E-Paper
Advertisement

Nag Ashwin on ‘Kalki 2898AD’: ఇసుకను చూసి కాపీ అంటున్నారా..? నాగ్ అశ్విన్ కౌంటర్

Nag Ashwin on ‘Kalki 2898AD’: ఇసుకను చూసి కాపీ అంటున్నారా..? నాగ్ అశ్విన్ కౌంటర్
Advertisement

Nag Ashwin Reacts on Kalki 2898AD Copy Trolls: సోషల్ మీడియా ఎక్కువ అయ్యాకా.. సినిమాలకు కాపీలు ఎక్కువ అయ్యాయి. సాంగ్, మ్యూజిక్, పోస్టర్, ట్రైలర్, లుక్.. ఇలా ఏదైనా కొంచెం ఒకేలా ఉన్నా కూడా ఆ సినిమా నుంచి లేపేశారు.. ఈ సినిమా నుంచి కొట్టేశారు.. హాలీవుడ్ సినిమాకు రీమేక్ అంటూ చెప్పుకొచ్చేస్తున్నారు. దీనివలన సినిమాపై ఉన్న హైప్ మొత్తం ఒక్కసారిగా నీరుగారిపోతుంది. తాజాగా కల్కి విషయంలో కూడా అదే జరిగింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కల్కి 2898AD. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

జూన్ 27 న ఈ చిత్రం రిలీజ్ కానుందని మేకర్స్ ఈ మధ్యనే ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్ ను చూసిన కొంతమంది హాలీవుడ్ వెబ్ సిరీస్ డ్యూన్ ను గుర్తుచేస్తుందని, అక్కడ నుంచే ఈ సినిమాను కాపీ కొట్టారని ప్రచారం చేయడం మొదలుపెట్టారు.

Advertisement

అయితే నెటిజన్స్ అలా అనుకోవడానికి కూడా కారణం లేకపోలేదు. డ్యూన్ లో కొత్త ప్రపంచాన్ని సృష్టించినట్టే.. కల్కి లో కూడా ఒక సరికొత్త ప్రపంచాన్ని సృష్టించారు. అందులో ఉన్న క్యారెక్టర్స్ లుక్స్ కూడా కల్కి క్యారెక్టర్స్ కు మ్యాచ్ కావడంతో కాపీ కొడుతున్నారు అనే అనుకున్నారు.

Also Read: Kalki 2898 AD: ఐపీఎల్ కోసం ‘కల్కి’ నుంచి భైరవ.. నెక్ట్స్ లెవెల్‌లో ప్రభాస్

Advertisement

ఇక తాజాగా ఈ కాపీ ఆరోపణలపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పందించాడు. ” కేవలం ఇసుక ఉండడం వలన రెండు సినిమాలు ఒకటే అని అనుకోని ఉండవచ్చు. ఇప్పుడే కాదు గతంలో కూడా నా సినిమాలను కాపీ కొట్టారని ట్రోల్ చేశారు ” అంటూ నవ్వుతూనే కౌంటర్ వేశాడు. అంటే సినిమా రిలీజ్ అయ్యాక ఇదే విషయం చెప్పండి అని ఇన్ డైరెక్ట్ గా సెటైర్ వేశాడు. డైరెక్టర్ ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పడంతో ఈ కాపీ ఆరోపణలను నెటిజన్స్ సైతం కొట్టిపారేస్తున్నారు. మరి ఈ సినిమాతో నాగ్ అశ్విన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×