన్ని నర్మదకు చెప్పగానే నర్మదా పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కు వెళుతుంది. నర్మదా అక్కడ ఉన్న వాళ్ళని అడిగి విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది.
మీ రెండు కుటుంబాలు ఇలా గొడవ పడుతూ ఉంటే కచ్చితంగా నేను అందర్నీ అరెస్ట్చేసి జైల్లో వేయాల్సి ఉంటుంది అని ఎస్ఐ చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. మీరు పోలీస్ స్టేషన్ ని పోలీసులు సమయాన్ని వృధా చేయకుండా కాంప్రమైజ్ అయ్యే ప్రయత్నం చేస్తారా లేదా అని ఎస్ఐ అనగానే వాళ్లంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. మీరు ఆగండి ఎస్ఐ గారు నేను వాళ్ళతో మాట్లాడి కాంప్రమైజ్ అయ్యేలా చేస్తాను అని అంటుంది. ఇక ఎస్సై కూడా నర్మదాన నమ్మి వీళ్లిద్దరిని కాంప్రమైజ్ చేయాల్సిన పని మీ మీదనే ఉంది. మీరు ఎలాగైనా సరే కాంప్రమైజ్ చేయించాలి ఇవన్నీ మాట్లాడకుండా రండి అని పంపిస్తాడు. ఏంటండీ ఈ రెండు కుటుంబాలు ఇంత దారుణంగా ఉన్నాయి అందులో ఎంతో కూడా భయపడిపోతాడు.
ప్రేమ ధీరజ్లని విడగొట్టాలని భద్రావతి పక్కాగా ప్లాన్ చేస్తుంది. ఎలాగైనా సరే ప్రేమని ఈ దెబ్బతో ధీరజ్ కి దూరం చేయాలి అని భద్ర ఆలోచిస్తూ ఉంటుంది. ఇదే మంచి సమయం ప్రేమని ఎలాగైనా సరే లాక్చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. మీ నాన్న నీ వాడు కొట్టాడు నిన్ను కూడా కొట్టాడు ఇంట్లో మన బంధువులు ముందర మనల్ని అవమనించడు అలాంటి వాడితో నువ్వు మళ్ళీ వెళ్తావా అని ప్రేమని రెచ్చగొట్టేలా భద్ర మాట్లాడుతుంది.. అసలు నువ్వు నాకు మాట ఇచ్చావు మర్చిపోయావా అని భద్ర ప్రేమను కావాలని రెచ్చగొట్టి ఎలా నేను శరీరం శాశ్వతంగా రామరాజు కుటుంబానికి దూరం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. వాడు మన పరువును తీసేలా చేస్తే నువ్వు ఇంకొకసారి వాడి జోలికి వెళ్ళను వాడితో మాట్లాడిన అని మాట ఇచ్చావు ఆ సంగతి నువ్వు మర్చిపోతున్నావా అని భద్ర అడుగుతుంది. వాడు మారలేదు నాకు కూడా అర్థమైంది అత్త నేనే ఒక వాడికి దూరంగా ఉంటాను అని ప్రేమ మాట ఇస్తుంది.
ఇలా ఆవేశపడితే ప్రయోజనం లేదు మావయ్య గారు.. ఎస్సై గారు చెప్పారు కదా మీరు ఏమైనా చేస్తే అందరినీ జైల్లో వేస్తాను అని.. మనము వలస కూడా పెట్టుకోకుండా కేసును వెనక్కి తీసుకుని కాంప్రమైజ్ అవుదాము అని శ్రీవల్లి అంటూ ఉంటుంది ఇక నర్మద కూడా ఏంటి మావయ్య గారు మీరే కొట్టి మీరే కేసు పెడతాను అంటే ఎలా ఉంటుంది అసలు ఎవరు ఒప్పుకోరు కూడా అని నర్మదా అంటుంది. నా కోడలికి వేరే సంబంధం కాయం చేస్తున్నారు అంటే నేను అస్సలు తట్టుకోలేకపోయాను అమ్మ అందుకే అలా ప్రవర్తించాను అని రామరాజు అంటాడు. మనవి కేసుని వెనక్కి తీసుకొని ప్రేమను మన ఇంటికి తీసుకొని వెళ్ళిపోదామని ఇక వేదవతి కూడా అనడంతో రామరాజు కేసులు వెనక్కి తీసుకోవడానికి ఒప్పుకుంటాడు..
మొత్తానికి రెండు కుటుంబాలు కేసును వెనక్కి తీసుకోవడానికి ఒప్పుకుంటాయి. అయితే లోపలికి వెళ్లి ఎస్ఐతో ఈ విషయాన్ని నేను చెప్పాలని అనుకుంటారు ఇక భద్ర వెళుతూ ఉండగా శ్రీవల్లి ఆపి ఈ కేసును వెనక్కి తీసుకోవడానికి మా మామయ్య గారిని నేనే ఒప్పించాను అని చెప్పగానే శ్రీవల్లి చంప వాయించేస్తుంది. ఎందుకు మీరు నన్ను కొట్టారు కేసుని వెనక్కి తీసుకోవడానికి నేను సాయం చేశాను అని చెప్పినా కూడా నన్ను కొడతారేంటి అని శ్రీవల్లి షాక్లో ఉండిపోతుంది.. నా తమ్ముడికి ఆ సుకన్య ఇచ్చి పెళ్లి చేయడానికి కారణం నువ్వే అందుకే నేను కొట్టాను లేకపోతే మీ వాళ్ళందరిని చంపేసే దాన్ని అని భద్ర వార్నింగ్ ఇస్తుంది దాంతో శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..