EPAPER

Rahul Dravid : రాహుల్ ద్రవిడ్ పై ఐపీఎల్ ఫ్రాంచైజీల కన్ను

Rahul Dravid : రాహుల్ ద్రవిడ్ పై ఐపీఎల్ ఫ్రాంచైజీల కన్ను

Rahul Dravid : టీమ్ ఇండియా మాజీ కోచ్ గా మారిన రాహుల్ ద్రవిడ్ కి ఐపీఎల్ ఫ్రాంచైజీల నుంచి మాత్రం బంపర్ ఆఫర్లు వస్తున్నాయి. కోల్ కతా నైట్ రైడర్స్ ను దశాబ్దం తర్వాత విజయపథంలో నిలిపిన గౌతం గంభీర్ వెళ్లి టీమ్ ఇండియా హెడ్ కోచ్ అయిపోయాడు. ఈ నేపథ్యంలో అక్కడ ప్లేస్ ఖాళీ అయ్యింది. దీంతో రాహుల్ ద్రవిడ్ ను తీసుకోవాలని కోల్ కతా ప్రయత్నాలు మొదలెట్టింది. అందుకోసం ఒక బ్లాంక్ చెక్ ఇచ్చేందుకు రెడీ అయ్యిందనే వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది.


టీమిండియా హెడ్ కోచ్ పదవీ కాలం పూర్తయిన తర్వాత రాహుల్ ద్రవిడ్ సరదాగా మాట్లాడుతూ నేనిప్పుడు నిరుద్యోగిని, కొత్త ఉద్యోగం చూసుకోవాలని అన్నాడు. తనే ఉద్దేశంతో అన్నాడో తెలీదుగానీ, ఐపీఎల్ నుంచి ఫ్రాంచైజీలు మాత్రం ద్రవిడ్ పై కన్నేశాయి. ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందే అతన్ని దక్కించుకోవాలని కొన్ని ప్లాన్ చేస్తున్నాయి. అయితే ఈ వేలం..2024 చివర్లో జరగనుంది.

Also Read : కప్ గెలిచినందుకు ఎక్స్‌ట్రా మనీ వద్దు.. దటీజ్ రాహుల్ ద్రావిడ్


నిజానికి రాహుల్ ద్రవిడ్ కూల్ గా ఉంటాడు, కామ్ గా ఉంటాడు, వివాదాలకు దూరంగా ఉంటాడు. అలాగే పనిపట్ల ఎంతో అంకితభావంతో ఉంటాడు. అదే ఆటగాళ్లందరిలో ఉండాలని కోరుకుంటాడు. తమపై 140 కోట్ల మంది భారతీయుల ఆశలు ఉన్నాయని పదే పదే సహచరులకు నూరిపోస్తూ మానసికంగా సిద్ధం చేస్తుంటాడు.

అంతేకాదు ఆటలో వ్యూహాలు రచించడంలో తనకి సాటి లేరని అంటారు. అందుకు సాక్షమే టీ 20 ప్రపంచకప్ లో కొహ్లీని ఓపెనర్ గా తీసుకురావడం. తను ఫెయిల్ అవుతున్నా ఫైనల్ వరకు అదే పంథాలో వెళ్లాడు. కరెక్టుగా ఆడాల్సిన మ్యాచ్ లో కొహ్లీ ఆడి ద్రవిడ్ నమ్మకాన్ని నిలబెట్టాడు. కప్ పట్టుకొచ్చాడు.

భారత జట్టును 2022 టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్‌కు, 2023 వరల్ట్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు, 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌కు, అలాగే 2024 టీ20 వరల్డ్ కప్‌లో విజేతగా నిలవడంలో ద్రవిడ్‌ది ప్రధాన పాత్ర అని చెప్పాలి. కోచ్ గా కాకపోయినా మెంటార్ గా అయినా తీసుకోవాలని ఫ్రాంచైజీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అయితే ద్రవిడ్‌ను కేకేఆర్ ఫ్రాంచైజీ సంప్రదించిందని, మెంటార్ గా రావాలని కోరినట్టు బెంగాల్ మీడియా పేర్కొంది.

Related News

IND VS NZ: న్యూజిలాండ్ ను చిత్తు చేసిన టీమిండియా

Washington Sundar: 7 వికెట్లతో దుమ్ములేపిన వాషింగ్టన్ సుందర్..కుప్పకూలిన న్యూజిలాండ్ !

IND VS NZ: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్..3 మార్పులతో టీమిండియా !

IND VS NZ: నేటి నుంచే రెండో టెస్ట్..జట్ల వివరాలు, పిచ్ కాండీషన్స్ ఇవే !

Zimbabwe: టీ20ల్లో జింబాబ్వే ప్రపంచ రికార్డ్.. 20 ఓవర్లలో 344 పరుగులు

HCA: HCA ఎన్నికలు, వివాదాలపై సుప్రీంకోర్టు కీలక ప్రకటన !

IPL 2025: కేఎల్‌ రాహుల్‌ ఔట్‌..ఆ బౌలర్‌కు రూ.14 కోట్లు..లక్నో రిటైన్షన్‌ లిస్ట్‌ ఇదే !

Big Stories

×