BigTV English

Ireland Vs India : ఐర్లాండ్ తో తొలి టీ20.. బరిలోకి బుమ్రా.. శాంసన్ కు చివరి ఛాన్స్..?

Ireland Vs India : ఐర్లాండ్ తో తొలి టీ20.. బరిలోకి బుమ్రా.. శాంసన్ కు చివరి ఛాన్స్..?
India vs Ireland match updates

India vs Ireland match updates(Sports news in telugu) :

టీమిండియా మరో టీ20 సిరీస్ కు సిద్ధమైంది. ఐర్లాండ్‌తో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడుతుంది. ఇటీవల వెస్టిండీస్‌ టూర్ లో టీమిండియా టీ20 సిరీస్ ను 2-3 తేడాతో కోల్పోయింది. కానీ ఆ జట్టులో ఉన్న చాలా మంది ప్లేయర్లు మారిపోయారు. తొలి టీ20 శుక్రవారం రాత్రి జరుగుతుంది. 6 రోజుల వ్యవధిలోనే ఈ సిరీస్ ముగుస్తుంది.


2018 జూన్‌, 2022 జూన్‌లో భారత్ జట్టు ఐర్లాండ్ లో పర్యటించింది. అప్పుడు రెండు టీ20 మ్యాచ్ ల సిరీస్ ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. 2009 టీ20 ప్రపంచకప్‌లోనూ ఐర్లాండ్‌ ను చిత్తు చేసింది. ఐర్లాండ్‌తో ఇప్పటివరకు ఆడిన 5 టీ20ల్లోనూ భారత్‌ గెలిచింది.

ఆసియా కప్‌, ప్రపంచకప్‌ నేపథ్యంలో ఐర్లాండ్ టూర్ కీలకంగా మారింది. వెన్నెముక గాయంతో బాధపడిన భారత్ స్టార్ పేసర్ బూమ్రా.. 11 నెలలు జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఐర్లాండ్ సిరీస్ తో మళ్లీ మైదానంలోకి అడుగు పెడుతున్నాడు. జట్టుకు అతడే నాయకత్వం వహిస్తున్నాడు.


చివరగా ఆస్ట్రేలియాతో గతేడాది సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లో జరిగిన టీ20 మ్యాచ్ లో బుమ్రా ఆడాడు. ఆ తర్వాత నుంచి జట్టుకు దూరమయ్యాడు. గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లోనూ ఆడలేదు. బుమ్రా ఫిట్‌నెస్‌ కు, సత్తాకు ఐర్లాండ్ టూర్ పరీక్షగా మారింది. మరో పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ , ఆల్‌రౌండర్లు శివమ్‌ దూబె, వాషింగ్టన్‌ సుందర్‌ మళ్లీ జట్టులోకి వచ్చారు.

వికెట్‌ కీపర్‌‌ సంజు శాంసన్‌కు ఈ సిరీస్ కీలకంగా మారింది. విండీస్ టూర్ లో ఆశించిన విధంగా రాణించలేకపోయాడు. ‌ సంజుకు ఐర్లాండ్ సిరీస్ చక్కని అవకాశం. ఈ సిరీస్ లో విఫలమైతే ఇక జట్టులో చోటు కష్టమనే వార్తలు వస్తున్నాయి. మరో వికెట్ కీపర్ జితేశ్‌ శర్మ నుంచి శాంసన్ కు పోటీ ఎదురవుతోంది. ఐపీఎల్ లో దుమ్మురేపిన రింకు సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టే అవకాశం ఉంది. తిలక్‌ వర్మ తన ఫామ్ ను కొనసాగించేందుకు ఐర్లాండ్ సిరీస్ ఉపయోగపడనుంది. రుతురాజ్‌ గైక్వాడ్, యశస్వి జైశ్వాల్, రింకు సింగ్, తిలక్‌ వర్మ, సంజు శాంసన్‌తో టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్ బలంగానే ఉంది. ‌

2024 టీ20 ప్రపంచకప్‌కు ఐర్లాండ్ అర్హత సాధించింది. ఆ జట్టు‌ మంచి ఫామ్‌లో కూడా ఉంది. కెప్టెన్‌ పాల్‌ స్టిర్లింగ్‌, జోష్‌ లిటిల్‌, ఆండ్రూ బల్‌బర్నీ, కర్టీస్‌ కాంఫర్‌, హ్యారీ టెక్టార్‌, మార్క్‌ అడైర్‌, టకర్‌, డాక్‌రెల్‌ లాంటి ప్లేయర్స్ తో బలంగానే ఉంది. గత సిరీస్‌లో ఓ మ్యాచ్‌లో భారత్ ను ఐర్లాండ్ వణికించింది. 226 పరుగుల లక్ష్య ఛేదనలో 221 పరుగులు చేసి విజయానికి చేరువలోకి వచ్చింది.

భారత్ తుది జట్టు అంచనా : రుతురాజ్‌ గైక్వాడ్, యశస్వి జైశ్వాల్, తిలక్‌ వర్మ, రింకు సింగ్‌, సంజు శాంసన్‌, శివమ్‌ దూబె, వాషింగ్టన్ సుందర్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, రవి బిష్ణోయ్‌, బుమ్రా, ప్రసిద్ధ్‌ కృష్ణ.

ఐర్లాండ్‌ తుది జట్టు అంచనా : బల్‌బర్నీ, స్టిర్లింగ్‌, టకర్‌, టెక్టార్‌, కర్టీస్‌ కాంఫర్‌, మెకర్థీ, జోష్‌ లిటిల్‌, బెంజమిన్‌ వైట్‌, ఫియాన్‌ హ్యాండ్‌, డాక్‌రెల్‌, మార్క్‌ అడైర్‌.

Related News

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

Big Stories

×