BigTV English

IPL 2025: ఐపీఎల్.. ఆరుగురు కెప్టెన్లు మారతారా?

IPL 2025: ఐపీఎల్.. ఆరుగురు కెప్టెన్లు మారతారా?

ముంబై ఇండియన్స్ విషయం మాత్రం అటూ ఇటూగా కనిపిస్తోంది. అక్కడ కొత్తగా కెప్టెన్ గా తీసుకున్న హార్దిక్ పాండ్యాను ఉంచుతారా? లేక పాత కాపు రోహిత్ శర్మని కొనసాగిస్తారా? అనేది తెలీడం లేదు. ఇది కాకుండా ఆరు జట్ల కెప్టెన్లు తప్పనిసరిగా మారతారని ఢంకా భజాయించి మరీ నెటిజన్లు చెబుతున్నారు.

ఇంతకీ వారెవరంటే.. ముందుగా లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మార్పు తప్పదని అందరికీ తెలిసిన విషయమే. ఫ్రాంచైజీ సహ ఓనర్ సంజీవ్ గోయెంకా.. గ్రౌండ్ లో చేసిన రచ్చ సామాన్యమైనది కాదు.. కెప్టెన్ ని పట్టుకుని ఏకి పారేశాడు.  బీసీసీఐ నిబంధనలకు భయపడి, రాహుల్ ఏమీ అనకుండా ఆగిపోయాడు. అందువల్ల తను ఎట్టి పరిస్థితుల్లో జట్టులో ఉండడనేది తేలిపోయింది.


రెండోది ఢిల్లీ కెప్టెన్ గా ఉన్న రిషబ్ పంత్.. మరి చెన్నయ్ కి వెళితే, ఢిల్లీకి  రాజు ఎవరనేది ఇంకా స్పష్టం కాలేదు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్, శిఖర్ ధావన్, జస్ప్రీత్ బుమ్రా ఉండగా సూర్యకుమార్ యాదవ్ ని తీసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు.

మూడోది పంజాబ్ కింగ్స్ కూడా శిఖర్ ధావన్ ని మార్చేయాలని చూస్తున్నారు. రోహిత్ శర్మ వస్తే తీసుకుంటామని ఆల్రడీ ప్రీతిజింతా చెప్పడం విశేషం. మరి మన హిట్టర్ ఎటు వెళతాడో చూడాలి.

ఇంక అందరూ అనుకుంటున్నట్టు చెన్నయ్ కి రిషబ్ పంత్ వచ్చే అవకాశాలున్నాయి. ఇక పాత కెప్టెన్లు ఉండే జట్లలో ముఖ్యంగా కోల్ కతా కప్ గెలిచింది కాబట్టి శ్రేయాస్ ను మార్చదని చెబుతున్నారు. అలాగే రన్నరప్ గా నిలిచిన హైదరాబాద్ సన్ రైజర్స్ సైతం ప్యాట్ కమిన్స్ ను మార్చే అవకాశాలు లేవని అంటున్నారు.

గుజరాత్ టైటాన్స్ కి శుభ్ మన్ గిల్ ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ని కొనసాగించే అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే 2024 ఐపీఎల్ సీజన్ లో జట్టును ఒక రేంజ్ లో నడిపించాడు. ఇవండీ ఐపీఎల్ కెప్టెన్ల సంగతులు. మొత్తానికి ఆరు నుంచి ఏడు జట్ల కెప్టెన్లు మారే అవకాశాలు స్పష్టంగా అయితే గోచరిస్తున్నాయి.

Related News

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Big Stories

×