IPL History: అసలు ఐపీఎల్ పుట్టుక అనేది ఒక పక్కా రివెంజ్ డ్రామా, బిజినెస్ మైండ్‌గేమ్ మాత్రమే కాదు బాస్.. అది ఒక గ్లోబల్ క్రికెట్ ని డీకోడ్ చేసిన రెవల్యూన్ ! మ్యాటర్ లోకి వెళ్తే అది 2007.. ఆ టైంలో జీ నెట్‌వర్క్ అధినేత సుభాష్ చంద్రకి బిసిసిఐకి మధ్య ఉన్న పాత గొడవలు ముదిరిపోయి, కపిల్ దేవ్ వంటి దిగ్గజాలతో కలిసి ICL (Indian Cricket League) అనే ప్రైవేట్ లీగ్ స్టార్ట్ చేశారు. ఇది చూసిన బోర్డుకి పిచ్చ కోపం వచ్చేసింది. తమ గుత్తాధిపత్యానికి ముప్పు వస్తుందని భయపడి, ఐసీఎల్‌లో ఆడే ప్లేయర్లకు లైఫ్ లాంగ్ బ్యాన్ విధించడమే కాకుండా, దానికి కౌంటర్ ఇవ్వడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. అప్పుడే లలిత్ మోదీ అనే ఒక విజనరీ మైండ్ ఐడియాతో వచ్చారు. యూరోపియన్ ఫుట్‌బాల్ క్లబ్స్ లాగా క్రికెట్‌ను కూడా ఒక పక్కా బిజినెస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీలా మార్చేయాలని ఆయన 1990లలోనే అనుకున్నా, అప్పటి బోర్డు ఒప్పుకోలేదు. కానీ ఐసీఎల్ సృష్టించిన భయం వల్ల బోర్డుకి మోదీ ప్లాన్ తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయింది.
also read:Sreenu Vaitla Land Scam: 7.2 కోట్ల భూ కుంభకోణం..టాలీవుడ్‌లో సంచలనం రేపుతున్న శ్రీను వైట్ల !
సరిగ్గా ఐపీఎల్ ప్రకటించిన కొన్ని రోజులకే ధోనీ అండ్ కో సౌత్ ఆఫ్రికాలో జరిగిన ఫస్ట్ T20 వరల్డ్ కప్ కొట్టేసి ఇండియాకి వచ్చారు. అంతకుముందు వరకు T20ని “ఫ్లూక్” అనుకున్న జనం, వరల్డ్ కప్ గెలవగానే ఈ షార్ట్ ఫార్మాట్ మీద విపరీతమైన క్రేజ్ పెంచేసుకున్నారు. ఇదే కరెక్ట్ టైమ్ అని ఫిక్స్ అయిన లలిత్ మోదీ, ఆ ఊపునే మార్కెటింగ్ కోసం వాడుకున్నారు. సాధారణంగా క్రికెట్ జట్లు రాష్ట్రాల పేర్లతో ఉండే పాత పద్ధతిని పక్కన పెట్టి, 2008 జనవరిలో ఎనిమిది నగరాల ఫ్రాంచైజీల కోసం వేలం నిర్వహించారు. రిలయన్స్, షారుఖ్ ఖాన్, విజయ్ మాల్యా వంటి బిగ్ షాట్స్ సుమారు $723 మిలియన్లు కుమ్మరించి జట్లను కొనుగోలు చేయడంతో క్రికెట్ అనేది ఒక గ్లామరస్ ‘కార్పొరేట్’ బిజినెస్‌గా మారిపోయింది.
ఆ తర్వాత ఫిబ్రవరిలో జరిగిన ప్లేయర్స్ వేలం క్రికెట్ ప్రపంచాన్నే ఒక ఊపు ఊపేసింది. ప్లేయర్ల ప్రతిభకు డాలర్లలో రేటు కట్టడం అనేది అప్పట్లో ఒక విప్లవం. సచిన్, గంగూలీ, ద్రావిడ్ వంటి వాళ్లని ‘ఐకానిక్ ప్లేయర్స్’గా వాళ్ల సొంత నగరాలకే ఇచ్చేసినా, ఐకానిక్ హోదా లేని ధోనీ కోసం జరిగిన బిడ్డింగ్ వార్ మామూలుగా లేదు. చివరకు $1.5 మిలియన్లకు సిఎస్‌కే ఆయన్ని దక్కించుకుంది. ఇక సోనీ పిక్చర్స్ పదేళ్ల కోసం సుమారు $1.02 బిలియన్లతో టీవీ హక్కులను సొంతం చేసుకోవడం అప్పట్లో ఒక వరల్డ్ రికార్డ్. చివరకు ఏప్రిల్ 18, 2008న బెంగళూరులో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో బ్రెండన్ మెకల్లమ్ కొట్టిన ఆ 158 రన్స్ కేవలం ఒక సెంచరీ మాత్రమే కాదు, అది క్రికెట్ ఫ్యూచర్‌ని డిసైడ్ చేసిన విధ్వంసం. ఆ ఒక్క ఇన్నింగ్స్‌తో స్పాన్సర్లకు, ఫ్యాన్స్‌కి ఐపీఎల్ ఒక గోల్డెన్ మైన్ అని ఫిక్స్ అయిపోయింది.
అలా ఒక కోపంతో, ఒక రివెంజ్‌తో మొదలైన లీగ్.. ఇప్పుడు 2026 మార్చి 28న 19వ సీజన్‌లోకి అడుగుపెడుతోంది. 10 టీమ్స్, లక్షల కోట్లు, గ్లోబల్ స్టార్స్.. ఇదంతా ఆరోజు లలిత్ మోదీ వేసిన ఆ క్రేజీ స్కెచ్ వల్లే!
ఇక గత 18 ఏళ్లలో ఐపీఎల్ ప్రయాణాన్ని, ఆ క్రేజీ స్టాట్స్ మరియు విన్నర్స్ లిస్ట్‌ను ఒకసారి గమనిస్తే ..
ఐపీఎల్ లోని కొన్ని టాప్ రికార్డ్స్:
అత్యధిక టైటిల్స్: చెన్నై సూపర్ కింగ్స్ (5), ముంబై ఇండియన్స్ (5).
అత్యధిక పరుగులు: విరాట్ కోహ్లీ (8000+ రన్స్ తో రారాజుగా కొనసాగుతున్నాడు).
అత్యధిక వికెట్లు: యుజ్వేంద్ర చాహల్ (ఐపీఎల్ చరిత్రలో లీడింగ్ వికెట్ టేకర్ – 200 పైగా వికెట్లతో).
అత్యధిక స్కోరు: ఎస్‌ఆర్‌హెచ్ (2024లో ముంబైపై కొట్టిన 277/3 మరియు ఆర్సీబీపై 287/3 – ప్యూర్ డామినేషన్!).
వేగవంతమైన సెంచరీ: క్రిస్ గేల్ (కేవలం 30 బంతుల్లో పుణేపై 175* రన్స్ చేసిన ఆ ఇన్నింగ్స్ ఎప్పటికీ క్రేజీ!).
ఇప్పుడు 2026 మార్చి 28న 19వ సీజన్ బెంగళూరులో స్టార్ట్ అవ్వబోతోంది. గతేడాది కప్పు కొట్టిన జోష్‌లో ఉన్న ఆర్సీబీ, పగ తీర్చుకోవాలని చూస్తున్న మన ఆరెంజ్ ఆర్మీ (ఎస్‌ఆర్‌హెచ్) తలపడబోతున్నాయి.చూడాలి మరి ఈ సారి ఎవరిపై ఎవరు నెగ్గుతారో !