SRH vs RR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) మరికొన్ని గంటల్లోనే ప్రారంభం కాబోతుంది. ఈ మేరకు ఓపెనింగ్ సెర్మనీ కూడా గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో మొదటి మ్యాచ్ కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Katha Knight Riders vs Royal Challengers Bangalore ) మధ్య జరగనుంది. ఇవాళ సాయంత్రం 7:30 గంటలకు… ఈ రెండు జట్ల మధ్య బిగ్ ఫైట్ ఉంటుంది. 6 గంటల సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన.. ఓపెనింగ్ సెర్మని సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది.
అయితే.. అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్… రేపు మధ్యాహ్నం జరగనుంది. ఆదివారం రోజున సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ( Sunrisers Hyderabad vs Rajasthan Royals ) మధ్య ఫైట్ జరగబోతుంది. మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది. సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్.. హైదరాబాదులోని ఉప్పల్ వేదికగా జరగనుంది.
హైదరాబాద్ మ్యాచ్ కు వర్షం ?
అయితే ఆదివారం సన్రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ( Sunrisers Hyderabad vs Rajasthan Royals ) మధ్య జరగాల్సిన మ్యాచ్ కు వరుడు విలన్ గా మారాడు. ఈ మ్యాచ్ ప్రారంభాని కంటే ముందే హైదరాబాదులో వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం రాత్రి నుంచి హైదరాబాదులో వర్షాలు పడుతున్నాయి. శనివారం సాయంత్రం కూడా వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు… వాతావరణ శాఖ హెచ్చరికలు దారిచేస్తుంది. ఆదివారం రోజున కూడా… హైదరాబాదులో వర్షం కురిసే ఛాన్స్ ఉందట. దీంతో.. సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ మధ్య మ్యాచ్ కూడా రద్దు అయ్యే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బస్సు, మెట్రో సౌకర్యం
ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ మధ్య మ్యాచ్ నేపథ్యంలో… ఉప్పల్ స్టేడియానికి వెళ్లేందుకు అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా మెట్రో సేవలు అందిస్తున్నారు. ఉప్పల్ స్టేడియానికి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నారు.
ఇరు జట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్: పాట్ కమిన్స్ (సి), ఇషాన్ కిషన్, అథర్వ తైదే, అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, సచిన్ బేబీ, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, హర్షల్ పటేల్, కమిందు మెండిస్, వియాన్ ముల్డర్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, రాహుల్ సిమ్‌జే ఝామీ, రాహుల్ సిమ్‌జే ఝామీ, అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ
రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్ (సి), యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, జోఫ్రా ఆర్చర్, షిమ్రోన్ హెట్మెయర్, తుషార్ దేశ్‌పాండే, వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, నితీష్ రాణా, సందీప్ శర్మ, ఫజల్‌హాక్ ఫరూఖీ, క్వేన్‌హక్ ఫరూఖీ, క్వేనా మద్హావ్‌వాల్ శుభమ్ దూబే, యుధ్వీర్ సింగ్, కునాల్ సింగ్ రాథోడ్, అశోక్ శర్మ, కుమార్ కార్తికేయ.