Most Viewed IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 18వ సీజన్ ఆసక్తికరంగా కొనసాగుతుంది. ఓవైపు జట్లు ధనాధాన్ క్రికెట్ తో అదరగొడుతుంటే.. వ్యూస్ లో జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ వ్యూవర్ షిప్ లో సరికొత్త రికార్డులను సృష్టించాయి. ఈ సీజన్ లో జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ కి 41.7 కోట్ల వ్యూవర్ షిప్ దక్కింది. ఇలా ఐపీఎల్ పలు విధాలుగా తన రికార్డులను తానే అధిగమించుకుంటూ ప్రపంచంలోనే అత్యంత జనాధారణ పొందిన క్రికెట్ లీగ్ గా సత్తా చాటుతుంది.
ముఖ్యంగా ఈ ఎడిషన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు {ఆర్సీబీ} హవా నడుస్తోంది. ప్రతి సీజన్ లో పడుతూ లేస్తూ పోయే ఈ జట్టు.. కనీసం ప్లే ఆఫ్స్ కి చేరుకుంటే గొప్ప అనే పరిస్థితి ఉండేది. కాలం కలిసి వచ్చి ఒకవేళ ప్లే ఆఫ్స్ కి చేరుకున్నా.. అక్కడినుండి ముందుకు వెళ్లలేకపోయేది. దీంతో ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఆర్సిబి ట్రోఫీని అందుకోలేదు. కానీ ఈ 18వ సీజన్ లో వరుస విజయాలతో హోరెత్తిస్తోంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.
ఈ సీజన్ లో ఇప్పటివరకు ఆర్సిబి ఆడిన 4 మ్యాచ్లలో.. మూడింట విజయం సాధించి ఒక మ్యాచ్ లో ఓటమిని చవిచూసింది. దీంతో పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో ఆర్సిబి వ్యూవర్షిప్ లోను దుమ్మురేపుతోంది. ఏకంగా 41 కోట్ల వ్యూవర్షిప్ మార్క్ ని దాటింది. ఈ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు – కలకత్తా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కి ఏకంగా 41.7 కోట్ల వ్యూస్ వచ్చాయి.
ఆ తర్వాత బెంగళూరు – చెన్నై మ్యాచ్ కి 37.4 కోట్లు, బెంగుళూరు – ముంబై మ్యాచ్ కి 34.7 కోట్ల వ్యూస్ వచ్చాయి. అయితే ఈ సీజన్ లో మరే జట్టుకు ఇన్ని వ్యూస్ రాకపోవడం గమనార్హం. ఆర్సిబి కొత్త కెప్టెన్ రజత్ పటిదార్.. ఆ జట్టును అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నాడు. దీంతో ఆ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే ఆడియన్స్ ఆర్సిబి మ్యాచ్ ల కోసం భారీగా ఎగబడుతున్నారు. ఆర్సిబి మ్యాచ్ అంటే చాలు టీవీలు, ఫోన్లకు అతుక్కుపోతున్నారు.
అందుకే ఈ జట్టు ఆడే మ్యాచ్ లకు అత్యధిక వ్యూస్ వస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే ఈ సీజన్ ఎండింగ్ లోపు వ్యూవర్ షిప్ విషయంలో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు కొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అంటున్నారు క్రికెట్ లవర్స్. ఇలా ఆర్సిబి మ్యాచ్ లతో బ్రాడ్కాస్టింగ్ సంస్థ జియో హాట్ స్టార్ కూడా పండగ చేసుకుంటుంది. ఇక ఆర్సిబి జట్టుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరోవైపు జియో కూడా యూజర్లకు కొన్ని ప్రత్యేకమైన రీఛార్జ్ ప్లాన్స్ ని తీసుకువచ్చి అధిక లాభాలను అర్జిస్తోంది.