
Asian Para Games : చైనాలో జరుగుతున్న ఆసియా పారా గేమ్స్ లో భారత పారా అథ్లెట్లు పతకాల పంట పండిస్తున్నారు. ఒకే రోజు 18 పతకాలు సాధించారు. అందులో 4 స్వర్ణాలు, 6 రజతాలు,8 కాంస్యాలు ఉన్నాయి. అథ్లెటిక్స్ లోనే మూడు స్వర్ణాలతో సహా 11 పతకాలు రావడం విశేషం. ప్రస్తుతం 34 పతకాలతో భారత్ 5వ స్థానంలో ఉంది.
ఆసియా పారా గేమ్స్ లో భారత పారా అథ్లెట్ల జోరు సాగుతోంది. పతకాల మీద పతకాలు కొల్లగొడుతున్నారు. ఉమెన్స్ 400 మీటర్ల రేస్ లో దీప్తి జీవాన్జి గోల్డ్ మెడల్ సాధించింది. ఈ రేసును ఆమె 56.69 సెకన్లలోనే ముగించింది. అంతేకాదు కొత్త ఆసియా రికార్డ్ నెలకొల్పింది. మెన్స్ డిస్కస్ తో ఎఫ్ 54/55/56 కేటగిరీలో భారత్ క్లీన్ స్వీప్ చేసింది. నీరజ్ యాదవ్ 38.56 మీటర్ల ప్రదర్శనతో స్వర్ణపతకం గెలుచుకున్నాడు. యోగేశ్ 42.13 మీటర్లతో రజత పతకం, ముతురాజా 35.06 మీటర్లతో కాంస్య పతకం సాధించారు.
5000 మీటర్ల రేసులో శంకరప్ప శరత్, పురుషుల 400 మీటర్ల టీ 64 కేటగిరీలో అజయ్ కుమార్, పురుషుల ఎఫ్ 40 షాట్ పుట్ కేటగిరీలో రవి రొంగాలి రజతాలు గెలుచుకున్నారు. మహిళల క్లబ్ లో ఎఫ్ 32/51 కేటగిరిలో ఎక్తా ఖ్యాన్ కాంస్య పతకం సాధించింది.
షూటింగులో మూడు పతకాలు దక్కాయి. పురుషుల పీ-1 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఎస్ హెచ్- 1 కేటగిరీలో రుద్రాన్ 238.3 స్కోరుతో రజత పతకం సాధించింది. మనీశ్ నర్వాల్ 217.3 స్కోరుతో కాంస్య పతకం సాధించాడు. పీ-2 మహిళల ఎయిర్ పిస్టోల్ ఎస్ హెచ్- 1 కేటగిరిలో ఫ్రాన్సిస్ రుబినా 211.0 స్కోరుతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించింది.
కానో ఈవెంట్ లో ప్రాచి యాదవ్ సంచలనం సృష్టించింది. కానో కేఎల్ -2 కేటగిరీలో ఆమె 54.962 సెకన్లలో గమ్యాన్ని చేరుకుని గోల్డ్ మెడల్ సాధించింది. ఈ క్రీడలో తొలి బంగారు పతకం సాధించిన భారత క్రీడాకారిణిగా నలిచింది.
Rekha Boj : టీమిండియా ఫైనల్ లో గెలిస్తే.. బీచ్ లో నగ్నంగా పరిగెడతా.. ఆ హీరోయిన్ సంచలన కామెంట్స్..