BigTV English

KL Rahul : రాహుల్ – అతియాశెట్టి జంటకు ఏం గిఫ్ట్స్ వచ్చాయో తెలుసా..?

KL Rahul : రాహుల్ – అతియాశెట్టి జంటకు ఏం గిఫ్ట్స్ వచ్చాయో తెలుసా..?

KL Rahul : భారత స్టార్‌ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌, బాలీవుడ్ నటి అతియాశెట్టి. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న కపుల్. తాజాగా ఈ జంట వివాహం జరిగింది. అతిథులు, కుటుంబసభ్యుల మధ్య వీరి పెళ్లిని అట్టహాసంగా నిర్వహించారు. అప్పటి నుంచి పెళ్లి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ప్రముఖులు, నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాహుల్ -అతియా జోడికి వచ్చిన బహుమతులపై అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్యూట్ కపుల్ కు సినీ, క్రీడారంగంలోని ప్రముఖులు ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే.. అంటూ వార్తలు వస్తున్నాయి.


బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి తన కుమార్తె అతియాశెట్టికు పెళ్లి బహుమతిగా ముంబైవో విలాసవంతమైన ఫ్లాట్ ఇచ్చారని సమాచారం. ఈ ఫ్లాట్ విలువ రూ.50 కోట్లు ఉంటుందంటున్నారు. అలాగే సునీల్‌ శెట్టి క్లోజ్‌ ఫ్రెండ్‌ బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ కొత్త జంటకు రూ.1.64 కోట్లు విలువ చేసే ఆడీ కారు గిఫ్ట్‌ ఇచ్చారని టాక్ . అతియా శెట్టికి రూ.30 లక్షలు విలువ చేసే వాచ్‌ని బహుమతిగా ఇచ్చాడట బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్. అతియాకు అర్జున్‌ కపూర్‌ డైమండ్‌ హారం ఇచ్చినట్లు వార్తలు షికారు చేస్తున్నాయి.

రాహుల్ – అతియా జోడికి క్రికెటర్ విరాట్‌ కోహ్లీ బీఎమ్‌డబ్ల్యూ కారు ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ధోని బైక్‌ను గిఫ్ట్‌ ఇచ్చాడని తెలుస్తోంది. రాహుల్- అతియా రిసెప్షన్ ముంబైలో గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక రిసెప్షన్ వేదికపై ఈ క్యూట్ కపుల్ కు ఎలాంటి గిఫ్ట్స్ రాబోతున్నాయనే ఆసక్తి నెలకొంది.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×