BigTV English

Mohammad Shami: టీమిండియా క్రికెటర్‌పై గృహ హింస కేసు మళ్లీ తెరపైకి..

Mohammad Shami: టీమిండియా క్రికెటర్‌పై గృహ హింస కేసు మళ్లీ తెరపైకి..

Mohammad Shami: కొందరి క్రికెటర్స్ జీవితాలు గ్రౌండ్‌లో సంతోషంగా ఉన్నా.. పర్సనల్ లైఫ్‌కు వచ్చేసరికి చాలా డార్క్‌గా ఉంటాయి. అయినా వారి పర్సనల్ లైఫ్ గురించి అంతా పక్కన పెట్టేసి, గ్రౌండ్‌కు వచ్చి వారి దేశాన్ని గెలిపించడం కోసం టీమ్‌తో కలిసి కృషిచేస్తారు. అలా టీమిండియాలోని పలువురు క్రికెటర్ల జీవితాల వెనుక కూడా ఎన్నో కాంట్రవర్సీలు ఉన్నాయి. అందులో టీమిండియాలో బెస్ట్ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్న మహ్మద్ షమీ పేరు కూడా ఉంటుంది. తాజాగా తనపై ఉన్న గృహ హింస కేసు మళ్లీ తెరపైకి వచ్చింది.


ప్రస్తుతం ప్రపంచంలోని క్రికెట్ టీమ్స్ అన్నా వరల్డ్ కప్‌కు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ఈసారి ఇండియాలో కూడా పలు మ్యాచ్‌లు జరుగుతుండడంతో సొంత గడ్డపై ఎలాగైనా విజయాన్ని సాధించాలని టీమిండియా భావిస్తోంది. ఇంకా ఈ పెద్ద టోర్నమెంట్‌కు మూడు నెలలే ఉండగా.. మహ్మద్ షమీ వరల్డ్ కప్‌లో పాల్గొనలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆసియా కప్, వరల్డ్ కప్ కోసం వెస్టిండీస్ సిరీస్‌కు షమీ దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం ఫుల్‌గా ప్రాక్టీస్ కొనసాగిస్తూ ఉండడంతో షమీ విశ్వరూపాన్ని వరల్డ్ కప్‌లో చూడవచ్చని తన ఫ్యాన్స్ ఎదురుచూస్తూ ఉన్నారు. ఇంతలోనే వారికి పెద్ద షాక్ తగిలింది.

2018లో మహ్మద్ షమీ భార్య హసిన్ జహాన్ గృహహింసతో పాటు తన భర్త వల్ల ఎదుర్కుంటున్న ఇతర సమస్యల గురించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసును విచారించిన అలీపూర్ సెషన్స్ కోర్టు 2019 ఆగస్టు 29న షమీని అరెస్ట్ చేయాలని ఆదేశించింది. షమీ మాత్రం తాను ఏ తప్పు చేయలేదంటూ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కౌంటర్ అప్పీల్ చేశాడు. తన అప్పీల్‌ను స్వీకరించి అరెస్టును పోస్ట్‌పోన్ చేసింది కోర్టు. తాజాగా షమీ భార్య తనకు త్వరగా న్యాయం చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో నెల రోజుల లోపు ఈ కేసులో నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.


నెల రోజుల్లో షమీపై ఉన్న కేసు విషయంలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు రావడంతో షమీతో పాటు ఫ్యాన్స్‌లో కంగారు మొదలయ్యింది. ఒకవేళ నెలరోజుల్లో ఈ కేసుపై ఎలాంటి నిర్ణయం రాకపోతే అరెస్ట్ తప్పదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే వరల్డ్ కప్ మొదలయ్యే సమయానికి షమీ పర్సనల్ లైఫ్‌లో ఉన్న ఇబ్బందుల వల్ల తను ఆడగలుగుతాడా లేదా అని అందరిలో సందేహాలు మొదలయిపోయాయి. ఈ విషయంలో అరెస్ట్ అయితే మాత్రం తన కెరీర్‌కే పెద్ద మచ్చగా ఉండిపోతుందని భావిస్తున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×