BigTV English

T20 World Cup 2024: కమిన్స్ కి ఆస్ట్రేలియా చెక్.. టీ 20 కెప్టెన్ గా మార్ష్..?

T20 World Cup 2024: కమిన్స్ కి ఆస్ట్రేలియా చెక్..  టీ 20 కెప్టెన్ గా మార్ష్..?
T20 World Cup 2024
Mitchell Marsh set to Captain Australia in T20 World Cup 2024: వన్డే వరల్డ్ కప్ 2023ని అందించిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ను తీసి పక్కన పెట్టే అవకాశాలున్నాయి. జూన్ లో జరగనున్న టీ 20 ప్రపంచకప్ నకు మిచెల్ మార్ష్ కెప్టెన్ గా ఎంపికయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే టీ 20లో తనకి ఘనమైన రికార్డ్ ఉంది. అందుకే ఆ జట్టు కోచ్ ఆండ్రూ మెక్ డొనాల్డ్ టీ 20 పగ్గాలు మార్ష్ కి అందించాలని పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది.

జార్జ్ బెయిలీ అధ్యక్షుడిగా ఉన్న సెలక్షన్ కమిటీలో మెంబర్ అయిన మెక్ డొనాల్డ్…టీ 20 ప్రపంచ కప్ విషయంలో గట్టి పట్టు పడుతున్నట్టు సమాచారం. మరోవైపు విపరీతమైన క్రికెట్ ఆడుతున్న 30 ఏళ్ల కమిన్స్ కూడా టీ 20లో సారథ్యం వహించడానికి అంత మక్కువ చూపించడం లేదని తెలిసింది. ఎందుకంటే రేపు కోచ్, కెప్టెన్ కలిసి పనిచేయాల్సి ఉంటుంది.


Also Read: మేం వచ్చాం.. మరి మీరొస్తారా? భారత్ రాక కోసం ఎదురుచూస్తున్న పాక్

ఆల్రడీ తను టీ 20కి పనికిరాడని కోచ్ అనుకున్న తర్వాత, ఇంక తనెంత నిరూపించుకున్నా ఫలితం ఉండదు. ఒకవేళ ఓటమి పాలైతే, నేనప్పుడే చెప్పానని అంటాడు. అందువల్ల కోచ్ కి ఇష్టం లేదని తెలిసిన తర్వాత తను సారథిగా కొనసాగడం కరెక్టు కాదని, చెబితే తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని సన్నిహితులు అంటున్నారు.


ఈ క్రమంలో త్వరలో జరగనున్న ఐపీఎల్ 2024 సీజన్ లో సన్ రైజర్స్ హైదరబాద్ కి కెప్టెన్ గా కమిన్స్ వస్తున్నాడు. ఇప్పుడు కోచ్ మీద ఉన్న కసితో వస్తున్నాడని, ఐపీఎల్ లో తనేమిటో నిరూపించుకుని సన్ రైజర్స్ కి కప్ తీసుకొస్తాడని నెట్టింట అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

మరోవైపు ఆస్ట్రేలియా కోచ్ వద్దన్న కమిన్స్ ను సన్ రైజర్స్ తెచ్చుకుంది. అంతేకాదు ఏరికోరి రూ.20.5 కోట్లు పెట్టి మరీ తెచ్చుకున్నామని సన్ రైజర్స్ ఫ్రాంచైజీ అప్పుడే మదనపడుతున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. మొత్తానికి కమిన్స్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×