
Janasena latest updates(Andhra Pradesh today news): మంగళగిరిలో డీజీపీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. డీజీపీ ఆఫీస్ దగ్గరికి జనసేన వీర మహిళలు భారీగా చేరుకున్నారు. పవన్ కల్యాణ్, ఆయన సతీమణి అన్నాపై అసభ్యకర పోస్టులపై వీర మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యంతరకర పోస్టులు పెడుతున్న వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదే అంశంపై డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు వీర మహిళలు ప్రయత్నించారు. అయితే డీజీపీ ఆఫీస్ దగ్గర వీర మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. సాయంత్రం తర్వాత ఐదారుగురిని మాత్రమే లోనికి అనుమతిస్తామని చెప్పారు. వీర మహిళలు మాత్రం తామంతా వెళ్లి డీజీపీకి ఫిర్యాదు చేస్తామని పట్టుబట్టారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో.. రోడ్డు మీదే కూర్చుని నిరసన తెలపడంతో ఉద్రిక్తత తలెత్తింది.