Big Stories

Surya kumar Yadav : టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్ 2022.. సూర్య..

Surya kumar Yadav : ఆడింది 45 టీ20లు. 43 ఇన్నింగ్స్ ల్లో 1578 పరుగులు. ఇందులో 3 సెంచరీలు, 13 అర్థసెంచరీలు. 142 ఫోర్లు, 92 సిక్సులు. స్ట్రెయిక్ రేట్ 180.34. యావరేజ్ 46.41 ఇవి సూర్యకుమార్ యాదవ్ టీ20 మ్యాచ్ ల్లో గణాంకాలు. 30 ఏళ్ల వయసులో జట్టులోకి వచ్చినా యువ ఆటగాళ్లతో పోటీపడుతూ వాళ్ల మించి రాణిస్తున్నాడు. టీ20ల్లో పరుగుల వరద పారిస్తున్నాడు. మైదానం నలువైపులా బంతి బాదుతూ అదరగొడుతున్నాడు.

- Advertisement -

పొట్టి క్రికెట్ లో గట్టోడు..
2022లో పొట్టి ఫార్మాట్ లో సూర్య అద్భుతమైన ఆటతీరు కనబరిచాడు. గతేడాది 31 మ్యాచ్‌ల్లో 45.56 సగటుతో 1,164 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్ లో అత్యధిక రన్స్‌ చేసిన ఆటగాడిగా నిలిచాడు. వినూత్నమైన షాట్లు ఆడుతూ క్రికెట్‌ ఫ్యాన్స్ ను సూర్యకుమార్‌ యాదవ్‌ ఉర్రూతలూగిస్తున్నాడు. ఈ క్రమంలో మరో ఘనత సాధించాడు సూర్య. 2022 సంవత్సరానికిగాను టీ20ల్లో క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా సూర్యను ఐసీసీ ప్రకటించింది.

- Advertisement -

సూర్య నామ సంవత్సరం..
2022 సూర్యకుమార్‌ కెరీర్‌ను కీలక మలుపుతిప్పింది. టీ20ల్లో ఇప్పటికి మూడు శతకాలు బాదాడు. అందులో రెండూ 2022లో కొట్టినవే. గతేడాది 9 అర్ధ సెంచరీలు చేశాడు. 2022లో 68 సిక్సర్లు బాది అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మరే ఆటగాడు అతడి దరిదాపుల్లో కూడా లేడు. ఇక టీ20 ప్రపంచకప్‌లో ఆరు ఇన్నింగ్స్‌లు ఆడిన సూర్య 3 హాఫ్‌ సెంచరీలతో అదరగొట్టాడు. ప్రస్తుతం టీ20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ అగ్రస్థానంలో ఉన్నాడు.

మహిళా క్రికెటర్లు వీరే..!
మహిళల క్రికెట్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ తహ్లియా మెక్‌గ్రాత్ టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2022గా ఎంపికైంది. ప్రస్తుతం ఆమె టీ20ల్లో నంబర్‌వన్‌ బ్యాటర్‌గా ఉంది. ఎమర్జింగ్‌ క్రికెటర్ ఆఫ్‌ ది ఇయర్‌ 2022గా టీమిండియా నయా బౌలింగ్ సంచలనం రేణుకా సింగ్‌ను ఐసీసీ ఎంపిక చేసింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News