E-Paper
Advertisement

T20 World Cup Selection: ప్రపంచకప్‌‌కు ఎవరెవరు? ఆటగాళ్లలో టెన్షన్, కాకపోతే..

T20 World Cup Selection: ప్రపంచకప్‌‌కు ఎవరెవరు? ఆటగాళ్లలో టెన్షన్, కాకపోతే..

T20 World Cup Selection: నెలల రోజుల్లో టీ20 ప్రపంచకప్ మొదలుకానుంది. అందులో ఆడే దేశాలు చాలావరకు తమ తమ జట్లను ప్రకటించాయి. కాకపోతే నాలుగైదు టీమ్ తమ ఆటగాళ్లను ప్రకటించాల్సి ఉంది. అందులో ఒకటి టీమిండియా. అయితే ఆటగాళ్ల ఎంపిక సెలక్షన్ కమిటీ కత్తి మీద సాముగా మారింది. ఎవరిని తీసుకోవాలా అనేదానిపై తర్జనభర్జన పడుతోంది. ఫలానా వ్యక్తి పర్వాలేదని చెప్పలేకపోతోంది.

ఇందులోభాగంగా అహ్మదాబాద్ వేదికగా జట్టు సెలక్షన్ కమిటీ కాసేపట్లో సమావేశం కానుంది. ఇందులో సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్, కోచ్ రాహుల్ ద్రావిద్‌తోపాటు పలువురు సభ్యులు హాజరవు తున్నారు. కెప్టెన్ రోహిత్‌శర్మ తన ఒపీనియన్ ముందుగానే చెప్పినట్టు తెలుస్తోంది. ఐపీఎల్ ప్రదర్శనను పక్కనపెట్టి ఆటగాళ్లను ఎంపిక చేయాలని భావిస్తోంది.

ఎందుకంటే మ్యాచ్‌లు వెస్టిండీస్, అమెరికాలు జరగనున్న నేపథ్యంలో ఆల్‌రౌండర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది. ఈ విషయమై ఆదివారం అగార్కర్, కోచ్ ద్రావిడ్, కెప్టెన్‌తో దాదాపు రెండుగంటల పాటు చర్చించినట్టు తెలుస్తోంది. కాకపోతే ఇప్పటికే కొందరి పేర్లతో కూడిన జాబితాను రెడీ చేశారు. ఇవాళ్టి సమావేశంలో ఫైనల్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు.

ALSO READ: వచ్చేవాళ్లెవరు? వెళ్లేవాళ్లెవరు? టీ 20 వరల్డ్ కప్ టీమ్.. రేపే ప్రకటన?

వికెట్ కీపర్, ఆల్‌రౌండర్ల విషయంలో కమిటీ పెద్ద సవాల్ ఎదురుకానుంది. కెఎల్ రాహుల్, పంత్, సంజుశాంసన్ మధ్య గట్టి పోటీ ఉంది. ఇక ఓపెనింగ్ విషయంలో చాలా మంది ఈ జాబితాలో ఉన్నారు. రోహిత్‌తోపాటు ఓపెనర్‌గా జైస్వాల్, శుభమన్ గిల్, శివమ్ దూబె లేదా రింకూ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. మరి వీరిలో ఎవరికి స్థానం కల్పిస్తారో చూడాలి. ఈ టోర్నీ కోసం మే 21న టీమిండియా యూఎస్‌ లేదా వెస్టిండీస్‌కు బయలుదేరనుంది.

Tags

Related News

బుమ్రా బౌలింగ్ లో ఆడ‌టం నా వ‌ల్ల కాదు..పాకిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

Liam Livingstone: ఐపీఎల్ ప‌ర‌మ బోరింగ్ లీగ్..ప‌రువు తీసిన‌ SRH ప్లేయర్‌

Shreyas Iyer: వివాదంలో శ్రేయస్ అయ్య‌ర్‌…అంపైర్ పై దాడికి య‌త్నం !

బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి !

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

Big Stories

×