BigTV English

Mumbai Indians Celebrated ESA Day: మానవత్వం చాటుకుంటున్న ముంబై ఇండియన్స్.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

Mumbai Indians Celebrated ESA Day: మానవత్వం చాటుకుంటున్న ముంబై ఇండియన్స్.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!
Mumbai Indians
Mumbai Indians

IPL 2024 Mumbai Indians to Celebrated ESA Day on April 7: ముంబై ఇండియన్స్ వరుస ఓటములతో తల్లడిల్లుతోంది. జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉంది. మేనేజ్మెంట్ కూడా ఏం చేయాలో తెలీక తల పట్టుకుంటోంది. ప్రశాంతంగా ఉన్న నీటిలో రాయి వేసినట్టు హార్దిక్ పాండ్యాని తెచ్చి.. మొత్తం డిస్టర్బ్ చేశామేమోనని ఆందోళన చెందుతోంది.


ఏదేమైనా, ఏదెలా ఉన్నా, ముంబై ఇండియన్స్ జట్టు మంచి మనసును చాటుకుంటోంది. నేడు ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగే మ్యాచ్ లో ఒక గొప్ప విశేషం జరగనుంది. అదేమిటంటే  2010 నుంచి రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముంబైలో ఎన్జీవో హోమ్స్ లో ఉన్న 20వేల మంది వెనకబడిన పిల్లలకు క్రీడలు, విద్య రంగాల్లో సపోర్ట్ చేస్తూ.. వారిని ప్రోత్సహిస్తోంది.

అందులో భాగంగా ప్రతీ ఐపీఎల్ సీజన్ లో ముంబై హోం గ్రౌండ్ లో ఒక మ్యాచ్ కు ఆ పిల్లలను తీసుకొస్తున్నారు. అయితే జూన్ 5న జరిగే క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ మహత్కార్యాన్ని నిర్వహిస్తున్నారు. అంటే ఆరోజు ముంబై మ్యాచ్ లేకపోతే, దానికి ముందు లేదా వెనుకన, జూన్5కి దగ్గరలో ఉన్న రోజున మ్యాచ్ కి వీరిని తీసుకొస్తున్నారు. నేడు జూన్ 7 కాబట్టి ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ ను ఎంపిక చేశారు.


Also Read: యువరాజ్ శిష్యుడే.. అభిషేక్ శర్మ

విషయం తెలిసిన నెటిజన్లు ముంబై ఇండియన్స్ జట్టుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే రిలయన్స్ ఫౌండేషన్ చేసే సేవా కార్యక్రమాలను కొనియాడుతున్నారు.

ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టులోకి సూర్యకుమార్ యాదవ్ వస్తున్నాడా? లేక తర్వాత జరిగే మ్యాచ్ లోకి అందుబాటులో ఉంటాడా? అనేది ప్రశ్నార్థకంగా ఉంది. ఒకవేళ తను వస్తే మాత్రం ముంబై ఇండియన్స్ ని ఆపడం ఎవరితరం కాదని అంటున్నారు.

మూడు మ్యాచ్ ల ఓటమి అనంతరం రోహిత్ శర్మతో సహా అందరూ నెట్స్ లో తీవ్రంగా శ్రమించారు. దీంతో నేటి మ్యాచ్ కు అందరు సర్వసన్నద్ధులై  ఉండి, 20వేల మంది పిల్లల్ని ఆనందంలో ముంచెత్తుతారని ఆశిద్దాం.

https://twitter.com/Kalingatv/status/1773759091237912995?

Related News

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Big Stories

×