E-Paper
Advertisement

ఫ్లాట్ పిచ్ పైనే అభిషేక్ శర్మ ప్రతాపం… ఇజ్జత్ తీసిన రవిశాస్త్రి

ఫ్లాట్ పిచ్ పైనే అభిషేక్ శర్మ ప్రతాపం… ఇజ్జత్ తీసిన రవిశాస్త్రి
Advertisement

Ravi shastri Reaction Abhishek Sharma Century: ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమిండియా మధ్య జరిగిన చిట్ట చివరి టీ20లో అభిషేక్ శర్మ ఇరగదీశాడు. 300లకు పైగా స్టైక్ రేట్‌తో కేవలం 30 బంతుల్లోనే సెంచరీ ఫినిష్ చేసేశాడు. ఈ క్రమంలో పలు రికార్డులు బద్దలు కొట్టాడు. అలాంటి అభిషేక్ శర్మపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తుంటే, భారత మాజీ కోచ్ రవిశాస్త్రి మాత్రం పెదవి విరిచారు. ఫ్లాట్ పిచ్‌లపై మాత్రమే ఇలా సెంచరీలు చేసి, అభిషేక్ ఇరగదీస్తాడని సెటైర్లు పేల్చారు. ఫ్లాట్ పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలించిన సమయాల్లోనే మెరుపులు మెరిపిస్తాడని పరువు తీశారు. అదే విదేశీ ట్రాక్స్‌పై మాత్రం మనోడు, తోక ముడుస్తాడంటూ హేళన చేశారు రవిశాస్త్రి. ఇలాంటి క్రికెటర్లతో వరల్డ్ కప్ గెలవలేమంటూ షాకింగ్ స్టేట్‌మెంట్ చేశారు.

అభిషేక్ శర్మ కంటే సంజు శాంసన్ బెటర్.. రవిశాస్త్రి సంచలనం

గురువారం సెంచరీ చేసి ఇరగదీసిన అభిషేక్ శర్మ కంటే, సంజు శాంసన్ బెటర్ అంటూ రవిశాస్త్రి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అభిషేక్ సెంచరీ చేసినప్పటికీ, కీలక సమయాల్లో టీమిండియాను అతడు ఆదుకున్న సందర్భాలు చాలా తక్కువే అన్నారు. టీ20 వరల్డ్ కప్ 2026 సమయంలో అభిషేక్ శర్మ పేలవమైన ప్రదర్శన కనబరిచిన అంశాన్ని గుర్తు చేశారు. ఆ సమయంలో టీమిండియాను ఆదుకున్న రియల్ హీరో సంజు శాంసన్ అంటూ ప్రశంసలు కురిపించారు. చివరి మూడు మ్యాచ్‌ల్లో సంజు కీలక ఇన్నింగ్స్ ఆడి, టీమిండియాను ఛాంపియన్‌గా నిలబెట్టాడంటూ వెల్లడించారు. అలాంటి సంజు శాంసన్‌కు అసలు టీమిండియాలో సరైన అవకాశాలు రావడం లేదంటూ విమర్శలు చేశారు.

Advertisement

Why was Vande Mataram played ahead of India vs Afghanistan 1st T20I: అదరగొట్టిన టీమిండియా..తొలి టీ20 ఆఫ్ఘనిస్తాన్ ఓటమి..తెరపైకి వందేమాతరం వివాదం !

వైభవ్ కోసం సంజు శాంసన్‌ను బలి చేస్తారా ?

టీ20 సిరీస్‌లలో సంజు శాంసన్ కంటే ఎక్కువగా వైభవ్ సూర్యవంశీ లాంటి అనుభవం లేని ఆటగాడికి టీమిండియా యాజమాన్యం అవకాశం ఇస్తోందని రవిశాస్త్రి సీరియస్ అయ్యారు. అభిషేక్ చాలా సార్లు విఫలైనప్పటికీ పట్టించుకోని యాజమాన్యం, సంజు ఒక్కసారి డకౌటైతే మాత్రం పక్కకు పెట్టేస్తున్నారని విమర్శలు చేసారు. సంజును కాదని, అభిషేక్‌తో వైభవ్‌ను దింపుతున్నారని ఫైర్ అయ్యారు. ఓపెనింగ్ కాంబో ఎప్పుడైనా.. లెఫ్ట్ అండ్ రైట్‌గా ఉండాలని సూచనలు చేశారు. ఇప్పటికైనా సంజుకు ఎక్కువ అవకాశాలు ఇవ్వలన్నారు. అతడు మ్యాచ్ విన్నర్ అన్న విషయాన్ని మర్చిపోవద్దంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

అభిషేక్ శర్మ పేరిట పలు రికార్డులు

Advertisement

30 బంతుల్లోనే సెంచరీ నమోదు చేసుకున్న అభిషేక్ శర్మ పేరిట పలు రికార్డులు నమోదు అయ్యాయి. టీ20లలో టీమిండియా తరఫున వేగంగా సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ రికార్డ్ కూడా బద్దలు కొట్టాడు. గతంలో 35 బంతుల్లోనే రోహిత్ శర్మ సెంచరీ చేయగా, అభిషేక్ శర్మ ఆ రికార్డ్ బ్రేక్ చేశాడు. అలాగే టెస్ట్ హోదా కలిగిన జట్లలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్ గా హిస్టరీ క్రియేట్ చేశాడు. ఈ క్రమంలో నిన్నటి నుంచి అభిషేక్ శర్మ పేరు సోషల్ మీడియాలో మారు మోగుతోంది.

Womens Asia Cup 2026 Finals IND VS SL: శ్రీలంక ఓటమి..8వ సారి ఆసియాకప్ ఛాంపియన్​గా టీమిండియా, ప్రైజ్ మనీ ఎంత అంటే

Related News

CSKతో పాటు ధోని కెరీర్ మార్చేశాడు..కానీ చివరకు అప్పుల బాధతో ఆత్మహ*త్య చేసుకున్నాడు

హార్దిక్ పాండ్యా 10 ఓవర్లు వేయలేడు…బాంబ్ పేల్చిన గంభీర్

బ‌ల‌హీన‌మైన ఆఫ్ఘనిస్తాన్ పై గెలిచి హీరోలుగా బిల్డ‌ప్ ఇస్తున్నారు

మాకు షేక్ హ్యాండ్ ఇవ్వ‌డం చేత‌కాదు, కానీ ఆఫ్ఘానిస్తాన్ కెప్టెన్ తో సంసార‌మే మొద‌లు పెట్టారు

అందుకే నా కొడుకు ఓం నమః శివాయ సెల‌బ్రేష‌న్స్ చేశాడు..అభిషేక్ శర్మ తండ్రి సంచ‌ల‌నం

వైభ‌వ్ సూర్య‌వంశీ మ‌గాడు కాదు, వాడు తేడా అంటూ ట్రోల్స్‌..!

అస‌లు అభిషేక్ శ‌ర్మకు సిగ్గుందా.. మైదానంలో హిందూ మ‌తాన్ని ప్ర‌చారం చేస్తారా ?

Big Stories

Advertisement
×