BigTV English

Khushboo With M S Dhoni : తమిళనాడు అంటే ధోనీ.. ధోనీ అంటే ‘తల’

Khushboo With M S Dhoni : తమిళనాడు అంటే ధోనీ.. ధోనీ అంటే ‘తల’

Khushboo With M S Dhoni (Sports News Updates): ధోనీ అంటేనే స్పెషల్. ఐపీఎల్ తప్ప ఏ ఇంటర్నేషనల్ మ్యాచ్ లలోనూ ఆడకపోయినా.. ధోనీకి క్రేజ్ తగ్గలేదు. మిస్టర్ కూల్ అంటే ఇప్పటికీ ఇష్టపడేవాళ్లు కోట్లలో ఉన్నారు. ముఖ్యంగా తమిళనాడు ప్రజలైతే ధోనీని తమ సొంత మనిషిగా కలిపేసుకున్నారు. స్టార్ హీరోలకు ఉండే బిరుదును ధోనీకి ఇచ్చారు. మన దగ్గర మెగాస్టార్, సూపర్ స్టార్‌లా తమిళనాడులో తలపతి అంటుంటారు. అంత ఇష్టం, గౌరవం మహేంద్ర సింగ్ ధోనీ అంటే.


ఒకప్పటి హీరోయిన్ ఖుష్బూ అత్తయ్యను కలిసి సర్‌ప్రైజ్ చేశాడు ధోనీ. ఖుష్బూ అత్తగారి వయసు 88 ఏళ్లు అయినా… క్రికెట్ అన్నా, ధోనీ అన్నా చాలా ఇష్టం. విషయం తెలుసుకున్న మహేంద్ర సింగ్ ధోనీ.. నేరుగా ఖుష్బూ అత్తయ్య వాళ్లింటికి వెళ్లాడు. సడెన్‌గా ధోనీని చూసి ఖష్బూ అత్తయ్య షాక్. ధోనీని చూసి ఉబ్బితబ్బిబ్బైన ఆమె.. ఆనందం పట్టలేక ధోనిని ముద్దు పెట్టుకుంది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవికాస్తా వైరల్ అయ్యాయి. మహీ నువ్ సూపర్ అంటూ తెగ పొడిగేస్తున్నారు.

ఈ ఫొటోలు ట్విటర్ లో షేర్ చేసిన ఖష్బూ అయితే.. ధోనీ ఆటిట్యూడ్ ను ఆకాశానికెత్తేసింది. హీరోలు తయారవరు, పుడతారు అంటూ కొటేషన్ పెట్టింది. తన అత్తయ్యను కలవడం ద్వారా ఆమె ఆయుష్షును, సంతోషాన్ని మరింత పెంచాడంటూ తెగ పొగిడేసింది. ధోనికి ఆతిథ్యం ఇవ్వడం తమకు దక్కిన అదృష్టం, గౌరవం అంటూ తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది ఖుష్బూ.


Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×