BigTV English

Shraddha Kapoor: సాహో బ్యూటీ కొత్తకారు.. ధర ఎంతో తెలుసా?

Shraddha Kapoor:  సాహో బ్యూటీ కొత్తకారు.. ధర ఎంతో తెలుసా?
Shraddha Kapoor

Shraddha Kapoor: బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్.. ప్రభాస్ సాహోతో టాలీవుడ్ కి కూడా బాగా సుపరిచితురాలు. జున్ను ముక్కలా ఉండే ఈ అమ్మడు.. ప్రస్తుతం బాలీవుడ్ లో తన బ్యూటీతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. ముఖ్యంగా ఆషికి-2 మూవీ తర్వాత ఈ అమ్మడికి క్రేజ్ విపరీతంగా పెరిగింది. ఈ మూవీ తెలుగులోకి డబ్ కాకపోయినా సాంగ్స్ మాత్రం తెలుగు ప్రేక్షకులను ఫుల్ గా ఫ్లాట్ చేశాయి. బాలీవుడ్ లో బడా ఫ్యామిలీ కపూర్స్ నుంచి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రద్ధ కపూర్ డాన్స్ తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.


పండగ వచ్చింది అంటేనే ఏదో ఒక కొత్త వస్తువు కొనడం మనలో చాలామందికి అలవాటు. ఎవరి బడ్జెట్ కి తగ్గట్టు వాళ్ళు ఏదో ఒక వస్తువు తెచ్చుకోవాలి అనే ఆశిస్తారు. కొందరు కొత్త ఫోన్ కొనుక్కుంటే .. కొందరు ఫ్రిడ్జ్ ..కొందరు బైక్ ఇలా తమ అవసరాన్ని బట్టి బడ్జెట్ కు అనుగుణంగా ముందుగానే ప్లాన్ చేసుకొని పండక్కి తీసుకుంటారు. అయితే ఈ బ్యూటీ ఏకంగా పండక్కి కొన్న కొత్త వస్తువు ఏమిటో తెలుసా? ప్రస్తుతం ఈ విషయంతోపాటు, ఆ ఫోటో కూడా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది.

ఈ సాహో బ్యూటీ పండగ సందర్భంగా కొత్త కారు కొనుగోలు చేసింది. కారే కదా అందులో ఏంటి వింత అనుకుంటున్నారా.. కారు అంటే మామూలు కారు కాదండోయ్. అత్యంత ఖరీదైన లంబోర్గిని హురాకేన్‌ టెక్నికా కారును శ్రద్ధా పండగ సందర్భంగా తనకు తాను గిఫ్ట్ ఇచ్చుకుంది. ఈ కారు విలువ అక్షరాల నాలుగు కోట్ల రూపాయలు. మామూలుగానే లగ్జరీ కార్లకు లాంబొర్గిని పెట్టింది పేరు. పైగా ఈ కంపెనీ హై అండ్ కార్స్ లో అత్యాధునికమైన ఫీచర్స్ ఉంటాయి. శ్రద్ధ సెలెక్ట్ చేసుకున్న రెడ్ కలర్ కారు చెర్రీ లాగా మెరిసిపోతోంది.


దసరా సందర్భంగా మంగళవారం నాడు శ్రద్ధకు కార్ డెలివరీ చేసినట్లుగా ముంబై షోరూం యజమాని పూజా చౌదరి తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో ఫోటో షేర్ చేసి పోస్ట్ పెట్టింది. నిజంగా ఇది ఒక మరుపురాని ఘట్టమని.. తన దృష్టిలో లంబోర్గిని కార్ ఒక అద్భుతమైన మహిళకు అమ్మామని కూడా పూజా చౌదరి పేర్కొంది. దీనికి శ్రద్ధ కృతజ్ఞతలు తెలుపుతూ.. బాస్ ఉమెన్ దగ్గర నుంచి పొగడ్తలు రావడం నిజంగా ఎంతో గొప్పగా ఉంది.. గర్ల్ పవర్ ఆల్ ద వే.. అని రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం శ్రద్ధా కొత్త కారు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తన కొత్త రెడ్ కలర్ లంబోర్గిని కారును డ్రైవ్ చేస్తున్న శ్రద్ధా వీడియో కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అభిమానులు ఆమెకు దసరా పండుగ శుభాకాంక్షలు తోపాటు కెరియర్లో మంచి సక్సెస్ సాధించినందుకు అభినందనలు కూడా తెలియపరుస్తున్నారు. ప్రస్తుతం శ్రద్ధ కపూర్ స్త్రీ- 2 మూవీలో నటిస్తున్నారు. 2018లో వచ్చిన స్త్రీ మూవీలో శ్రద్ధా , రాజ్ కుమార్ తో కలిసి నటించింది. ఈ మూవీలో శ్రద్ధా ఒక మంత్రగత్త క్యారెక్టర్ పోషించింది అని లాస్ట్ లో రివీల్ అవుతుంది. దీనికి సీక్వెల్ గా వస్తున్న స్త్రీ- 2 మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

Related News

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Mother Teresa : మదర్ తెరిస్సా 115 జయంతి.. సేవా కార్యక్రమాలలోలయన్స్ క్లబ్, హెల్ప్ ఫౌండేషన్!

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big Stories

×