MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అది తక్కువ కాలంలోనే టీమిండియా కెప్టెన్ బాధ్యతలు తీసుకున్న మహేంద్రసింగ్ ధోని, జట్టు స్వరూపాన్ని మార్చేశారు. టీమిండియా కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక మొనగాడిగా చరిత్ర సృష్టించారు మహేంద్రసింగ్ ధోని. అయితే అలాంటి మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్లు విదేశాల్లో తిరిగితే మహేంద్రసింగ్ ధోని మాత్రం ఇండియాలోనే చెక్కర్లు కొడుతున్నారు. ఈ సందర్భంగా అభిమానులు కలిసినప్పుడు వాళ్లతో గడిపి, టైం స్పెండ్ చేస్తున్నారు.
Also Read: IPL 2026: క్లాసెన్ కోసం కావ్య పాప స్కెచ్.. SRHలోకి హెట్‌మైర్, ఐపీఎల్ 2026 రిటెన్షన్ ఎప్పుడంటే?
ఇండియా వ్యాప్తంగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్న మహేంద్ర సింగ్ ధోని తాజాగా ఓ అభిమానికి అరుదైన గిఫ్ట్ ఇచ్చాడు. ఆ అభిమాని కొనుగోలు చేసిన బుల్లెట్ బైక్ కు ఆటోగ్రాఫ్ ఇచ్చాడు మహేంద్ర సింగ్ ధోని. విమానాశ్రయం దగ్గర మహేంద్ర సింగ్ ధోని కనిపించడంతో, ఆటోగ్రాఫ్ కావాలని వెంటపడ్డాడు అభిమాని. దీంతో వెంటనే స్పందించిన మహేందర్ సింగ్ ధోని, ఆ బుల్లెట్ బండి పెట్రోల్ ట్యాంకర్ పైన ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన మహేంద్ర సింగ్ ధోని అభిమానులు ఫిదా అయిపోతున్నారు. మహేంద్ర సింగ్ ధోని కూల్ అండ్ సింప్లిసిటీ ఉన్న ఆటగాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ బైక్ వ్యాల్యూ మూడు లక్షలు ఉందట. ఎప్పుడైతే మహేంద్రసింగ్ ధోని ఆటోగ్రాఫ్ ఇచ్చాడో, అప్పటినుంచి అమాంతం దీని వ్యాల్యూ పెరిగిందట. 30 కోట్లు ఇస్తామని ఆ అభిమాని దగ్గరికి వస్తున్నారట. 30 కోట్లు ఇచ్చి బైక్ కొనుగోలు చేస్తామని ఆఫర్ ఇస్తున్నారట. అయినప్పటికీ ధోని అభిమాని మాత్రం అసలు అమ్మేది లేదని తేల్చి చెప్పారట. ఈ సంఘటన ఎప్పుడు వైరల్ గా మారింది.
మహేంద్ర సింగ్ ధోని… ఐపీఎల్ కు రిటైర్మెంట్ ఇస్తారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. ఐపీఎల్ 2026 టోర్నమెంటులో కూడా మహేంద్రసింగ్ ధోని ఆడతాడని వెల్లడించింది. ఈ సీజన్ ఆడిన తర్వాత అతడు రిటైర్మెంట్ తీసుకునే ఛాన్సులు ఉన్నట్లు పేర్కొంది. దీంతో అభిమానులు సంబరపడిపోతున్నారు. ఇది ఇలా ఉండగా, ఈ సీజన్ లో కూడా రూ.4 కోట్లకే మహేంద్ర సింగ్ ( MS Dhoni), చెన్నై తరఫున బరిలోకి దిగుతున్నాడు. గత సీజన్ లో కూడా ఇదే రేటు అధికారికంగా తీసుకున్నాడు. అనధికారికంగా ఎక్కువే ముట్టాయట.
?igsh=MXkwOG45NGtxMTVpOQ%3D%3D