E-Paper
Advertisement

పదేళ్ల డేటా.. రోజూ ఒక లీక్.. బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ సరికొత్త పొలిటికల్ అస్త్రం!

పదేళ్ల డేటా.. రోజూ ఒక లీక్.. బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ సరికొత్త పొలిటికల్ అస్త్రం!
Advertisement

Congress Strategy: రాష్ట్రంలోని ప్రతిపక్షాన్ని మానసికంగా, రాజకీయంగా ఒత్తిడికి గురిచేసేలా అధికార కాంగ్రెస్ పార్టీ కొత్త వ్యూహాన్ని అమలు చేయనున్నది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలు, చోటుచేసుకున్న నిర్ణయాలు, చేసిన నిర్లక్ష్యం, తప్పిదాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తూ బీఆర్ఎస్ పార్టీని నిరంతరం డిఫెన్స్ లో పడేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనిలో భాగంగానే గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు, అక్రమాలు, నిధుల వినియోగంలో చోటుచేసుకున్న వ్యత్యాసాలను ఒకేసారి కాకుండా.. రోజూ ఒక అంశాన్ని తెరపైకి తెచ్చేలా వ్యూహం రచించారు.

రాబోయే ఎన్నికల వరకు ‘డైలీ సీరియల్’ మాదిరిగా వరుసపెట్టి లీకులు ఇవ్వడం, విచారణలు జరిపించడం ద్వారా బీఆర్ఎస్ పార్టీని ఎల్లప్పుడూ ఆత్మరక్షణలో పడేయాలనేది సీఎం రేవంత్ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ప్రతిపక్షాన్ని పూర్తిగా రాజకీయం చుట్టూనే తిప్పేలా సీఎం ఒక చక్రవ్యూహాన్ని సిద్ధం చేశారు. బీఆర్ఎస్ నాయకులు క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా, కేవలం ప్రభుత్వ ఆరోపణలకు సమాధానాలు చెప్పుకోవడానికే సమయం సరిపోయేలా హస్తం పార్టీ తన స్ట్రాటజీని అమలు చేయనున్నది.

Advertisement

ప్రజా క్షేత్రంలోకి వెళ్లే తీరిక లేకుండా, రోజూ ప్రెస్ మీట్లు పెట్టడం, పొలిటికల్ కౌంటర్లు ఇవ్వడానికే వారిని పరిమితం చేయాలనేది కాంగ్రెస్ ప్లాన్. ప్రస్తుతం కేసీఆర్ ఫామ్ హౌజ్ ఎపిసోడ్ లో ఇదే జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఈమేరకు ఈ వ్యూహాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలక బృందానికి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. గత పదేళ్ల డేటాను సేకరించడం, లీగల్ అంశాలను పరిశీలించడం ,మీడియా ముందు ఏ అంశాన్ని ఎప్పుడు ఉంచాలో నిర్ణయించే బాధ్యతలను ఈ టీమ్ పర్యవేక్షిస్తోంది.ప్రజా పాలనలపై ప్రజలకు వ్యతిరేకత రాకుండా బీఆర్ఎస్ నేతలు ప్రజా ఉద్యమాలు నిర్మించకుండా,నిరంతరం డిఫెన్సివ్ పాలిటిక్స్ చేసేలా కాంగ్రెస్ ఈ వ్యూహం పన్నినట్లు తెలుస్తుంది.

2023 లో కాంగ్రెస్ అధికారం చేపట్టిన ఏడాదిన్నర వరకు బీఆర్ ఎస్ తన వ్యూహాలతో అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ తర్వాత నెమ్మదిగా సీఎం తన పొలిటికల్ స్ట్రాటజీలను అమలు చేస్తూ వచ్చారు. సందర్భాన్ని బట్టి ఎప్పటికప్పుడు తన వ్యూహాలను మార్చుతూ ముందుకు సాగారు. తాజా అసెంబ్లీ సమావేశాల నుంచి బీఆర్ ఎస్ పై సీఎం ఎటాక్ కు దిగారు. ప్రతీ అంశంలో ఎదురుదాడి చేస్తూ తానే పై చేయి సాధించేలా అస్త్రాలను ప్రయోగించారు.

