E-Paper
Advertisement

Mohsin Naqvi: ఆస్ట్రేలియాను ఓడించాం, ఇక నెక్ట్స్ ఇండియాను మ‌ట్టిక‌రిపిస్తాం

Mohsin Naqvi: ఆస్ట్రేలియాను ఓడించాం, ఇక నెక్ట్స్ ఇండియాను మ‌ట్టిక‌రిపిస్తాం
Advertisement

Mohsin Naqvi:  ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ (Australia vs Pakistan) మధ్య వన్డే సిరీస్ (Australia tour of Pakistan 2026) కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ వన్డే సిరీస్ లో అద్భుతంగా రాణించిన పాకిస్తాన్… ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. నిన్న మూడో వన్డేలో విజయం సాధించి…2-1 తేడాతో వన్డే సిరీస్ కూడా కైవసం చేసుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కంటే ముందు ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య టి20 సిరీస్ జరగగా.. అందులోనూ అద్భుతంగా రాణించి టైటిల్ కైవసం చేసుకుంది పాక్. ఇక ఇప్పుడు వన్డే సిరీస్ కైవసం చేసుకున్న నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ న‌ఖ్వీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టును చిత్తు చేసాం.. ఇక నెక్స్ట్ ఇండియాను మట్టి కరిపిస్తామని ఛాలెంజ్ విసిరారు. వరల్డ్ కప్ లేదా ICC టోర్నమెంట్లలో ఎక్కడ టీమిండియాతో ( Team India) ఫైట్ జరిగినా… చిత్తు చిత్తుగా ఓడిస్తామంటూ ప్రకటన చేశారు మొహ్సిన్ న‌ఖ్వీ (Mohsin Naqvi). దీంతో మొహ్సిన్ న‌ఖ్వీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనికి అదే స్థాయిలో ఇండియన్ అభిమానులు కూడా కౌంటర్ ఇస్తున్నారు.

Also Read: Ambati Rayudu: బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి Ambati Rayudu!

ఆస్ట్రేలియాను ఓడించాం, ఇక నెక్ట్స్ ఇండియాను మ‌ట్టిక‌రిపిస్తాం

Advertisement

సొంత గడ్డపై ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది పాకిస్తాన్. ఈ క్రమంలో ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. అయితే ఈ వన్డే సిరీస్ గెలిచిన తరుణంలో టీమిండియాకు వార్నింగ్ ఇచ్చారు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మొహ్సిన్ న‌ఖ్వీ (Mohsin Naqvi). భయంకరమైన ఆస్ట్రేలియా జట్టును ఓడించాం… ఇక నెక్స్ట్ ఇండియాను ఓడిస్తామంటూ శపథం చేశారు. ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టును ఓడించిన నేపథ్యంలో.. పాకిస్తాన్ క్రికెట్ జట్టు సభ్యులలో ఆత్మవిశ్వాసం పెరిగిందని వెల్లడించారు. ఇదే ఊపుతో ఇండియాను కూడా కచ్చితంగా ఓడిస్తామంటూ ప్రకటించారు. ఏ రోజు అనేది చెప్పం కానీ… కచ్చితంగా ఇండియాను ఓడించి తీరుతామంటూ కరాకండిగా చెప్పారు. దీంతో మొహ్సిన్ న‌ఖ్వీ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ఆస్ట్రేలియా C జట్టుపై గెలిచి పాకిస్తాన్ పోకడలు

స్టార్ క్రికెటర్లు ఎవరూ లేకుండానే పాకిస్తాన్ దేశంలో పర్యటించింది ఆస్ట్రేలియా. దాదాపు ఆస్ట్రేలియా C టీమ్ పాకిస్తాన్ తో ఆడిందని చెప్పవచ్చు. జోష్ ఇంగ్లిస్ లాంటి యంగ్ కుర్రాడికి కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చారు. అతని ఆధ్వర్యంలోనే… పాకిస్తాన్ తో తలపడింది ఆస్ట్రేలియా. ఈ క్రమంలోనే విక్టరీ సాధించింది. అదే బలమైన ఆస్ట్రేలియా జట్టు పాకిస్తాన్లో పర్యటించి ఉంటే.. సీన్ వేరే లాగా ఉండేది. ఇదే చెబుతున్నారు ఇండియన్ ఫ్యాన్స్. కీల‌క ప్లేయ‌ర్లు లేని, ఆస్ట్రేలియాను ఓడించ‌డం మ‌గ‌తనం కాదంటూ కౌంట‌ర్లు ఇస్తున్నారు.

Advertisement

Also Read:  Tanveer Ahmed: బాబ‌ర్ ను ( babar azam) ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×