Big Stories

India T20 World Cup squad: వచ్చేవాళ్లెవరు? వెళ్లేవాళ్లెవరు?

India T20 World Cup Squad Announcement: అందరూ అనుకుంటున్నట్టు ఆ 11 మంది మాత్రం టీ 20 వరల్డ్ కప్ జట్టులో లేరని అంటున్నారు. అంతా యువరక్తంతో, కొత్త ఆటగాళ్లతో ఒక టీ 20 యువ జట్టుని టీమ్ ఇండియాకి ఎంపిక చేయనుందనే వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.

- Advertisement -

2023 వన్డే వరల్డ్ కప్ లో ఆడిన జట్టే, పొట్టి ప్రపంచకప్ లో కూడా ఆడుతుందని అంతా అనుకున్నారు. కానీ వారిలో నలుగురైదుగురు మినహా ఎవరూ కనిపించడం లేదు. ఎందుకంటే టీ 20 ఫార్మాట్ ప్రకారం ప్రస్తుతం కుర్రాళ్లు పలువురు ఇరగదీస్తున్నారు.

- Advertisement -

వారిలో చెన్నయ్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దుబె, వెంకటేశ్ అయ్యర్, పంజాబ్ కింగ్స్ ఆటగాడు శశాంక్ సింగ్ ఇలా పలువురు ఉన్నారు. వీరికి దారులు తెరుచుకోనున్నాయని అంటున్నారు.

రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, జస్ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్ వీళ్ల పేర్లు ఆల్రడీ ఫిక్స్ అయిపోయినట్టు చెబుతున్నారు.

ఇక ఫాస్ట్ బౌలర్స్ ఎంపిక చేయాల్సి ఉంది. ఆల్రడీ బుమ్రాకి సపోర్ట్ గా సిరాజ్, అర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్, ముఖేష్ కుమార్ వీరందరూ రెడీగా ఉన్నారు.

Also Read: టీ 20 వరల్డ్ కప్ నుంచి.. హార్దిక్ అవుట్?

ఇక ఆల్ రౌండర్లుగా అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా వీరి పేర్లు వినిపిస్తున్నాయి.

ఒకవైపు ఐపీఎల్ జరుగుతుండగానే భారత సెలక్షన్ కమిటీ, హెడ్‌కోచ్‌లు సమావేశమై దీనిపై చర్చినట్లు తెలుస్తోంది. దీంతో ఏప్రిల్ 29లోపే భారత జట్టును ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ కొందరు బాగా ఆడుతున్నవారి పేర్లను తప్పిస్తే, వారి కెరీర్ ప్రమాదంలో పడుతుందని భావిస్తున్నారు. ఆల్రడీ న్యూజిలాండ్ తన టీమ్ ని ప్రకటించింది.

ముఖ్యంగా హార్దిక్ పాండ్యా, రెండో ప్రాధాన్య వికెట్ కీపర్ ఎంపికపై ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నట్లు సమాచారం.

లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్, అలాగే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై నిర్ణయానికి రాలేకపోతున్నట్టు తెలిసింది. శాంసన్ 9 మ్యాచ్ ల్లో 161 స్ట్రయిక్ రేట్ తో 385 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ కూడా 9 మ్యాచ్ ల్లో 144 స్ట్రయిక్ రేట్ తో 378 పరుగులు చేశాడు. ఇద్దరూ దెబ్బా దెబ్బాగా ఉన్నారు.

హార్దిక్ పాండ్యా విషయానికి వస్తే ఆల్ రౌండర్ గా సత్తా చాటలేకపోతున్నాడు. అటు బ్యాటర్, ఇటు బౌలర్ గా విఫలమవుతున్నాడు. ఇది బీసీసీఐని కలవరపాటుకు గురిచేస్తోంది. 9 మ్యాచ్ లు ఆడి కేవలం 197 పరుగులు మాత్రమే చేశాడు. 4 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఈ నేపథ్యంలోనే జట్టు ప్రకటన ఆలస్యమవుతోందని తెలుస్తోంది. నేడు అహ్మదాబాద్‌లో జరిగే సమావేశంలోనూ ఈ రెండు అంశాలపైనే ప్రధానంగా చర్చ జరగనున్నట్లు సమాచారం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News