BigTV English

Dravid refuses extra bonus: కప్ గెలిచినందుకు ఎక్స్‌ట్రా మనీ వద్దు.. దటీజ్ రాహుల్ ద్రావిడ్

Dravid refuses extra bonus: కప్ గెలిచినందుకు ఎక్స్‌ట్రా మనీ వద్దు.. దటీజ్ రాహుల్ ద్రావిడ్

Rahul Dravid latest news(Cricket news today telugu): చాలామందికి కొన్ని ప్రిన్సిపల్ ఉంటాయి. వాటిని దాటి ఏ పనీ చేయరు. అది డబ్బైనా.. ఏదైనా కావచ్చు. వాటిని వదులుకునేందుకు సిద్ధపడతారు. అలాంటి వారిలో టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఒకరు. ఆయన గురించి కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.


టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలిచింది. దాదాపు 23 ఏళ్ల తర్వాత కప్ గెలవడంతో బీసీసీఐ ఆటగాళ్లకు భారీ నజరానా ప్రకటించింది. టీమిండియాకు 125 కోట్లు ఇస్తున్నట్లు స్టేట్‌మెంట్ చేశారు బీసీసీఐ కార్యదర్శి జై షా. 125 కోట్లను నాలుగు కేటగిరిలుగా విభజించి మనీ అప్పగించారు.

ఆటగాళ్లకు మాదిరిగానే హెడ్ కోచ్ రాహుల్‌ ద్రావిడ్ ఐదు కోట్లు ఫ్రైజ్ మనీ ఇచ్చింది బీసీసీఐ. దాన్ని ఆయన తిరస్కరించాడు. మిగతా కోచ్‌లకు రెండున్నర కోట్ల ఇచ్చినట్టుగానే తనకు ఇవ్వాలని అంతకుమించి ఎక్కువ వద్దని సున్నితంగా తిరస్కరించాడు.


ఈ విషయంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోచింగ్ గ్రూప్‌లో బ్యాటింగ్- విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్- దిలీప్, బౌలింగ్- పరాస్ మాంబ్రే రెండున్నర కోట్లు ఇచ్చింది. మిగతా మొత్తాన్ని అందరికీ సర్దుబాటు చేసినట్టు సమాచారం. రాహుల్ మాటలు విని షాక్ అవ్వడం బీసీసీఐ వంతైంది. ఎవరైనా డబ్బు ఇస్తే వద్దంటారా అంటూ మాట్లాడుకోవడం మొదలైంది. దీనిపై ఆటగాళ్లలో కూడా చర్చ జరుగుతోంది.

ALSO READ: టీమిండియా- జింబాబ్వే మధ్య మూడో టీ 20 మ్యాచ్, జైస్వాల్, శాంసన్ ఇన్..

2018లో అండర్-19 ప్రపంచకప్‌ను టీమిండియా యువ ఆటగాళ్లు గెలుచుకున్నారు. అప్పుడు ఆ జట్టుకు కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ ఉన్నాడు. అప్పట్లో కోచ్‌కు 50 లక్షలు, ఇతర సభ్యులకు 20 లక్షలు ఇచ్చారు. అందరికీ సమానంగా ఇవ్వాలని రాహుల్ రిక్వెస్ట్ చేయడంతో మిగతా మొత్తాన్ని అందరికీ బీసీసీఐ సర్దుబాటు చేసిన విషయం తెల్సిందే.

Related News

Rohit Sharma: సెంటిమెంట్ డ్రామాలు ఆడుతున్న రోహిత్‌..ధోనిలాగా 50 ఏళ్ల వ‌ర‌కు ఆడాల‌ని ప్లాన్ ?

Ban-Burqa: బుర‌ఖా ధ‌రించి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ప్లేయ‌ర్లు ?

IND VS WI: స్టేడియంలో ఘాటు రొమాన్స్‌…ప్రియుడి చెంప‌పైన కొట్టి మ‌రీ !

Sai Sudharsan: బౌండ‌రీ గేట్ ద‌గ్గ‌ర బ‌ర్గ‌ర్ తింటున్న సాయి సుద‌ర్శ‌న్‌…టెస్టు క్రికెట్‌లో ఫాలో ఆన్ అంటే?

CSK Srinivasan: మ‌హిళ‌ల క్రికెట్ తో రూపాయి లాభం లేదు..వంటింట్లో రొట్టెలు చేసుకుంటే బెస్ట్‌!

SAW vs BanW: నేడు బంగ్లా వ‌ర్సెస్ ద‌క్షిణాఫ్రికా మ్యాచ్‌..ఎవ‌రు గెలిచినా టీమిండియాకు ప్ర‌మాద‌మే, పాయింట్ల‌ ప‌ట్టికే త‌ల‌కిందులు

Smriti Mandhana: గిల్ ఓ పిల్ల‌బ‌చ్చా…స్మృతి మందాన కండ‌లు చూడండి…పిసికి చంపేయ‌డం ఖాయం !

హర్మన్‌ కు ఏది చేత‌కాదు, 330 టార్గెట్ ను కాపాడుకోలేక‌పోయారు..ఇంట్లో గిన్నెలు తోముకోండి?

Big Stories

×