Big Stories

WPL : విజయాల్లో ముంబై.. పరాజయాల్లో బెంగళూరు.. సిక్సర్..

WPL : మహిళల ప్రీమియర్ లీగ్ లో ముంబై జట్టు మళ్లీ గెలుపు పట్టాలెక్కింది. ఐదు వరుస విజయాల తర్వాత రెండు మ్యాచ్ ల్లో హర్మన్ సేన ఓడిపోయింది. అదే సమయంలో 5 వరుస పరాజయాల తర్వాత బ్యాక్ టు బ్యాక్ విజయాలతో బెంగళూరు ఫామ్ లోకి వచ్చింది. ఈ సమయంలో ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన RCB నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేసింది. బెంగళూరు జట్టులో కెప్టెన్ స్మృతి మంధాన (24), ఫెర్రీ (29), రిచా ఘోష్ (29) మాత్రమే ఫర్యాలేదనిపించారు. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బెంగళూరు జట్టు స్వల్ప స్కోర్ కే పరిమితమైంది. అమేలియా కెర్ర్ 3 వికెట్లు, నాట్ స్క్రివెర్ బ్రంట్, వాంగ్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

- Advertisement -

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకు ఓపెనర్లు హేలీ మథ్యూస్ (24), యాస్తికా భాటియా (30) మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. తొలివికెట్ కు 53 పరుగులు జోడించారు. అయితే ఓపెనర్లు వెంటవెంటనే అవుట్ కావడం, ఆ తర్వాత నాట్ స్క్రివెర్ బ్రంట్ (13), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (2) తక్కువ స్కోర్ కే పెవిలియన్ చేరడంతో ముంబై 73 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. దీంతో మ్యాచ్ పై ఉత్కంఠ రేగింది.

- Advertisement -

అయితే ఆల్ రౌండర్లు అమేలియా కెర్ర్ (31 నాటౌట్) , పూజా వస్త్రాకర్ (19) 5వ వికెట్ కు 47 పరుగులు జోడించి ముంబైను విజయం దిశగా తీసుకెళ్లారు. పూజా వస్త్రాకర్ , వాంగ్ (0) వెంటవెంటనే అవుట్ అయినా ..అమేలియా కెర్ర్ ముంబైను గెలుపు తీరాలకు చేర్చింది. దీంతో ముంబై 16.3 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. అటు బౌలింగ్ , ఇటు బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించిన అమేలియా కెర్ర్ కు ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

WPLలో ఇప్పటి వరకు ముంబై 8 మ్యాచ్ లు ఆడి 6 విజయాలు, 2 పరాజయాలతో టాప్ పొజిషన్ లో ఉంది. ఢిల్లీ జట్టు 5 విజయాలు , 2 ఓటములతో రెండోస్థానంలో నిలిచింది. యూపీ వారియర్స్ 4 విజయాలు, 3 పరాజయాలతో 3వ స్థానంలో ఉంది. బెంగళూరు , గుజరాత్ జట్లు 6 పరాజయాలు, 2 గెలుపులతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News