Advertisement

ప్రస్తుతం బీఆర్ ఎస్ పార్టీ అధికార పార్టీ చేసే ఆరోపణల నుంచి ఢిఫెన్స్ లో పడే స్థాయికి వచ్చింది. మరో రెండేళ్ల తర్వాత జరిగే ఎన్నికల వరకు ఇదే లైన్ లో ముందుకు సాగాలని సీఎం తన పార్టీ ముఖ్య నేతలకూ సూచించినట్లు సమాచారం. ఇప్పటి వరకు కాంగ్రెస్ పాలించిన వెయ్యి రోజుల పాలనపై ప్రజల్లో చర్చకు తావులేకుండా పొలిటికల్ స్ట్రాటజీలను ఎప్పటికప్పుడు ఛేంజ్ చేయాల్సిన అవసరం ఉన్నదని సీఎం మంత్రులకూ సూచించినట్లు తెలిసింది.

ఈ వ్యూహాలపై ప్రజల్లో జరుగుతున్న చర్చ, పార్టీ, ప్రభుత్వానికి వస్తున్న మైలేజ్ ను ఎప్పటికప్పుడు పసిగట్టాలని సీఎం మంత్లీ రిపోర్టులు సేకరించనున్నారు. ఇంటిలిజెన్స్ సర్వేలతో పాటు ప్రైవేట్ సంస్థల సర్వేలను కూడా పరిగణలోకి తీసుకోనున్నారు. ఈ రెండున్నర ఏళ్ల పాటు బీఆర్ ఎస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తేనే, పదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఉండొచ్చన అభిప్రాయం సీఎంలో ఉన్నది. దీనిలో భాగంగానే ప్రధానంగా ఆర్థిక అవకతవకలు, వివాదాస్పద ప్రాజెక్టుల ఫైళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా బయటకు తీయనున్నది.

Also Read: Intinti Ramayanam Today Episode: తాగొచ్చి రచ్చ చేసిన కమల్.. పార్వతికి అనుమానం..పల్లవి మాస్టర్ ప్లాన్..

అంతేగాక పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు, ధరణి పోర్టల్ లోపాలు, భూ కేటాయింపు వివాదాలు, ప్రతిపక్ష నేతల ఆస్తులు, వివాదాలు, తప్పిదాలు, కేసులు వివరాలన్నీ పబ్లిక్ లో ఉంచాలని ప్లాన్ చేశారు. బీఆర్ఎస్‌కు జనాదరణ పెరగకుండా చూసేందుకు వారి దృష్టిని నిరంతరం ఆరోపణల వైపే మళ్లించేందుకు కాంగ్రెస్ కీలక స్ట్రాటజీని ఫాలో కానున్నది.

Also Read: అనకాపల్లి జిల్లాలో విషాదం.. వేర్వేరు ఘటనల్లో రెండు ప్రేమజంటల ఆత్మహత్య!

Tags

Related News

ఖైరతాబాద్‌ బైపోల్‌పై కమలం కన్ను.. జెండా పాతేందుకు బీజేపీ పక్కా స్కెచ్!

జనం చెవిలో నాడు పునరేకీకరణ పువ్వు! అదే బాటలో పయనించి నేడు కాంగ్రెస్‌ బొక్క బోర్లా..!

ఆస్తులు విశాలం.. భవంతులు సువిశాలం.. మనసులే ఇరుకిరుకు..!

శ్రీమంతుడు మా బాపు.. నడిమంతరపు సిరి నీది.. ఎప్పటికైనా సిరి సంపదలు మావి.. మా జాతే …!

టీఆర్‌ఎస్‌ పార్టీ పెట్టిన కొత్తలో విపరీతమైన పేదరికంలో కేసీఆర్.. అప్పుడు పది రూపాయల మిత్తీకి బాకీలు ఎందుకు చేసినట్టు..?

అన్ని విచారణలు ఓ లెక్క.. ఫామ్ హౌజ్ భూముల లెక్కలు ఓ లెక్క.. నిగ్గుతేల్చాల్సిందే..! లేకపోతే……

ఆయనో భూస్వామి..నువ్వో పెయింటర్‌.. రా భూముల లెక్కలు తేల్చుకుందాం..! కేటీఆర్‌ వీరావేశం..

Big Stories

Advertisement
×