CSK – V B Chandrasekhar: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని చెన్నై సూపర్ కింగ్స్ లోకి తీసుకొచ్చాడు. సీఎస్కే జట్టు ఫేట్ మొత్తం మార్చేశాడు. కానీ చివరకు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కన్నీటి గాథ ఎవరిదో కాదు, వీ.బీ చంద్రశేఖర్ అనే గొప్ప టీమిండియా మాజీ ఆటగాడుదే. టీమిండియా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించి, ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ నిర్మించడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ చివరకు ఓ క్రికెట్ జట్టును కొనుగోలు చేసి, అప్పుల పాలయ్యాడు. అప్పుల భారం పెరిగిన తరుణంలో ఆత్మహత్య చేసుకున్నాడు ఈ వీ.బీ చంద్రశేఖర్.
ఒకప్పటికీ మాజీ క్రికెటర్ వీ బీ చంద్రశేఖర్..టీమిండియా తరఫున 7 వన్డే మ్యాచ్ లు ఆడాడు. ఈ తరుణంలోనే ఒకే ఒక అర్థ సెంచరీ చేసిన చంద్రశేఖర్ మొత్తంగా 88 పరుగులే చేశారు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్ లో అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో చంద్ర శేఖర్ కెరీర్ అర్ధరాంతరంగా ముగిసింది. కానీ డొమెస్టిక్ క్రికెట్ లో మాత్రం చంద్రశేఖర్ బాగానే ఆడాబు. 1988 ఇరానీ ట్రోఫీలో కేవలం 56 బంతులలో సెంచరీ ఫినిష్ చేసి..రికార్డ్ క్రియేట్ చేశాడు. అయితే, ఇటీవలే ఆ రికార్డును పంత్ బ్రేక్ చేశాడు.
అంతర్జాతీయ, దేశీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చీఫ్ సెలక్టర్ గా చంద్రశేఖర్ వ్యవహరించాడు. ఈ తరుణంలోనే 2008లో చెన్నై జట్టుకు మంచి పునాది వేశారు. మహేంద్ర సింగ్ ధోనికి రూ.15 కోట్లు పెట్టి, కొనేలా యాజమాన్యం ఒత్తిడి తెచ్చారు. ఫలితంగా ధోని కెప్టెన్సీలోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు 5 సార్లు ఛాంపియన్ గా నిలిచిన సంగతి తెలిసిందే. రాహుల్ ద్రావిడ్ లాంటి పెద్ద క్రికెటర్ల కెరీర్ ప్రారంభానికి దోహదపడ్డారు.
తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో భాగంగా VB కంచి వీరన్స్ అనే క్రికెట్ జట్టును కొనుగోలు చేశారు చంద్రశేఖర్. అయితే ఈ జట్టు నిర్వాహణ కోసం..బ్యాంకులు ఇతర సంస్థల నుంచి విపరీతంగా అప్పులు చేశారు. ఈ తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో ఇతర జట్లను కొనుగోలు చేసిన వాళ్లందరూ పెద్ద పెద్ద వ్యాపారస్తులు. కానీ చంద్రశేఖర్ మాత్రం క్రికెట్ బ్యాగ్రౌండ్ ఉన్నవాడు మాత్రమే. ఆయన వెనక ఆస్తులు ఏమీ లేవు. ఈ క్రమంలో తెచ్చిన అప్పులు కట్టలేని పరిస్థితి వచ్చింది. దీంతో అప్పుల బాధ భరించలేక 2019 ఆగస్టులో చెన్నైలోని తన నివాసంలోని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.