BigTV English

Indian Womens Cricket Team: ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్‌కు హెడ్ కోచ్ ఫైనల్..

Indian Womens Cricket Team: ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్‌కు హెడ్ కోచ్ ఫైనల్..

Indian Womens Cricket Team: క్రికెట్ అనేది కేవలం ఒక ఆట కాదు.. ఫ్యాన్స్‌కు అది ఒక ఎమోషన్ లాంటిది అని అంటుంటారు. కానీ ఇప్పటికీ మెన్ క్రికెట్ టీమ్‌కు, ఉమెన్ క్రికెట్ టీమ్‌కు వ్యత్యాసం చూపిస్తుంటారు. మెన్ టీమ్‌కు అందింనన్ని టోర్నమెంట్లు.. ఉమెన్ క్రికెట్ టీమ్‌కు దక్కవు. అందుకే ఉమెన్ క్రికెట్ టీమ్‌ను కూడా బలంగా మార్చి, వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపి ముందుకు తీసుకెళ్లడానికి ఒక కొత్త కోచ్‌ను నియమించాలని సీఏసీ నిర్ణయించుకుంది. ఈ సందర్భంగా ఒక క్రికెటర్ పేరు కూడా బయటికొచ్చింది.


అమోల్ మజుమ్దార్.. త్వరలోనే ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్‌కు హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడంటూ వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా ఈ హెడ్ కోచ్ స్థానం కోసం పలువురు షార్ట్‌లిస్ట్ చేసిన ప్లేయర్స్‌ను క్రికెట్ అడ్వైసరీ కమిటీ (సీఏసీ) ఇంటర్వ్యూ చేసింది. అందులో మజుమ్దార్ ఇచ్చిన 90 నిమిషాల ప్రెజెంటేషన్ సీఏసీ ఇంటర్వ్యూ పానెల్‌లో ఉన్న అషోక్ మల్హోత్రా, జతిన్ పరాంజె, సులక్షణ నాయక్‌కు విపరీతంగా నచ్చిందని టాక్ వినిపిస్తోంది. దాదాపుగా తనే టీమ్ హెడ్ కోచ్ అని ఫైనల్ అయ్యిందని సమాచారం.

టీమిండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్ హెడ్ కోచ్ స్థానం కోసం జోన్ ల్యూయిస్, తుషార్ అరోథే వంటి వారు కూడా పోటీలో ఉన్నారు. గతేడాది డిసెంబర్‌లో రమేశ్ పవార్.. ఉమెన్ క్రికెట్ టీమ్ హెడ్ కోచ్‌గా తప్పుకున్నారు. అప్పటినుండి టీమ్.. కోచ్ లేకుండానే తమ ప్రయాణాన్ని సాగిస్తోంది. ఇక త్వరలోనే ఉమెన్ టీమ్.. బంగ్లదేశ్ టూర్‌కు సిద్ధం కానుంది. ఆలోపు టీమ్‌కు హెడ్ కోచ్‌ను ఫైనల్ చేయాలని సీఏసీ నిర్ణయించుకుంది. అందుకే ఇంటర్వ్యూలను నిర్వహించింది. ఉమెన్ క్రికెట్ టీమ్‌ను గైడ్ చేసే విషయంలో మజుమ్దార్ చాలా క్లియర్‌గా ఉన్నాడని, ప్రెజెంటేషన్ బాగా ఇచ్చాడని బీసీసీఐ అధికారులు ప్రశంసించారు.


మజుమ్దార్ ఇంతకు ముందు ముంబాయ్ రాంజీ టీమ్‌కు కోచ్‌గా వ్యవహరించాడు. అంతే కాకుండా ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు కూడా తన సహాయ సహకారాలు అందించాడు. ఒకవేళ మజుమ్దార్ ఇప్పుడు ఉమెన్ టీమ్‌కు కోచ్‌గా సెలక్ట్ అయితే ముందుగా బంగ్లాదేశ్ టోర్నీతో తన డెబ్యూ చేయవలసి ఉంటుంది. గత అయిదేళ్లుగా ఉమెన్ టీమ్.. పెద్ద టోర్నమెంట్లు ఏది గెలవలేకపోయింది. అందుకే ఇప్పుడు వరల్డ్ కప్‌పై తన దృష్టిని పెట్టింది. అందుకే మజుమ్దార్‌పై కోచ్‌పై చాలా ప్రెజర్ ఉంటుంది. త్వరలోనే రెండేళ్ల కాంట్రాక్ట్‌ను సైన్ చేసి.. మజుమ్దార్ టీమిండియా ఉమెన్ క్రికెట్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×