BigTV English

BCCI :- దినేశ్ కార్తీక్ అవసరమా.. ఆలోచనలో బీసీసీఐ…

BCCI :- దినేశ్ కార్తీక్ అవసరమా.. ఆలోచనలో బీసీసీఐ…


BCCI :- దినేశ్ కార్తీక్ భారంగా మారుతున్నాడు. బెస్ట్ ఫినిషర్ అని పిలిపించుకున్న డీకే.. ఐపీఎల్‌లో పూర్ పర్ఫామెన్స్ చూపిస్తున్నాడు. ఐపీఎల్ సీజన్‌లో ఆటతీరును కూడా సెలక్టర్లు గమనిస్తుంటారు. వచ్చే సిరీస్‌లలో ఎవరెవరు ఫామ్ లో ఉన్నారు, ఎవరిని తీసుకోవాలనే విశ్లేషణ జరుగుతుంది. ఆ రకంగా చూస్తే దినేశ్ కార్తీక్‌ను ఈసారి ఇంటర్నేషనల్ మ్యాచులలో తీసుకుంటారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. వచ్చే ఐపీఎల్ తరువాత సంగతి. ముందు టీమిండియాలోనే చోటు దక్కకపోవచ్చు అని చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా దినేశ్ కార్తీక్‌లో మూడు నెగటివ్ ఫ్యాక్టర్స్ చూస్తున్నారు.

1. వయసు
దినేశ్ కార్తీక్ వయసు 37 ఏళ్లు. ఇతన్ని మించి వయసు ఉన్న వాళ్లు ఐపీఎల్‌లో బోలెడు మంది. కాని, వాళ్ల పర్ఫామెన్స్‌తో దినేశ్ కార్తీక్ ఆటకు పోలిక లేదు. ఎంఎస్ ధోని వయసు 42. ఇప్పటికీ సిక్సులు బాదుతున్నాడు, వికెట్ల వెనక చురుగ్గా కదులుతున్నాడు, జట్టు కోసం మంచి వ్యూహాలు పన్నుతున్నాడు. కాని, దినేశ్ కార్తీక్‌లో మాత్రం వయసు తాలూకు నెర్వస్‌నెస్ కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు.


2. వికెట్ కీపర్‌గా విఫలం
దినేశ్ కార్తీక్‌ ఈ మధ్య వికెట్ల వెనక చురుగ్గా కనిపించడం లేదన్నది వాస్తవం. పైగా డీకే కొన్ని క్యాచ్‌లు డ్రాప్ చేసిన కారణంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లు ఓడిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫిల్ సాల్ట్ క్యాచ్‌ను దినేశ్ కార్తీక్ డ్రాప్ చేశాడు. అప్పటికే సాల్ట్ చాలా ప్రమాదకరంగా ఆడుతున్నాడు. అతడి క్యాచ్ మిస్ చేయడంతో ఆర్‌సీబీ ఓడిపోవాల్సి వచ్చింది. మిస్ క్యారీ కారణంగా బౌండరీలకు వెళ్లి మ్యాచ్ ఓడిన సందర్భాలూ ఉన్నాయి.

3. ఫామ్‌లో లేకపోవడం
దినేశ్ కార్తీక్ ఈ సీజన్లో చేసిన పరుగులు కేవలం 110. పైగా యావరేజ్ జస్ట్ 12.22. కాని, లాస్ట్ ఇయర్ ఇదే ఐపీఎల్‌లో 16 మ్యాచులు ఆడి 330 పరుగులు చేశాడు. దాదాపు 10 మ్యాచ్‌లలో నాటౌట్‌గా ఉన్నాడు. కాని, ఈ సీజన్‌కు వచ్చే సరికి చాలా దారుణంగా ఆడుతున్నాడు. దీంతో కుర్ర టాలెంట్ చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దినేశ్ కార్తీక్‌కు అవకాశం ఇస్తారా అనేది చూడాలి.

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×