E-Paper
Advertisement

Indian Women Blind Team: రోహిత్ శ‌ర్మను కాపీ కొట్టిన‌ అంధుల టీమిండియా..వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌కు ఫ్రైజ్ మనీ ఎంతంటే

Indian Women Blind Team: రోహిత్ శ‌ర్మను కాపీ కొట్టిన‌ అంధుల టీమిండియా..వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌కు ఫ్రైజ్ మనీ ఎంతంటే
Advertisement

Indian Women Blind Team: 2025 సంవత్సరం టీమిండియా జట్టుకు బాగా కలిసి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఛాంపియన్ ట్రోఫీ 2025 ట్రోఫీని టీమిండియా పురుషుల జట్టు అందుకోగా, మొన్న వన్డే వరల్డ్ కప్ ను మహిళల టీమిండియా దక్కించుకుంది. ఇక తాజాగా టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో విజయం సాధించిన టీమిండియా అందులో మహిళల క్రికెట్ జట్టు… తొలిసారి ఛాంపియన్ గా నిలిచింది. దీంతో 2025 సంవత్సరం టీమిండియా జట్టుకు బాగా అచ్చి వచ్చినట్లు చెబుతున్నారు.

Also Read: Aus vs Eng Ashes 2025-26 : సెంచరీతో రెచ్చిపోయిన హెడ్.. మొదటి టెస్ట్ లో ఆస్ట్రేలియా విజయం.. 2 రోజుల్లోనే మ్యాచ్ ఫినిష్

నేపాల్ పై గెలిచి, ఛాంపియన్ అయిన టీమిండియా

Advertisement

అంధుల టీ20 వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ఇవాల్టి వరకు చాలా రసవత్తరంగా కొనసాగింది. అయితే ఈ టోర్నమెంట్ లో ఫైనల్ దాకా టీమిండియా అంధుల జట్టు వెళ్లింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో నేపాల్ పై పోటీ పడింది టీం ఇండియా. ఈ మ్యాచ్ లో నేపాల్ లాంటి బలమైన జట్టుపై ఏకంగా ఏడు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది అంధుల‌ టీమిండియా. ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన అంధుల నేపాల్ నిర్ణీత 20 ఓవర్స్ లో ఐదు వికెట్లు నష్టపోయి 114 పరుగులు మాత్రమే చేసింది. అయితే ఈ లక్ష్యాన్ని ఛేదించ‌డంతో టీమిండియా చాలా ఫాస్ట్ గా ఆడేసింది. దీంతో 12.1 ఓవర్స్ లో మూడు వికెట్లు నష్టపోయిన టీమిండియా.. విజయ కేతనం ఎగరవేసింది.

ఈ మ్యాచ్ గెలిచిన నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ విజేతగా టీమిండియా నిలిచింది. దీంతో దేశ వ్యాప్తంగా మహిళల అంధుల‌ క్రికెట్ జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు కూడా టీమిండియా అంధుల‌ జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే టైటిల్ గెలిచిన తర్వాత లియోనెల్ మెస్సి త‌ర‌హాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వాకింగ్ ను కాపీ కొట్టారు. టి20 వరల్డ్ కప్ 2024 సమయంలో టైటిల్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ స్లో మూమెంట్ లో వాకింగ్ చేస్తూ, టైటిల్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక లేటెస్ట్ గా టీమిండియా కెప్టెన్ దీపిక టిసి కూడా అలాగే నడుచుకుంటూ వచ్చి టైటిల్ అందుకుంది. దీనికి సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు వైరల్ గా మారాయి. కాగా గ‌తంలో లియోనెల్ మెస్సి ఇలాగే వాకింగ్ చేస్తూ 2022 ఫిఫా ప్రపంచ కప్ అందుకున్నాడు. అప్ప‌టి నుంచి అంద‌రూ దీన్నే ఫాలో అవుతున్నారు.

Advertisement

Also Read: T20 World Cup 2026: ఆ రోజునే పాకిస్తాన్ వ‌ర్సెస్ ఇండియా మ‌ధ్య మ‌రోసారి మ్యాచ్‌… ఏ గ్రూపులో ఏ జట్లు ఉంటాయంటే?

టీమిండియా ఫ్రైజ్ మనీ ఎంతంటే ?

టి20 వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ గెలుచుకున్న అంధుల‌ మహిళల క్రికెట్ జట్టుకు భారీగా ప్రైజ్ మనీ అందం ఉంది. ఈ టైటిల్ గెలిచినందుకుగాను రూ. 25 లక్షల ప్రైజ్ మనీ టీమిండియా అందుకోబోతోంది. అలాగే పది లక్షల విలువైన గోల్డ్ మెడల్ కూడా టీమ్ ఇండియాకు దక్కనుంది.

 

 

Related News

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

Big Stories

Advertisement
×